Wednesday, December 28, 2022

::::: ప్లాస్టిక్ బ్రతుకులు :::::

 *::::::::: ప్లాస్టిక్ బ్రతుకులు ::::::::::*
    ప్లాస్టిక్ పూలు చాలా అందంగా వుంటాయి. ఎక్కువ కాలం నిల్వ వుంటాయి. త్వరగా ‌వాడి,వడలి పోవు.
    కాని సువాసనను వెదజల్ల లేవు. అందులో మకరందం వుండదు. ఇవి కాయగా మారలేవు. ఇవి సహజ పూలతో పోటీ పడ లేవు. మనం వీటిని ఆదరిస్తాం, అది వేరే సంగతి. 
      మన జీవితం కూడా అంతే. అనుభూతి లోకి రాలేని జీవితం, ఆచరణలోకి రాని జీవితం  అది ప్లాస్టిక్ పూలు లాంటిదే.
      ఉదా.. సెల్ ఫోన్ పలకరింపులు, ఆహ్వానాలు, ఇంటర్ నెట్ పెళ్ళిళ్ళు .
     టెస్టు ట్యూబ్ లో జననం,  క్రీచ్ లో బాల్యం, హాస్టల్లో విద్యార్ధిజీవితం, కాంట్రాక్టు కాపురం, ఓల్డ్ ఏజ్ హాస్ లో వృద్ధాప్యం. యాంత్రిక జీవితం.
    ఈ రకంగా మనం జీవితాలు  ఆస్వాదన లేక ప్రేమ స్పర్శ లేక   అలా అని వడలిపోక, జీవశ్చవాలుగా జీవిస్తున్నాము.

*ధ్యానం చేయండి సహజంగా జీవించండి.*

*షణ్ముఖానంద.  98666 99774*

No comments:

Post a Comment