తల్లిదండ్రులు చేసిన పాపపుణ్యాలు పిల్లలకు సంక్రమిస్తాయా?
ఇది కొంచెం గంభీరమైన ప్రశ్న. నేటి సమాజంలో వింత పోకడలు చోటు చేసుకుంటున్న నేపధ్యంలో ఈ తల్లితండ్రులకు మనం ఎలా పుట్టాము, ఇటువంటి వారికే ఎందుకు పుట్టాము అన్న విషయాలు కొంచెం ఆలోచిస్తే తర్కం అర్ధం అవుతుంది. కారణం లేకుండా ఏదీ కాకతాళీయంగా జరగదు. ప్రతీ విషయానికి ఒక కారణం వుంటుంది. అది మనం అర్ధం చేసుకునే పరిణతిని బట్టి కొందరికి అర్ధమవుతుంది కొందరికి వ్యర్ధమవుతుంది. తల్లితండ్రుల ఆస్తిపాస్తులు పిల్లలకు సంక్రమించినట్టు పాపపుణ్యాలు ఎందుకు సంక్రమించవో అన్న విషయాన్ని తర్కిస్తున్నారా?
దీనికి సమాధానం కోసం మనం కర్మ సిద్ధాంతాన్ని సహాయకారిగా తీసుకోవలసి ఉన్నది. ఒకసారి ఒక విదేశీవనిత పరమాచార్య శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖర సరస్వతీ స్వామి వారిని కర్మ సిద్ధాంతం నిరూపణ చెయ్యమని డానికి తగిన హేతువు చూపించమని ప్రాధేయపడింది. అందుకు స్వామివారు ఆవిడను ఆ రోజున ఎందరు పిల్లలు పుట్టారు ఎక్కడెక్కడ పుట్టారు కనుక్కుని రమ్మని ఆవిడను పురమాయించారు. ఆవిడ మరుసటి దినం వివరాలు ఆయన ముందు వినిపించింది. ఆనాడు కాంచీపురంలో 14 మంది పిల్లలు పుట్టారని, ఇద్దరు ఆగర్భశ్రీమంతుల బిడ్డలను, ఒక ఏడుగురు సాధారణ ప్రభుత్వ ఆసుపత్రిలో పుట్టారని, మరి కొందరు మరి కొన్ని నర్సింగ్ హోంలో పుట్టారని అందులో ఇద్దరికీ పుట్టుకతో అంగవైకల్యం వచ్చిందని తెలిపింది. అందుకు స్వామి వారు ఆ పుట్టిన వారు ఏ పాపం చేసారని వారికి అంగవైకల్యం వచ్చిందో, ఎందుకు ఇద్దరు నోట్లో వెండి చెంచాతో పుట్టారో కొందరు ఎందుకు జీవితంలో మరింత కష్టాలు అనుభవించవలసి వస్తుందో అన్న విషయం తర్కిస్తే అప్పుడు అర్ధమవుతుంది పునర్జన్మ సిద్ధాంతము, దానికి ఆధారమైన కర్మసిద్ధాంతము అని ఆవిడ కళ్ళు తెరిపించారు.
ఏదో నల్లట్ట పుస్తకాలలో చెప్పినట్టు పాపం వుంటేనె జన్మ కాదు. మనము ఎంతో పుణ్యం చేసుకుంటే లభిస్తుంది మానవజన్మ. మన పాప పుణ్యాల బాలన్స్ తగిన రీతిలో ఉన్నప్పుడు మనల్ని మానవజన్మకు సిద్ధం చేస్తాడు భగవంతుడు. మనకున్న పాపపుణ్యాల ఖాతాను బట్టి మన attributes కూడా ఉంటాయి, పొట్టి, పొడుగు, నలుపు, తెలుపు, అంగ సౌష్టవం, మానసిక సంతులన ఇలా ఎన్నో విషయాలు దైవాధీనాలు. అలాగే ఎవరికి పుట్టాలో కూడా, ఆస్థీ పరంగా నువ్వు 0 నుండి మొదలవ్వాలా లేక కొంత ఉండాలా లేక సంపూర్ణ ఐశ్వర్యంతో పుట్టాలా అని నువ్వు నిర్ణయించవు. అది నిర్ణయించేది నీ పుణ్యఫలం. అలాగే నీ జీవితంలో ఎలా ఎదుగుతావు ఎలా ఎత్తుపల్లాలను చూస్తావు, ఇతరత్రా విషయాలు కూడా నువ్వున్న కుటుంబం బట్టి నీకు ఎలా అందుతాయో కూడా నీ ఖాతా నిర్ణయిస్తుంది. తల్లితండ్రులు ఏదైతే పుణ్యం చేస్తారో తత్ఫలితంగా వారు అనుభవించిన కష్టసుఖాలు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడేదాకా నీకు అనుభవం అవుతాయి ప్రత్యక్షంగా. పరోక్షంగా అవి నీకు అటుపై రక్షణ ఇస్తాయి కూడా. వారు అటువంటి పుణ్యఫలం నీకు ధారబోస్తున్నారని నువ్వు మరువరాదు. మన అదృష్టం బాగోక గతించిన తరువాత కూడా వారు పితృదేవతలలో చేరి నీకు కావలసిన ఫలాలు అందేట్టు దేవతలతో పోరాడి మరీ నీకు దక్కేట్టు చేస్తారు.
మనకు 14 ఏళ్ళు వచ్చేవరకు మనం చేసిన పాపపుణ్యాలు వారికి అంటుకుంటాయి. అందుకు వారు ఎంతో జాగ్రత్తగా పెంచవలసిన సమయం. మనం పాపం చెయ్యకుండా సంస్కారం నేర్పుతారు, అవే మనకు మన జీవితంలో ఆలవాలం అవుతాయి. ఇందుకు పురాణాలలో మాండవ్యమహాముని ప్రహసనం ఇదే విషయాన్ని సుస్పష్టం చేస్తుంది. తల్లితండ్రులు చేసిన పుణ్యం నిన్ను ప్రత్యక్షంగా ఎలా రక్షిస్తుందో వారితో సంపర్కం ఉన్నవారి వలన నీకు తగిన ఆసరా లభించడం, సమయానికి వారు సహాయం చెయ్యడం చూస్తాము. మనకు తెలియని విషయం, వారు చేసిన కర్మ వలన నీకు ఆ జన్మలో రక్షణ లభిస్తుంది ఎందుకంటె వారు ఆ ఫలం నిన్ను ఉద్దేశించి చేస్తున్నారు కనుక. ఎన్నో నోములు, వ్రతాలు ఇందుకు వచ్చినవే. తల్లిదండ్రులకు మనం, మనకు వారు ఋణం ఉండబట్టే ఈ జన్మలో మనం ఇలా కలిసాము. తల్లిదండ్రుల ఋణం ఒకరు తీర్చలేనిది. పితృఋణం అని మనకు శాస్త్రం బోధిస్తుంది. అది తీరే మార్గం నువ్వు సంతానోత్పత్తి చేసి, వారు చెప్పిన విషయాలను ఆకళింపు చేసుకుని వారిని ఉద్దేశించి నువ్వు దానం చేసి, పితృదేవతలకు సమయానికి శ్రాద్ధాది క్రతువులు నిర్వహించి నువ్వు తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నావు. అంతేతప్ప రెక్కలు వచ్చినవెంటనే వదిలేసే పాశ్చాత్త్య సంస్కృతి కాదు మనది. ఇది కర్మభూమి, ఇక్కడ నువ్వు చేసిన కర్మ విశేషం వలన ఇతోధికంగా ఉద్ధరింపబడతావు.
అలాగే నువ్వు చేస్తున్న పుణ్యం సపుత్రకస్య, సబాన్ధవస్య అంటూ చేస్తున్నావు, నువ్వు చేస్తున్న పుణ్యంలో కొంత నీ పుత్రికాపుత్రులకు ధారబోస్తున్నావు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా వాటివలన ఫలితం వారికి దక్కుతుంది. నువ్వు ఉన్నప్పుడ
Jai jai jai srimannarayama..
No comments:
Post a Comment