రవ్వ దోశ పోసివ్వవూ.....
ఒకరోజు రాత్రి 11 గంటలు కావస్తున్నది. మఠం లో అందరు అన్నీ సర్దుకొని నిద్రకు ఉపక్రమిస్తున్నారు. పరమాచార్య వారి వద్ద రామ్మూర్తి అనే భక్తుడు మాత్రమే ఉన్నాడు. పొల్లొచ్చి జయం అనే మహిళ వచ్చింది. స్వామి వారు రామ్మూర్తి తో
"నాకు రవ్వ దోశ చేసిపెట్టు "అని అడిగారు. రామ్మూర్తి వంట శాల లోకి వెళ్లి చూస్తే రవ్వ లేదు. తిరిగి వచ్చి "స్వామి రవ్వలేదు."అని మనవి చేసాడు.
ఆ మహిళ "నేను ప్రయత్నిస్తాను."అని గబగబా దుకాణాల వైపు వెళ్ళింది. ఒక దుకాణం దారు మాత్రం తలుపులు వేసే ప్రయత్నం లో ఉన్నాడు.వెంటనే ఆమె రవ్వ కొని తెచ్చి రామ్మూర్తి కి ఇచ్చింది. ఆ రవ్వతో వచ్చినన్ని దోశలు పోసి రామ్మూర్తి స్వామి ముందుంచాడు. స్వామి నవ్వుతూ ఒక ముక్క తీసికొని, తిని "చాలా బాగుంది "అంటూ ప్రక్కన పెట్టేసారు.
రామ్మూర్తి, ఆ మహిళ మనస్సులో "ఇంత కస్టపడి దోశలు చేస్తే స్వామి కేవలం ఒక ముక్క మాత్రమే తీసుకున్నారని అనుకున్నారు. కొద్ది సేపు గడిచింది. ఆరుగురు వేద పండితులు ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చారు. విషయం స్వామి కి నివేదిస్తే "పంపమని "ఆదేశించారు.
స్వామి దోశలు వారికీ ఇచ్చి "తీసుకోండి " అని రామ్మూర్తి కేసి చూస్తూ "ఇంత రాత్రి వారోస్తున్నారని, దోశలు పొయ్యి అని నిన్ను అడగం బాగుండదని అలా చెప్పాను."అని నవ్వారు.
***స్వామి వారు తనకు కావాలని అడగడం అవి రాబోయే వారికీ ఇచ్చేయడం చాలా సందర్భాలలో జరిగింది. తనకు కావాలి అంటే ఏ భక్తుడైనా ఏ వేళలోనైనా తనపై అభిమానం తో చేస్తారని స్వామి అలా కోరుతుంటారు.
No comments:
Post a Comment