Thursday, December 15, 2022

భగవాన్ రమణుల జవాబులు:

 *భగవాన్ రమణుల జవాబులు:*
    ●ఎరుక స్వరూపం సచ్చిదానందము.
    ●కల్పిత జగత్తు తొలగితేగాని స్వరూప దర్శనం కల్గదు.
    ●తన ఆత్మస్థితిని తాను వదలకపోవడం జ్ఞానం. సుఖం
    ●జ్ఞాని మనసు బ్రహ్మమును వీడదు.
    ●మనసును సదా ఆత్మలో నిలుపుట అత్మవిచారం
    ●ఒక విషయంపైకి మనసు పోకుండుట నిరాశ
    ●ఒక్క విషయం కూడా తోచకుండుట జ్ఞానము.
    ●ఇతరములైన దానిని వదలడమే, ఆశించకపోవటమే నిరాశ, వైరాగ్యం.
    ●ఊరక ఉండటం అంటే మనసును ఆత్మస్థితిలో లీనంచేసి ఉండటం
    ●నేను అను మాట కించిత్ మాత్రం లేకున్నను అదే మౌనం, జ్ఞాన దృష్టి.
    ●నేను అని తోచేదే మనస్సు. అహంకారం. మనసు ఎల్లప్పుడూ ఒక స్థూల వస్తువును అంటిపెట్టుకొని ఉండును. సూక్ష్మ వస్తువైన ఆత్మను అంటిపెట్టుకొని ఉండును. 
    ●మనసు బహిర్ముఖమయినపుడు దుఃఖం కల్గును.
    ●మనసు అత్మస్థితి నుండి బయటకు పోవుట, లొపలికి వచ్చుట చేస్తుంది. Ex: చెట్టు నీడ - ఎండ
    ●బాహ్యమైన కోరికలు, తలపులు అనిగినపుడు మనసు తన స్వస్థితియైన ఆత్మస్థితిలోకి మరలి ఆనందస్థితిని పొందును.
    ●మనసును బయటకు పోనీయక స్వరూపస్థితిలో ఉంచడాన్ని అహం ముఖం, అంతర్ముఖం అంటారు.
    ●దానిని వెలుపలికి పోనిచ్చుటను బహిర్ముఖం అంటారు
    ●బహిర్ముఖమైన మనసు, అంతర్ముఖమై ఏకాగ్రతతో పొందిన స్థితి అత్మస్థితి.
    ●ఏది చేసినను నేను అనే అహంకారం లేకనే చేయవలెను. సర్వం స్వరూపంగా తోచును.
    ●ఆత్మచింతన తప్ప ఇతర చింతనలు పుట్టుటకు కొంచెమైన చోటు ఇవ్వక ఆత్మనిష్టా పరుడవ్వడమే ఈశ్వరునికి అర్పించుకొనుట.
    ●మంచి మనసు, చెడ్డ మనసు లేదు. వాసనలనుబట్టి మంచి, చెడు.
    ●మనసులో ఎంతవరకు విషయవాసనలు మిగిలి ఉంటాయో అంతవరకు ఆత్మ సాధన అవసరం.
    ●మనసనేది ఆత్మస్వరూపంలోనున్న అతిశయశక్తి.
    ●మనసు, ప్రాణం పుట్టు చోటు ఒక్కటే. నేను అనే అహంకారం ఎక్కడ పుడుతుందో అక్కడ నుండే శ్వాస, ప్రాణము బయలుదేరుతుంది.
    ●మనసు అణిగితె ప్రాణం, ప్రాణము అణిగితే మనసు పరస్పరం అణుగుతాయి. ప్రాణము అనేది మనసు యొక్క స్థూల రూపం.
    ●ప్రాణాయామం, మూర్తిరూపపూజ, మంత్రజపము, ఆహారనియమం మనసును లొంగదీసేవేగాని, నశింపజేసేది కాదు. వీటిచేత మనస్సు ఏకాగ్రత చెందుతుంది. Ex: ఏనుగు తొండము ఇనుపగోలుసు
    ●స్మరణచేత మనసులోని తలపులు ఒక్కోటిగా అణిగి మనసు ఏకాగ్రం చెంది, శక్తివంతమై ఆత్మవిచారణ సులువవుతుంది
    ●జగత్తు అనేది తలపులకు వేరుగా లేదు. ఉదాహరణకు సాలెపురుగు(మనసు).
    ●మనసనేది ఆత్మనుంచి బహిర్ముఖమైనపుడు ప్రపంచం తోస్తుంది.
    ●ప్రపంచాన్ని స్వప్నముగా భావించాలి.
    ●ప్రకాశం, స్వరూపము తోచినపుడు జగత్తు తోచదు.
    ●మనసులోని తలపులు ఒక్కొక్కటిగా తొలిగితేగాని స్వరూప స్థితి కలుగదు.
    ●ఇతర తలపులు ఎన్ని లేచిన వాటిని పూర్తి చేయుటకు ప్రయత్నించక అవి కల్గినది ఎవరికి అని విచారించాలి. ఎన్ని తలపులు పుట్టిన ఇది ఎవరికి కల్గినదని విచారణ చేయాలి. నాకు అని తొస్తోంది. అపుడు నేనేవడనని శోధిస్తే మనసు అది పుట్టిన స్థానానికి మరలుతుంది. పుట్టిన తలపు అణుగుతుంది.
    ●తలపులను ఎప్పటికప్పుడు విచారించాలి అదే వైరాగ్యం.  Ex: కోట - సైనికులను చంపడం
    ●సూక్మమైన మనసు మెదడు, ఇంద్రియాలద్వారా బయటకు పోవునపుడు స్థూలమైన నామరూపములు అనుభవమవుతాయి. మనసు స్వస్థానంలో వున్నపుడు నామరూపములు మరుగునపడతాయి.
    ●ఏ శాస్త్రమైన ముక్తి నొందుటకు మనసును అణిగి ఉంచుమని బోధించుట చేత, పరమాత్మను తెలుసుకొనుటకు మనోనిగ్రహమే అత్యంత ముఖ్య సందేశమని తెలియును. తనను తాను తన జ్ఞాననేత్రం చేత తెలుసుకోవాలి.
    ●శాస్రాలు పంచకోశాల వెలుపల, తాను పంచకోశాల లోపల వున్నది.
    ●మనసులో పేరుకుపోయిన విషయవాసనలు వచ్చే జన్మకు కారణమవుతాయి.
    ●ఆత్మ, మనసు, బుద్ది, చిత్తం, మమకారం ---> ఆత్మ
    ●స్వరూప ధ్యానం నిశ్చయముగా కల్గి ఉండవలెను.
    ●పరమాత్మ  మన భారములు మోయువారు.  Ex: రైలు - మూట
    ●చెడ్డగుణములను లెక్కించరాదు  Ex: చెత్తను పారవేయడం
    ●బంధములోనున్న తాను ఎవడని విచారించి యదార్ధ స్వరూపమును తెలుసుకోనుటే ముక్తి.

No comments:

Post a Comment