Saturday, December 24, 2022

ఆత్మ యొక్క జ్ఞాపకశక్తి:---

 *Life Change Messages Every Day 6pm In Light Workers Group*

📘 *ఆత్మానుభవాలు--ఎకోస్ ఆఫ్ ది సోల్ --->ఎకో బోడైన్* 📙

🔺 *చాప్టర్ -- 5:--- మరణం - ఆత్మ పరిపక్వత* 🔺
🌹 *Part -- 8*🌹


🔺 *ఆత్మ యొక్క జ్ఞాపకశక్తి:---* 🔺

🌳 ఒకవేళ ఆత్మే కనుక చనిపోవాలని నిర్ణయించుకున్నట్లైతే, ఆత్మలోకం ఎంతో అద్భుతమైన ప్రదేశమే, అయితే, మనకు మరణ సమయం ఆసన్నమైనప్పుడు మన దేహాన్ని విడిచి ఆనందంగా వెళ్ళిపోవటానికి ఎందుకు ఇష్టపడం? దానికి కారణం ఒక్కటే ! మనం ఆత్మ లోకంలో ఉన్నప్పుడు భూమిపైన జనన మరణాల గురించి ప్రణాళికలు వేసుకున్నప్పుడు శారీరక భావోద్వేగాలకు లోనుకాం. అది కేవలం అనుభవ ప్రణాళికల వరుస, కానీ భూమి పైన జన్మించిన తరువాత మనం వేసుకున్న ఒక్కో ప్రణాళికలను అనుభవిస్తున్నప్పుడు మన ఆలోచనా విధానం అంతా మారిపోతుంది. 

🏵️ మనం భూమిపైన జన్మించిన కొన్నాళ్ళకే మన మూలాన్ని మర్చిపోతాం. మన శరీరంలో నివశిస్తూ భూమే మన అసలైన ఇల్లు అని భావిస్తుంటాం. భావోద్వేగభరితంగా ఇక్కడ జరిగే ప్రతి విషయంలోనూ మనం మునిగిపోతాం. భూమిపైన మనకు సమయం అయిపోయినప్పుడు మన అసలైన ఇంటికి తిరిగి వెళ్ళాల్సి వచ్చినప్పుడు మనం పూర్తిగా మర్చిపోయిన చోటుకు వెళ్ళడానికి చాలా కష్టంగా అనిపిస్తుంది. ఇక్కడ మనం ప్రేమించిన వాటన్నింటినీ విడిచి వెళ్ళడానికి ఏ మాత్రం ఇష్టపడం.

🌷 ఆత్మ లోకానికి, పూర్వ జన్మలకు సంబంధించిన స్మృతులు మనకు జ్ఞాపకం ఉన్నట్లైతే భూమి పైన మన జీవనం చాలా కష్టంగా మారుతుంది. ఎక్కడ నుంచి వచ్చామో అక్కడికు తిరిగి వెళ్ళిపోవాలనిపిస్తుంది. మన ఆత్మ ఎన్నో జన్మలు ఎత్తి ఇక్కడ ఎందరో స్నేహితులను సంపాదించుకుంది. వారిలో కొందరు ఇక్కడ మనతో భూమి పైన, చాలా వరకు పైన ఆత్మ లోకంలో ఉన్నారు. నిజానికి మనకు ఇదంతా జ్ఞాపకం లేకపోవడం ఒక వరం. మన పూర్వ జన్మలు, ఆత్మ లోకంలోని జీవనం, ఇన్ని జన్మల్లో మనం సముపార్జించుకున్న ప్రియమైన వారు, ఇలా అంతా మనకు జ్ఞాపకం ఉంటే భూమి పైన మన ప్రస్తుత జీవితం దుర్లభంగా మారుతుంది. మనం కేవలం “మన ప్రస్తుత జన్మపైన దృష్టిని కేంద్రీకరించి, ఏ పని కోసం వచ్చామో అది పూర్తి చేయాలి. 

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

🌷  *ఆత్మానుభవాలు--ఎకోస్ ఆఫ్ ది సోల్ పుస్తకం* మరియు *ఇతర ఆధ్యాత్మిక పుస్తకాలు* కావాల్సిన వాళ్ళు *9032596493* కి what's app msg చేయగలరు.

👍 *VicTorY oF LiGhT*🎇

💚🔆 *Light Workers*----                                                     🔄♻🔁 *Connected with Universe*💓🌟🌕✨💥☣

No comments:

Post a Comment