*:ఇంద్రియాలు vs మనస్సు:*
*ఇంద్రియాలు* అనేవి అనుభూతులకు ద్వారాలు. *మనస్సు* సమాచారాన్ని సేకరించి నిల్వ వుంచే గిడ్డంగి లాంటిది.
*ఇంద్రియాలు* స్వతంత్రగా వ్యవహరిస్తాయి. వీటికి గురువు శిక్షణ, జ్ఞానం, పద్దతి,సాధన, అక్కర్లేదు. ఉదా కన్ను తనకు ఎదురుగా
వున్న దేనినైనా చూడగలదు అలా చూడటానికి, గురువు, మార్గదర్శి,అనుభవం,ఏమీ అక్కర్లేదు.
*మనస్సు* అలా కాదు , మనస్సు స్వాతంత్ర్యగా దేనిని తెలుసు కోలేదు.అది *ఇంద్రియాలు* ఇచ్చే సమాచారం సేకరిస్తుంది. ఆధార పడటం దీని స్వభావం. దీనికి గతం, గాని మరొక దాని ఊతం గాని కావాలి. అందుకే గురువు, అనుభవం, జ్ఞానం కావాలంటది. ఇంద్రియాలు వర్తమానం తోనే వ్యవహారిస్థాయి.
*మనస్సు* కి.గతమే తెలుసు. భవిష్యత్తు ని ఊహిస్తుంది.
*ధ్యానం* మనస్సు ని ప్రక్కకు నెట్టి ఇంద్రియ అనుభూతిని పెంపొందిస్తుంది.
షణ్ముఖానంద9866699774
No comments:
Post a Comment