Tuesday, November 22, 2022

 తొందర పడకురా
సుందర వదనా!
అహం అన్నదానికి గర్వం అనే కాకుండా నేను, నాది అనే భావన అన్న అర్థం కూడా ఉన్నది కదరా.
ఆలు సుతులు మాయ
అన్న దమ్ములు మాయ
నీవు మాయ కడకు నేనూ మాయ,,,అని అన్నాడు గా ఓ కవి.
ఇంకా బాధ దేనికోసం.
అవమానము ఎవరికీ, ఎందుకు మరీ,,,,
మనం కోరుకున్నట్టుగానే  జన్మ దొరకదు కదా,,,
తల్లి తండ్రులు, తోబుట్టువులు, ధారా సుతులతో బంధానికి కారణం,,,,
ఋణానుబంధ రూపేణా
పశు- పత్నీ సుతాలయ,,,, అని అన్నారు పెద్దలు.
గత జన్మలో మనం చేసిన శుక్ల,కృష్ణ క్రియా ఫలాల ఆధారంగానే జన్మ జన్మ బంధాలు కదా,,,,
వాటినే ప్రాప్తం అంటారు కదరా అబ్బాయ్,,,,
అన్నీ మన చేతుల్లోనే ఉంటే, అన్నీ మనం అనుకున్నట్టే జరగాల్సినదై ఉంటే,,,,,
సరే మనమంటే, మన తల్లి తండ్రులు బాధ్యతా రహితంగా ఉండడంతో, వాళ్ళ అసమర్థత వల్లే చేరవలసిన స్థాయి కి చేరలేదు అనుకుంటే, 
మరి మనం చాలా సమర్థులం, బాధ్యతతో మెదిలాము అని అనుకుంటున్నాం కదా, మరి మన సంతానం, మనం ఆదేశించినట్టు గా వాళ్ళు అనుకున్నట్టుగా ఎందుకు ఎదగలేక పోతున్నారు.
దీనికి కారణం ఏమై ఉంటుందో చెప్ప గలమా,,,
ఏదీ మన చేతిలో లేదు .
మనం మన పాప పుణ్యాల లెక్కలను బట్టి, ఆ జన్మ కు తగ్గట్టుగా దొరుకుతాయి కదా ఈ బంధాలైనా, బాధ్యతలైనా, కష్ట సుఖాలైనా,,,,
అవశ్యం అనుభవ భోక్తం
కృతం కర్మ శుభాశుభం కదా.
 అంతా మన ప్రాప్తం. ‌ ఆపై దైవానుగ్రహం మాత్రమే రా అబ్బాయ్,,
అందుకే కొసరాజు గారు అన్నారు కదా,,,,
సాగినంత కాలం నా అంత వాడు లేడందురూ
సాగకపోతే ఊరకే చతికిలబడి పోదురు,,, అని.
ఇంకా చెప్పేదేముంది రా అబ్బాయ్,,,,
అందుకే అన్నారు పెద్దలు,,,
తలచినదే జరిగినదా దైవం ఎందులకు,,
జరిగినదే తలచితివా శాంతి లేదు నీకు,,,,అని.,,,
     అందుకే కొద్దిగా ఆలోచించి అన్ని రకాల సమస్యలకు మూల కారణం వెతికి సరైన సాధన ద్వారా తెచ్చుకున్న మంచి చెడు కర్మల ఆధారంగా తయారైన వ్రాసుకున్న నుదుటి వ్రాతలు ఆధారంగా జన్మ డిజైన్ చేసుకున్న తెచ్చుకున్న డిజైన్ సరైన సాదన ద్వారా మార్చుకుని నుదురుని శ్వేత పత్రం అనగా తెల్లకాగితం గా చేసుకొని అధ్బుతమైన ఆలోచనలు ద్వారా ఆనందకర జీవితాన్ని అనుభవిస్తూ ఉండడానికి పాజిటివ్ వ్రాతలు వ్రాసుకునే అవకాశం నిరాకారుడు అయిన భగవంతుడు, ఆ మార్గాన్ని గురువుల ద్వారా మాత్రమే తెలుసుకొని సరైన సాధన మాత్రమే చేయండి.
     సాధారణ వ్యక్తులుగా ఉన్నవారందరూ సరైన సాధన ద్వారా ఆద్యాత్మిక శక్తులుగా ఎదగండి...
పసుపుల పుల్లారావు, ఇల్లందు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ రాష్ట్రం
9849163616

No comments:

Post a Comment