🛑 పిల్లల లైంగిక వేధింపులకు భయపడిపోయి లేడీ టీచర్ల రాజీనామాలు..!!
🔹పిల్లల లైంగిక వేధింపులకు భయపడిపోయి లేడీ టీచర్ల రాజీనామాలు..!!
🔹అవును, బెంగుళూరులోనే…
🔹 స్కూల్ విద్యార్థుల బ్యాగులు చెక్ చేస్తే కండోమ్స్, సిగరెట్లు, వైట్నర్లు, మద్యం, గర్భనిరోధక మాత్రలు కనిపించాయని వార్త చదివాం…
🔹 అఫ్కోర్స్, మరోరోజు చెక్ చేస్తే డ్రగ్స్ పాకెట్లు దొరికేవి…
🔹వాళ్ల ఫోన్లు పరిశీలిస్తే ఇక ఆ పరిశీలకులే కిందపడి కొట్టుకునేవారేమో...
🔹 నిజం… నిన్న ఓ స్కూల్ టీచర్ రాజీనామా చేసింది…
🔹అదీ ప్రైవేటు స్కూల్…
🔹 (గవర్నమెంట్ స్కూళ్లలో ఇంకా ఘోరంగా ఉంది పరిస్థితి)…
♦కొన్నివారాల నుంచి...
🔹 లేడీ స్కూల్ టీచర్ల రాజీనామాలు వినిపిస్తూనే ఉన్నాయి
🔹 పిల్లల నుంచి లైంగిక వ్యాఖ్యలు, వెక్కిరింపులు, అశ్లీలపు నినాదాలు, అసభ్య సంకేతాలతో విసిగిపోయి తమ కొలువులకే రాజీనామాలు చేస్తున్నారు
🔹నిన్నటి రాజీనామా చేసిన టీచర్ ఏమంటున్నారో చదివితే నిర్ఘాంతపోవడం మన వంతు…
🔹 ‘‘నార్త్ బెంగుళూరులోని ఓ పాపులర్ ప్రైవేటు స్కూల్లో మ్యాథ్స్ చెబుతాను…
🔹టీచర్‌గా పనిచేస్తున్నందుకు ఇన్నేళ్లూ గర్వపడ్డాను
🔹 ఆ రోజులు పోయాయి…
🔹 స్కూల్ అన్నా, టీచర్ అన్నా భయభక్తులేమీ లేవిప్పుడు… ఓ పర్టిక్యులర్ క్లాస్‌కు వెళ్లాలంటే భయమేస్తోంది…
🔹విద్యార్థులందరినీ తప్పుపట్టడం లేదు నేను… కానీ పేరున్న కొన్ని కుటుంబాలకు చెందిన పిల్లల బిహేవియర్ మొత్తం విద్యార్థి లోకానికే తలవంపులు
🔹 రోజురోజుకూ విద్యార్థుల వేధింపులు తట్టుకోలేక ఇక టీచర్ వృత్తినే వదిలేయాలని నిర్ణయం తీసుకున్నాను…’’
♦ఇంగ్లిష్ చెప్పే మరో టీచరమ్మ ఏం చెబుతోందంటే…
🔹‘‘నేను క్లాసులోకి ఎంటర్ అయిన వెంటనే గుడ్ మార్నింగు విషెస్ ఏమీ ఉండవు…
🔹కొందరు పిల్లలు విజిళ్లు వేస్తారు…
🔹ఏదైనా పద్యమో, మరొకటో చెబుతుంటే నేరుగా కామెంట్స్ పాసవుతూనే ఉంటాయి,
🔹 నామీదే, నా ఎదురుగానే…..
🔹 ఐలవ్యూ టీచర్ దగ్గర నుంచి రకరకాల రొమాంటిక్ వ్యాఖ్యలు…
🔹కొన్ని నేను మీకు చెప్పలేను, నా బాడీ గురించి, నా పెదాల గురించి, నేనెలా నడుస్తాను, నా లుక్కు, నా బాడీ కలర్ ఎలా ఉంది… అసలు వాళ్లకు నేనే ఓ సబ్జెక్టు…
🔹రెండుమూడుసార్లు క్లాసులోనే ఏడ్చేశాను…
🔹 తరువాత రాజీనామా నిర్ణయం తీసుకున్నాను…
🔹 ఇప్పుడు ప్రశాంతంగా ఉంది…’’
🔹 ఒకవేళ టీచర్ గనుక ఫ్రస్ట్రేటయి పిల్లాడిని ఏమైనా అంటే ఇక పెద్ద పంచాయితీ…
🔹 పిల్లల పేరెంట్స్ వచ్చి అందరి ముందే టీచర్లను తిట్టేస్తున్నారు…
🔹 అదీ అసలు ప్రాబ్లం…
♦ కర్నాటక మేనేజ్మెంట్ స్కూళ్ల అసోసియేషన్ కార్యదర్శి శశికుమార్ ఏమంటాడంటే..?
🔹‘‘ఇంకా ఎక్కడున్నారు సార్ మీరు… గురుదేవోభవ, గురుభ్యోనమః అవన్నీ ఛాందసాలు...
🔹విద్యార్థులంటేనే గురువులు వణికిపోయే దురవస్థ వచ్చేసింది
🔹 ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు…
🔹 చైల్డ్ రైట్స్ కమిషన్‌కే లెటర్ రాసింది ఈ అసోసియేషన్…
🔹 ‘‘అయ్యా, మమ్మల్నేం చేయమంటారో కాస్త సూచించండి’’ అని..!
🔹 వాళ్లు సింపుల్‌గా సమస్యాత్మక పిల్లలకు కౌన్సిలింగ్ చేయండి అని ఓ సలహా పడేశారు
🔹 అదంత వీజీ పనేనా..? ఎవరైనా పిల్లాడిని కౌన్సిలింగ్‌కు పిలిస్తే, ఓ సిగరెట్ వెలిగించి, ఏమిటో చెప్పండి త్వరగా అంటాడేమో…
♦ఇక్కడ మరో భూతం ఉంది… దాని పేరు మీడియా…
🔹 నిజానిజాలు దానికి అక్కర్లేదు… ఫలానా స్కూల్లో పిల్లాడికి వేధింపులు అంటూ టాంటాం…
🔹పొరపాటున ఫిమేల్ స్టూడెంట్, మేల్ టీచర్ అయితే ఇక మీడియాకు పట్టపగ్గాల్లేవు
🔹 సమస్య ఎక్కడుంది..? పేరెంట్స్ దగ్గరా..? పిల్లల దగ్గరా..?
🔹వాళ్లను వేగంగా చెడగొట్టేస్తున్న మన సినిమాలు, మన సీరియళ్లు, మన ఫోన్లు, మన అసభ్య వీడియోలు, కారుచౌక బ్రాడ్‌బ్యాండ్ దగ్గరా..?!
🔹 అవునూ, స్కూలింగ్ దగ్గరే ఇలా ఉంటే… ఆపై క్లాసుల్లో మాటేమిటి..?!
No comments:
Post a Comment