Tuesday, December 20, 2022

:::::సమస్య ఎంపిక చేయని దానితో:::::

 *:::::సమస్య ఎంపిక చేయని దానితో:::::*
      ఆశ్చర్యంగా వుంది కదూ..
ఎంపిక చేసుకున్నది మనతో వుంటుంది కనుక అది మనకు సమస్య అవ్వొచ్చు.
   ఎంపిక చేయనిది  మనకు దూరంగా వున్నది ఎలా సమస్య అవుతుంది???
  ఎంపిక చేయనిది మనతో భౌతికంగా వుండక పోయినా అది మన జ్ఞాపకాల్లో వుంటూ మనతో  మానసిక సంబంధాన్ని కలిగి వుంటుంది.,
   చూసినావా నన్ను కాదని దానిని ఎంపిక చేసుకున్నావు. ఇప్పుడు ఏడుస్తూ వున్నావు అది పెట్టే  నష్టం,లేదా బాధ అనుభవించలేక.  అదే నన్ను ఎంపిక చేసుకొని వున్నట్లయితే నేను సుఖ /లాభం పెట్టే దానిని, అని అంటున్నట్లుగా  మన మనస్సు దాని తరుఫున అంటుంది.
ఉదా1).రెండు స్థలాలు చూసి ఒకటి కొంటాం. కొననిది, కొన్న దానికంటే బాగా విలువ పెరుగుతుంది.
2) రెండు సంబంధాలు చూసి ఒకరిని పెళ్లి చేసుకుంటాం. మనస్సు లో ఆ సంబధం ఇంతకంటే బాగా వుండి వుండేదెమో అని పిస్తోంది.
   *షణ్ముఖానంద. 98666 99774*

No comments:

Post a Comment