Wednesday, November 30, 2022

 ప్రశ్న : కర్మలు ఎక్కడనుండి వస్తాయి?

జవాబు : కామ, క్రోధ, మోహ, మద, లోభ, మాత్సర్యాలనే "అరిషడ్వర్గాల" నుండి...

ప్రశ్న : ఇవి ఎక్కడ నుండి వస్తాయి ?

జవాబు : ఆలోచన, సఙ్కల్పము, స్పందన, ఆశ, భయము, ఆనందముల నుండి...

ప్రశ్న : ఇవి మరల ఎక్డ నుండి వస్తున్నాయి?

జవాబు : సత్వరజస్తమో గుణాల నుండి ( సత్వ గుణము, రజో గుణము, తమో గుణములు)

ప్రశ్న : ఈ సత్వరజస్తమో గుణాలెచట నుండి వస్తాయి?

జవాబు : ఇచ్ఛా శక్తి, జ్ఞాన శక్తి, క్రియా శక్తుల నుండి వస్తాయి.

ప్రశ్న : ఇవి ఎచట నుండి వస్తాయి ?

జవాబు : మనస్సు, బుద్ధి, అహంకారము నుండి...

ప్రశ్న : ఇవి ఎచట నుండి ఉత్పన్నమౌతాయి ?

జవాబు : ప్రాణ శక్తి నుండి...

ప్రశ్న : ప్రాణము ఎలా సృష్టింపబడుతుంది? ఎలా పోషింపబడుతుంది?

జవాబు : ఆహారము నుండి. సాత్వికాహారము భుజిస్తే మనస్సు సత్వ గుణాన్ని, రజో గుణాహారం తీసుకుంటే మనస్సు రజో గుణాన్ని, తమోగుణాహారం తీసుకుంటే మనస్సు తమో గుణాన్ని కలిగియుంటుంది.

అంటే తినే ఆహారాన్ని బట్టి మనస్సు ఉంటుంది, మన కోరికలుంటాయి, మన ఆలోచనా విధానముంటుంది, మనస్సును బట్టి గుణాలుంటాయి, వీటిని బట్టి మన భావాలుంటాయి. వీటిని బట్టి మన కర్మలుంటాయి, మన జన్మ పరంపర ఉంటుంది.

No comments:

Post a Comment