Saturday, November 26, 2022

ప్రశ్న : - "స్వప్నము"లో ఎరుక రావడానికి ఏం చెయ్యాలి ? (Or) "సాక్షిత్వ అనుభవం" పొందడం ఎలా?

 [11/26, 08:01] +91 73963 92086: జై బాబా

సద్గురు శ్రీ మెహెర్ చైతన్యజీ మహరాజ్

స్వప్నములో "ఎరుక" రావాలంటే ఏం చెయ్యాలి?
*****

ప్రశ్న : - "స్వప్నము"లో ఎరుక రావడానికి ఏం చెయ్యాలి ?      (Or)
"సాక్షిత్వ అనుభవం" పొందడం ఎలా?

గురుదేవులు : - రెండు విషయాలు చెప్పారు. నీకు "అనుభవం" పొందాలి అనేటువంటి జిజ్ఞాసే ఉన్నట్లయితే...

 1)  "స్వప్నానుభవము" ఏ విధమైనటువంటి అసత్యమని నీవు అనుకున్నావో, అసత్యమని నీవు విశ్వసించావో, అదే విధముగా– "భౌతికానుభవము" కూడా అసత్యమని విశ్వసించు. 

2)   "స్వప్నానుభవము యొక్క ఎరుక" నీవు పొందడము కోసం...
ఇంద్రియములన్నీ ఉపసంహరింప బడినటువంటి
 స్థితిలో, "అవన్నీ పని చేస్తున్నవి" అనేటువంటి "ఎరుక" నీవు కలిగి ఉండు.

అవన్నీ నిద్రపోతున్నప్పటికీ కూడా నీవు మెలకువగా ఉండు.
"కన్ను చూస్తుంది, చెవి వింటుంది, ఇంద్రియములన్నీ వాటి వాటి పనులు చేస్తున్నవి" అనేటువంటి ఎరుక కలిగి, దానికి అవసరంగా...
ఒక ఆలంబనంగా భగవంతుని యొక్క నామాన్ని స్మరిస్తూ,
భగవంతుని యొక్క నామస్మరణ యొక్క ఎరుకలో నీవు నిద్రపో.
నీవు మేలుకోవడంలో, ఇంద్రియములన్నీ నిద్రపోవడం చేత... నీకు అలసట ఉండదు. 
ఆ విధముగా, స్వప్నానికి సాక్షియై ఉండగలుగుతావు.

స్వప్నానికి ఎప్పుడైతే సాక్షియై ఉన్నావో, "వేకువ"లో కూడా నీవు సాక్షిత్వ అనుభవాన్ని నీవు పొందగలుగుతావు. ఈ రెండూ పాటించండి sincereగా.

ప్రశ్న : - నిద్రపోతున్నప్పుడు ఒక్కొక్కసారి నా గురక నాకే వినిపిస్తుందండి...

గురుదేవులు : -  మీరు ఎలాగ బయటుండి వింటారో, మీ మాదిరే నేనూ వింటుంటాను. వింటూ ఉండి, "నేను కాదు గురక పెట్టేది" అని అనిపిస్తుంటుంది
నాకు సుస్పష్టంగా. (అంటే)
నేను గురక పెడితే, మీరు వింటే, ఎంత సుస్పష్టంగా మీరు విని "ఆయన ఎలాగ గురకపెడుతున్నాడో!" 
అని అనుకుంటారో, అలాగ నా గురక నేను వింటుంటాను. సుస్పష్టంగా తెలుస్తుంది,
"నేను కాదు గురక పెడుతున్నది" అని.

ప్రశ్న : - "స్వప్నం" కూడా ఆ విధంగానే సుస్పష్టంగా తెలియబడుతుందాండీ ?

గురుదేవులు : -  సుస్పష్టంగా కాకపోయినా, స్వప్నానికి తాను అన్యమై ఉన్నటువంటి feeling కూడా ఉంటుంటుంది కొంతమందికి.
అది జాగ్రత్తగా దానిని పట్టుకొని develop చేసుకున్నట్లయితే, దానికి అన్యమైపోయి ఉండేటువంటి అవకాశము ఉంటుంది.

కేవలము, మానసికమైనటువంటి "అవగాహన",
మానసికమైనటువంటి "నిశ్చయము"
ఈ రెండే అవసరమండీ. 
ఇక మిగిలినటువంటి హఠయోగాలు ఇవన్నీ (చేసేవారు) "ఇదంతా ప్రాణాయామం ద్వారా సాధించవచ్చు" అంటారు. 
మరొక ఏవేవో సాధనల ద్వారా సాధించవచ్చు అంటారు. వాటి వల్ల ఏమీ సాధించలేము. (కావలసినటువంటిది) కేవలము
మానసిక అవగాహన,
మానసిక నిశ్చయము.

(సద్గురు సంపూర్ణ ప్రవచనావళి- 15
Pg : - 215- 216)

ప్రశ్న : - "స్వప్నము" అంటే నిర్వచనము ఏమిటి? ఏ అనుభవాన్ని "స్వప్నము" అంటారు (Or)
"స్వప్నము" అనేది ఎప్పుడు, ఎలా, ఏ పరిస్థితుల్లో వస్తుంది?
గురుదేవులు : -  "సంస్కారములు" వ్యక్తమవ్వవలసినటువంటి అవసరమున్నది. అయినా (ఒక్కోసారి) వ్యక్తమవ్వవలసినటువంటి అవసరమున్నా, వ్యక్తము కాలేవు. అప్పుడు ఉండేటువంటి స్థితి ఏమిటి?
ఇంద్రియములన్నీ వాటి వాటి పనుల నుండి
ఉపసంహరించుకున్నవి.
అయినప్పటికీ కూడా స్వవిషయం మీద తాదాత్మ్యత ఉన్నది. ఏమిటిది?
వ్యక్తమవ్వవలసినటువంటిది,
అనుభవించవలసినటువంటి స్థితిలో ఉన్నది కనుక,
దానిని, ఆ అనుభవాన్ని "స్వప్నము" అన్నారు.

"స్వప్నము" యొక్క నిర్వచనము : - "సంస్కారము" వ్యక్తమవ్వాలి, వ్యక్తమవ్వలేదు.
అయినప్పటికీ కూడా, ఆ విషయము యొక్క అనుభవము తెలియబడాలి, అనుభవింపబడాలి.
మరి అనుభవించడానికి ఇంద్రియాలు పని చేయాలి.
కానీ, ఇంద్రియాలు వాటి వాటి పనులు మానివేసినవి. 
పని చేయడం మానివేసినవి, ఉపసంహరింపబడ్డవి.
అయినా "అనుభవము" పోలేదు, అనుభవింపబడింది.
ఆ అనుభవాన్ని "స్వప్నానుభవము" అన్నారు.

 ప్రశ్న : - ఈ "స్వప్నానుభవము"లో ఎరుక రావడానికి  సాంప్రదాయకులు తెలియజేసిన మార్గం ఏమిటి? మెహెర్ బాబా ఇచ్చిన ఉపాయం ఏమిటి? (Or)
"స్వప్నం యొక్క ఎరుక" రావాలంటే...?
       
గురుదేవులు : - ఈ "స్వప్నానుభవము"లో వ్యక్తి, "ఎరుక" కలిగి ఉండాలి అనంటే, సురేశ్వరులు తన యొక్క వార్తికంలో వ్రాస్తారు...
తెలియని వ్యక్తి స్వప్నములోకి వెళుతున్నాడు.
అనుభవించవలసినటువంటి కర్మను, ఇంద్రియములు"చెయ్యను!" అని ఉపసంహరింపబడితే,
ఆ అనుభవాన్ని స్వప్న రూపంలో అనుభవిస్తున్నాడు
"జీవుడు" అని చెప్పారు. 
మరి "జీవుడు" తాను అనుభవిస్తున్నప్పుడు...
"నేను అనుభవిస్తున్నాను!" అని వేకువలో మాదిరి,
తనకు "ఎరుక" ఉండుట లేదు (స్వప్నంలో).
"ఎరుక ఉండడానికి ఒక ఉపాయము చెబుతున్నాను" అని ఉపాయము చెప్పారు. ఏమిటట?
ఏ ఇంద్రియములు ఉపసంహరింపబడ్డవో...
"మేము ఇంక పనేమీ చేయము, విశ్రాంతి తీసుకుంటాము" అని, ఆ ఇంద్రియములను
వాటి వాటి పనులు చేయకనే, చేస్తున్నటువంటి భావన కలిగి ఉండమన్నారు.
[11/26, 08:01] +91 73963 92086: (అంటే, నిద్రకు ఉపక్రమించిన్నప్పుడు) కన్ను "నేను చూడలేను" అని, ఇంక నిద్రపోవాలని కళ్ళు మూసుకుంటుంది,
"మేము వినము" అని చెవులు మూసుకుంటున్నాయి,
"మేము కదలము" అని కాళ్ళు చేతులు చాపేసేసి
పరున్నాయి.
ఈ స్థితిలోకి వచ్చేటప్పటికి, అనుభవించ వలసినటువంటి ఈ సంస్కారం ఉన్నదే– అది, ఖర్చుపెట్టబడిపోతుంది, (ఇంక  ఎరుక అనే సమస్య ఉండదు అక్కడ).అది "స్వప్నానుభవం".

కానీ, "ఇది స్వప్నం, నేను అనుభవిస్తున్నాను"
అనేటువంటి "ఎరుక"కావాలి, దానిని అధిగమించాలి అంటే.
ఆ "ఎరుక" కోసం ఏమి చేయాలి?
"నేను చూడను అని కళ్ళు మూసుకున్నటువంటి
దానిని, మళ్ళీ కళ్ళు తెరచి చూడకు, కానీ చూస్తున్న భావన చేయి" అన్నారు.
చెవి వినక్కరలేదు. వింటున్నటువంటి భావన చేయమన్నారు.
ఇవేమీ పనిచేయనక్కరలేదు, కానీ ఇవి పని చేస్తున్నటువంటి భావనలో నీవు ఉండు అన్నారు. అంటే,"నిద్ర కానటువంటి స్థితి". 
అంటే, ఇంద్రియములన్నీ వాటి వాటి పనులు మాని,
 "నిద్రావస్థ"కు వెళ్ళినప్పటికీ, దానితో (ఇంద్రియములతో) తాదాత్మ్యత చెంది ఉన్నటువంటి నీవు మాత్రం నిద్రపోకుండగా ఉండు.
అలా నిద్రపోకుండగా నీవు ఉన్నప్పుడు, ఏమి జరుగుతుంది?
ఈ స్వప్నంలో ఉండేటువంటి ఈ తంతు అంతా,
నీవు సాక్షీమాత్రుడవ చూడగలుగుతావు,
తెలుసుకోగలుగుతావు.
ఈ అనుభవమంతా..."ఓహో! ఈ అనుభవాన్ని నేను ఇలా అనుభవిస్తున్నాను" అని దానికి అన్యముగా ఉండి నీవు తెలుసుకోగలుగుతావు.

మెహెర్ బాబా దానికి చిన్న ఉపాయం చెప్పారు : - నిద్రపోతున్నప్పుడు ఏమీ అక్కర్లేదు, నా నామాన్ని జ్ఞప్తియందు ఉంచుకొని నిద్రపొమ్మన్నారు.

God Speaksలో స్పష్టంగా చెప్పారు బాబా, 
ఈ మూడు స్థితులను గురించి చెపుతూ...
ఈ నాలుగో స్థితిని (అంటే) ఈ మూడు స్థితుల యొక్కఎరుక– ఏకక్షణమందు పొందాలి అనుకొనేటువంటి వ్యక్తి,
ఈ నాలుగో స్థితి అనుభవము పొందాలంటే,
"నా యొక్క నామాన్ని ఎరుకతో స్మరించుకుంటూ
నిద్రపోండి" అన్నారు.
అప్పుడు నీవు నిద్రపోయినటువంటి వాడవు కాదు. నీ ఇంద్రియాలు నిద్రపోతాయి. (ఎందుకంటే)
అసలు నిద్ర పట్టకపోతే వ్యక్తికి ప్రమాదం.
మళ్ళీ మరునాడు పని చేయలేడు.
నిద్రపోవాలి, (కానీ) మీరు నిద్రపోకూడదు.
ఒక ఉపాయమన్నమాట. సులభం కాదు ఇది.
        
   
ప్రశ్న : - స్వప్నంలో ఎరుక రావడం అంటే .. ?

గురుదేవులు : -  ఒక పులి తరుముకొస్తోంది. పరిగెడుతున్నారు, భయపడుతున్నారు. భయపడి పరిగెడుతుంటే, ఇది మీరు స్వప్నమని తెలుసుకున్నారా?
ప్రశ్న : - అనుభవించేస్తున్నాం కదండీ! అనుభవంలోనే మునిగిపోయాం.
గురుదేవులు : -  ఆ!... అదీ అనుభవము "వేకువానుభవము" ఎటువంటిదో, అది అనుభవమే.
స్వప్నానుభవం కూడా అదే.
అలా కాదు. దానికి అన్యమై, దేనిని ఏది తరుముతున్నది... నీవు అన్యంగా ఉన్నప్పుడు? "నిన్ను" తరమడం లేదు.
నీకు ఏది ప్రాతిభాసికమై, నీ నీడయై ఉన్నదో,
ఆ చంద్రునికి నీడలాగా ఈ ప్రతిబింబమై ఉన్నదో,
నీ ప్రతిబింబాన్ని, నీ ప్రతిబింబము మరొక రూపములో తరుముతున్నది.
ఆ సత్యాన్ని గుర్తించగలుగుతారు,
"ఎరుక" ఉంటేను!
అప్పుడు "స్వప్నం"లో భయపడతారా?

*ఎప్పుడు స్వప్నములో భయపడరో, స్వప్నమునకు సాక్షియై నీవుంటావో, (అప్పుడు)
వేకువ అనుభవానికి కూడా నీవు"సాక్షి"యై ఉండగలవు. 
"వేకువానుభవములో అనుభవించేటువంటిది కూడా కేవలము నీవు కాదు. నీకు ప్రాతిభాసికముగా
ఉండేటువంటి నీ నీడే, నీ ఛాయే"
అనేటువంటిది నీవు గుర్తెరుగుతావు.

ప్రశ్న : - ఎరుకనేది ఉంటే, ఇక స్వప్నమెలాగా వస్తుందండీ?

గురుదేవులు : - "మెలకువ" ఉన్నది, కానీ ఇంద్రియములు పని చేయడము లేదు. జాగ్రత్తగా అర్థం చేసుకో!
పరున్నావు. ఇంద్రియములన్నీ అలసిపోయి ఉన్నాయి. 
కళ్ళు మూతలు పడిపోతున్నవి. 
శబ్దాలేమీ వినిపించడం లేదు. 
కాళ్ళు చేతులు కదలడం లేదు. 
హాయిగా వాటికవి విశ్రాంతి తీసుకుంటున్నాయి. అక్కడ నీవు "ఎరుక" గలిగి ఉండాలి.
ఇవన్నీ కూడా విశ్రాంతి తీసుకుంటున్నప్పటికీ కూడా నీవు "మెలకువ"గా ఉండాలి. 
అప్పుడు "స్వప్నము" వస్తుంది. అంటే...
"వేకువలో ఉండి, స్వప్నం ఎలాగ వస్తుంది?" అనుకోవద్దు.
ఆ స్థితిలో ఉండి నిద్రపోకుండగా నీవు "మెలకువ"గా, ఒక గంట సేపు ఉండు.

ప్రశ్న : -పూర్తిగా clarify అవ్వలేదండి...

గురుదేవులు : - ఇప్పుడు (ఉదా: - ఒక బ్యాంకు ఉద్యోగిని ఉద్దేశించి)
       వేకువలో ఉండి నీవు ఆలోచిస్తున్నావు. ఇక్కడ కూర్చున్నావు, గురువుగారి దగ్గర.. ఏదో ఆలోచనలో ఉన్నావు. (ఆ ఆలోచనలో) నీవు బ్యాంకులోకి వెళ్ళిపోయావు, "మనస్సు" బ్యాంకులోకి వెళ్ళిపోయింది. నీవు ఫైళ్ళు తిరగేస్తున్నావు. ఇదంతా imagination. అదంతా దృశ్యమే కదా నీకు!
       నీకు ఫైల్ అగుపిస్తుంది, ఆ ఫైల్ లో ఉండేటువంటి విషయం నీకు అగుపిస్తుంది. అంతా నీకు తెలుస్తుంది. అది "దృశ్యమే"నా?
అది ఊహేనయ్యా! (కానీ)
"ఊహ" materialize అయ్యింది, Materialize
అయినప్పుడు, అది "దృశ్యము".
[11/26, 08:01] +91 73963 92086: అది ప్రస్ఫుటముగా ఎలాగ అగుపిస్తుందంటే, నీ కళ్ళు
నిద్రపోతున్నప్పుడు, నీ ఇంద్రియములన్నీ
నిద్రపోతున్నప్పుడు, విశ్రాంతి తీసుకున్నప్పుడు,
అదే "దృశ్యమై"తారసపడుతుంది.
అప్పుడు నీవు.. "సాక్షి"గా ఉంటావు. నీ bankలోకి వెళతావు, నీ ఫైల్ చూసుకుంటావు. (కానీ) ఆ చూస్తున్నటువంటి స్థితి... నీవు వేరుగా ఉండి, నీవు గుర్తిస్తుంటావు. ఎందుచేతంటే, నీవు"మెలకువ" గా ఉన్నావు కనుక.
ఇవన్నీ అనుభవ సత్యాలండీ. 
ఊహించినవి కావు, అసత్యములు కావు.
ఇప్పుడు, (ఉదా : కు) వేరే జంతువు ఏదో పరిగెడుతున్నప్పుడు మీరు అన్యంగా ఎలాగ చూడగలుగుతారో, అదే విధంగా...
"స్వప్నము"లో కూడా మిమ్మల్ని తరుముతూ
ఉండేటువంటి దృశ్యాన్ని మీరు చూడగలుగుతారు.

ముందు ప్రారంభ స్థితిలో, తన "దృశ్యము" అంతగా గోచరించదు (కానీ),
"తాను అన్యముగా ఉన్నాను" అనేటువంటి feeling ఉంటుంది.
Gradualగా ఆ రూపం కూడా గోచరిస్తూ ఉంటుంది. నీ రూపము కూడా స్వప్నములో గోచరిస్తుంది. అలాగ గోచరించినప్పుడు మాత్రము, నీకేమనిపిస్తుంది? "స్వప్నము"లో ఉండేటువంటి నీవు– నిజమైన నీవు
 కాదనిన్నీ,
 "ఈ స్వప్నాన్ని చూసేటువంటి వాడు,"సాక్షి"గా ఉండేటువంటి నీవు మాత్రమే–"నిజమైన నీవు" అనిన్నీ,
ఆ "నీవు",ఈ భౌతికానుభవాన్ని అనుభవించేటువంటి నీవు కాదనిన్నీ,
"భౌతికానుభవాన్ని" అనుభవించేటువంటి నీవు వేరు
అనేటువంటి అనుభవము, ఆ తరువాత వస్తుంది; ఆ దరిమిలా వస్తుంది.

"ఆధ్యాత్మిక అనుభవము" (అనేది) వెంటనే భౌతికానుభవము నుండి వ్యక్తమవ్వదు; "స్వప్నానుభవము" నుండే ప్రారంభమవుతుంది.
స్వప్నానుభవములోనే, అన్యత్వాన్ని అనుభవించినటువంటి స్థితిలో మాత్రమే ఈ"వేకువ యొక్కఅనుభవము", 
ఈ వేకువ యొక్క "స్వప్న స్థితి యొక్క అనుభవము"   
తారసపడుతుంది.

ప్రశ్న : - అసలు స్వప్నమే రాకపోతేనోండీ?

గురుదేవులు : - "స్వప్నము" రానటువంటి వ్యక్తి... 5వ చైతన్య భూమికను అధిగమించినటువంటి వ్యక్తి అయ్యుండాలి. అంటే,
"పరిమితమైనటువంటి మనస్సు"... "విశ్వ మనస్సు"తో తాదాత్మ్యత చెంది, "విశ్వమనస్సు కూడా అసత్యము!" అనేటువంటి స్థితి పొందినటువంటి వ్యక్తికి "స్వప్నానుభవం" లేదు.

అసలు ఎప్పుడూ, అసలు జన్మలో స్వప్నమే రాదు. అతడు 5వ చైతన్య భూమికను అధిగమించినటువంటి వ్యక్తికి మాత్రమే "స్వప్నము" ఉండదు, "స్వప్నానుభవము" ఉండదు. ఆ వ్యక్తికి,
ఈ "వేకువ"లో ఉండేటువంటి ఈ స్థితే...
"స్వప్నానుభవము". ఈ వేకువే స్వప్నము (అతనికి)!
"ఈ వేకువ సర్వానుభవానికీ తాను సాక్షినై ఉన్నాను"
అనేటువంటిది ప్రస్ఫుటముగా తెలియబడుతుంది.

ప్రశ్న : - "స్వప్నము" వచ్చినా, తెలియని స్థితి ఏమిటండీ?

గురుదేవులు : - "స్వప్నము" వచ్చినా తెలియని స్థితి, మరింత అజ్ఞాన స్థితి. ఇప్పుడు స్వప్నంలో కొట్టుకుపోతుంటాడు. (కానీ) ఆధ్యాత్మికముగా ఒక దృక్పథంతో పురోగమించేటువంటి వ్యక్తికి, "స్వప్నము".. సుస్పష్టంగా, ప్రస్ఫుటంగా తెలియబడుతుంది.
"వేకువ"లో ఎంత స్పష్టంగా తాను అనుభవిస్తాడో,
"స్వప్నాన్ని" కూడా అంత స్పష్టంగానూ అనుభవిస్తాడు.
అప్పుడు మాత్రమే ఈ "సంస్కారము"... ఆ రూపంలో ఖర్చు పెట్టబడిపోతుంది. ఆ తరువాత, 
"ఇది ప్రాతిభాసికము!" అనేటువంటిది తెలుసుకోగలుగుతాడు.
   
(సద్గురు సంపూర్ణ ప్రవచనావళి– 15
Pg : 202- 207)

జైబాబా

No comments:

Post a Comment