Thursday, December 22, 2022

నేటి మంచి మాట.

 నేటి మంచి మాట.

       రెండు పదాలు *నీ జీవితాన్నే* మార్చేయగలవు *ఒకటి* చేయగలననే ఆత్మవిశ్వాసం, *రెండు* చేయలేననే *అపనమ్మకం* వీటిలో ఏది ఎంపిక చేసుకుని *నడుస్తామో* దానిపైనే మన జీవితం *ఆధారపడి* ఉంటుంది .

       *నమ్మి* బ్రతకడం వేరు *నమ్మిస్తూ* బ్రతకడం వేరు *నమ్మి* బ్రతకటంలో *ప్రేమ* ఉంటుంది, *నమ్మిస్తూ* బ్రతకడంలో *స్వార్థం* మాత్రమే ఉంటుంది , నువ్వు *నిజాయితీగా* ఉంటే చాలా మంది *నీతో* పాటు ఉండక పోవచ్చు, *కానీ* కచ్చితంగా సరైన *వ్యక్తులే* నీకు *మిత్రులుగా* మిగులుతారు , 

      ఆపదకి *సంపద* నచ్చదు,సంపదకు *బంధం* నచ్చదు,బంధానికి *బాధ* నచ్చదు,బాధకు *బ్రతుకు* నచ్చదు,బ్రతుకుకి *చావు* నచ్చదు,చావుకి *పుట్టుక* నచ్చదు *కానీ* వీటిని  మనం *అనుభవించక* తప్పదు .

   *అదుపు* తప్పి *కింద* పడితే ఆదుకోదు *ఈ లోకం*, అలిసిపోయి కన్నుమూస్తే *బ్రతికించ* లేదు *ఏ బంధం*, దారిలోన *చీకటైతే* తోడు రాదు *నీ నిడ* కూడ,. జారిపోయి *దూరమైతే* చేరుకోదు *నీ ప్రేమ* గమ్యం,  అందుకే నిన్నే *నమ్ముకో*, నీకు నువ్వు గానే *సాగిపో* ఓ నా ప్రియ నేస్తమా, *జాగ్రత్త* సుమా, *జీవితం* నీదే.నువ్వే *నడవాలి*  నీకు *బదులుగా* ఎవ్వరు *నడవలేరు* .

 శుభోదయం చెబుతూ మీ రామిరెడ్డి మానస సరోవరం.👏

No comments:

Post a Comment