Tuesday, December 13, 2022

శిల కాపాడుతుందా..?..!!

 🎻🌹🙏 శిల కాపాడుతుందా..?..!!

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

🌿ఒక ఆలయంలో హరిదాసు హరికధా కాలక్షేపం  చేస్తున్నాడు. 
ఆ ఊరిలోని నాస్తికడైన 
తహసీల్దారు  ఒకరు,

🌸" హరికధ చెప్తున్న దాసు వద్దకు వెళ్ళి" అయ్యా! ఎక్కడ నుండో ఒక శిలని  తెచ్చి , దానికి ఒక రూపం
యిచ్చి , మనం ప్రతిష్టించిన శిలని మనమే కాపాడమని" వేడుకుంటూవున్నాము. 

🌿ఇది ఎంత మూర్ఖమైన పని. ఆ శిలకి ఎక్కడ నుండి శక్తి వస్తుంది ? 
ఆ శిల ఇతరులను ఎలా కాపాడుతుంది అని అడిగాడు.

🌸అది విన్న ఆ హరికధా పౌరాణీకుడు ప్రశాంతంగా,  " తమరికి యీ తహశీల్దార్ పని రావడానికి, ముందు ఏం చేస్తూ వుండేవారు ?
అని అడిగాడు. 

🌿"ఊరికినే ఖాళీ గా వున్నాను " . 

🌸" మీరు ఖాళీ గా వున్నప్పుడు మిమ్మల్ని ఎవరైనా గౌరవించారా? 
మీరు చేసే సంతకానికి ఎదైనా విలువ వుండేదా ? లేదు కదా?  

🌿అటువంటి సమయంలోనే మీకు తహశీల్దార్ పదవి లభించగానే, తమరు చేసే ప్రతి సంతకానికి  ఎంతో విలవ వున్నది.  ఈ అధికారం గౌరవం ఎక్కడ నుండి వచ్చాయి ? 

🌸ఆ విధంగానే ఎక్కడ నుండో తెచ్చిన శిల దైవరూపంగా మలచబడి
ఆ మూర్తిని ఆగమశాస్త్రాల ప్రకారం ఆలయం లో ప్రతిష్టించి
పూజించి నిత్యం  మంత్రాలు జపిస్తూంటే విగ్రహానికి దైవశక్తి ఏర్పడుతోంది. 

🌿ఆ శక్తే మనలనందర్నీ కాపాడుతున్నది. అని తెలిపాడు, హరికధా పౌరాణికుడు...స్వస్తీ...🚩🌞🌹🙏🎻

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

No comments:

Post a Comment