Saturday, December 10, 2022

కనిపించని శత్రువులు

 *కనిపించని శత్రువులు×*

శత్రువు మీద గెలిచినప్పుడే ఎవరికైనా ప్రశాంతంగా కునుకు పడుతుంది. కనిపించే శత్రువును జయించగలిగినా, నిలువెల్లా నిండి కనిపించని అంతశ్శత్రువులైన ఆరింటి దాటికి నిలవలేక విలవిల్లాడుతున్నాడు మనిషి. కామాన్ని జయించలేక, క్రోధాన్ని విడనాడలేక, లోబాన్ని తరిమికొట్టలేక, మోహభ్రమకు బానిసై, పాతాళానికి తొక్కేస్తున్న మదమాత్సర్యాల బారినపడి జీవితాన్ని కోల్పోతున్నాడు. వీటి జతగాళ్లయిన మరికొన్ని శత్రువులకూ దాసుడవుతున్నాడు. తన అనాలోచిత _చర్యలతో ప్రాణాలనే పణంగా పెడుతున్నాడు. మనిషిని మందబుద్ధిని చేసేవి- నిర్లక్ష్యం, ఆజాగ్రత్తలు, అవి కౌగిట బంధించి ఉక్కిరిబిక్కిరి చేసి ముప్ప తెచ్చే మహమ్మారులు, వాటి బలం ఆనూహ్యం. మనుగడకు సాయపడే కాలాన్ని, ధనాన్ని, గౌరవాన్ని, ఆహార ఆరోగ్యాలను అవి కలిగించివేస్తాయి. 

నిర్లక్ష్యం కాటుకు బలైనవారికి కాలం విలువ తెలియదు. రేపు, తరవాత అంటూ సమయాన్ని వాయిదాలతో దొర్లిస్తారు. చివరికి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. కాలాన్ని, ధనాన్ని కాపాడుకోవడం వివేకుల లక్షణమని మనుధర్మశాస్త్రం చెబుతోంది. కష్టపడి అర్థించే ప్రతి పైసా ఎంతో విలువైనది. సంపాదించిన ధనాన్ని దాచి సద్వినియోగపరచాలి. పొదుపుచేసిన విత్తాన్ని ప్రాణావసరంలో వినియో గించాలంటారు. ఎంతటి ధన వంతుడి నైనా బికారిని చేసేది. నిర్లక్ష్యం. అటువంటి ఇంట లక్ష్మి కౌలువుండదు. పెద్దల మాట చద్ది మూట అని తెలుసు కోలేక వారి సలహాలను ఆగౌరవ నష్టపోయేది పిన్నలే. పెద్దల ఆను భవం, దూరదృష్టి, ప్రేమ అపారం.
గర్వంతో గేలి చేసి నిందిస్తే,
దూరమయ్యాక వారి విలువ తెలిసి.
విలపించినా ప్రయోజనం దక్కదు.
ఆరోగ్యంపట్ల, ఆహార వ్యవహారాల
పట్ల సకాలంలో శ్రద్ధ వహించాలి.
నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తే నష్టం
వాటిల్లక తప్పదు
ముందుచూపు మనిషికి మూడో నేత్రం. రాబోయే పరిణామాలు, సంభవించే స్థితిగతులు బేరీజు వేసి జాగరూకత వహించేవారికి: అన్నీ శుభాలే అంటారు మహర్షి వాల్మీకి రామాయణంలో .

లక్క ఇంటి చహనాన్ని ముందే పసిగట్టిన శ్రీకృష్ణుడు వ్యూహంతో తన భక్తులైన పాండవులను రక్షించాడు. పశుపక్ష్యాదులు సైతం వివేకంతో సంచరించిన వైనాలెన్నో మనకు కనిపిస్తాయి. పంచతంత్రంలోని మూడుచేపల కథలో రాబోయే విపత్తును ముందే ఊహించింది దీర్ఘదర్శి అనే చేప ఎండిపోతున్న చెరువులో తమ బతుకు ప్రశ్నార్ధకమని ఆలోచించి సురక్షిత ప్రదేశానికి తరలిపోదామని తోటి మిత్రులను హెచ్చరించింది. వారు పెడచెవిన పెట్టి నష్టపోయారు. నిర్లక్ష్యంతో నిద్రపోయి చివరిక్షణంలో మేల్కొనడం అవివేకం అని తెలిసిన ఆ చేప మరోప్రాంతానికి చేరి ప్రాణాలు దక్కించుకొంది. ఏమవుతుందో చూద్దాం. ప్రమాదం వచ్చినప్పుడు నిర్ణయం తీసుకుందాం అని నిమ్మకు నీరెత్తి కాలహరణం చేసేవారికి గుణపాఠం ఈ కథ.

నిర్లక్ష్యాన్ని వదిలి పెట్టి ముందుచూపును ఆశ్రయించి జాగ్రత్త పడాలి. సాటివారి క్షేమాన్ని ఆశించి వారికి మేలు చెయ్యాలి. ఆజాగ్రత్తకు అలసత్వం తోడైతే అన్నీ కష్టాలే. జాగ్రత్తకు శ్రద్ధాసక్తులు కలిస్తే- జీవితం మహోన్నతం చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందాన కాక కార్యనిర్వహణలో చురుకుదనాన్ని ప్రదర్శించాలి. విలువైన క్షణాలను చేజార్చుకోక ఒడిసిపట్టాలి. జాగ్రత్తే దైవమని తెలుసుకొంటే. నిత్యం దైవాన్ని దర్శించవచ్చు. బుద్ధి జ్ఞానాలకు పదును పెట్టి వివేకంతో నిర్లక్ష్యాన్ని తరిమికొట్టాలి. అప్పుడు జీవితంలో అన్నీ విజయాలే!

మాడుగుల రామకృష్ణ 
సేకరణ  మీ రామిరెడ్డి మానస సరోవరం👏

No comments:

Post a Comment