Friday, November 25, 2022

:::: ఉద్వేగాలు::::

 *::::::::: ఉద్వేగాలు:::::::::* 
      మనకు రొజువారి జీవితంలో అనేక సంఘటనలు ఎదురు అవుతూ వుంటాయి.
ఇవన్నీ మనలో వివిధ ఉద్వేగాలను కలిగిస్తాయి.
         అలా ఉద్వేగం కలిగినప్పుడు , ఈ ఉద్వేగానికి కారణం బాహ్య సంఘటన  అనుకుంటాము.   కాదు.
      1)జరిగిన సంఘటనని మనం ఎలా అర్థం చేసుకున్నాము,2) ఎలా స్పందించాము,3) ఎలా అది మనతో సంబంధం కలిగి వున్నది, అన్న అంశాలు ఆధారంగా ఉద్వేగం కలుగు తుంది..
    ఒక రకమైన సంఘటన పట్ల అనేక రకాలుగా మనం స్పందించ గలము.
   ఏది సరైన స్పందన,ఏది తగు భావోద్వేగం అనేది ఆ సమయంలో మనస్సు యొక్క స్థితి ఎలాంటిది అన్న అంశం ప్రాధాన్యం.
      *ధ్యానం లో ఉన్న మనస్సు మాత్రమే తగు స్పందనని, ఉద్వేగాన్ని వ్యక్తం చేయగలదు.*

షణ్ముఖానంద9866699774

No comments:

Post a Comment