వేదాంతంలో అద్భుతమైన రచన నిర్వాణ షట్కమ్
*ఇలా వచ్చి అలా వెళ్ళిపోతే ఎలా* 🌷🌷🌷🤔
జీవితంలో ఎన్నో అనుభవాలు చుసిన సాధకుడు ఒకానోక్క స్దితిలో ...
అసలు నేను ఎవరు ఎక్కడి నుండి వచ్చాను?? 😞
ఎందుకు వచ్చాను ఎక్కడికి వెళుతున్నాను ? దేముడు ఎవ్వరు ఎక్కడ ఉంటాడు ? వాని రూపం ఏమిటి ? ఎవరు ఏ రూపం లో ఆరాధిస్తే ఆ రూపంలోనే దర్సనం ఇస్తున్నారు .😥
అసలు తన రూపం ఏమిటి ? అని ఎన్నో ప్రశ్నలతో సతమతమౌతున్న మనిషికి . 😱
అసలు ఆ పరబ్రహ్మ స్వరూపం ఏమిటి ? ఎవ్వరు ? తన ఉనికి ఏమిటి ? 😞
ప్రశ్నలు అన్నిటికి సమాధానం ఒక్కటే ‘’ ఉన్నది ఒక్కటే అదే అద్వైతం అంటూ “🌷
సాక్షాత్ భగవంతుడు ఆదిశంకరుని రూపంలో వచ్చి నిర్వాణ షట్కం ద్వారా సత్యాన్ని భోదించారు .🌷
(1 ) మనో బుద్ధ్య హంకార చిత్తాని నాహం న కర్ణం న జిహ్వా న చ ఘ్రాణ నేత్రేనచ వ్యోమ భూమిర్న తేజో న వాయు: చిదానంద రూపశ్శివోహం శివోహం..🥀
-----------------------
నేను మనసునూ కాను, బుద్దినీ కాను, అహంకారమునూ కాను,చిత్తమునూ కాను, నేనుకర్ణములనూ కాను, నేను జిహ్వనూ కాను, నేను ఘ్రాణ ఇంద్రియము ఐననాసికనూ కాను,నేను చక్షురింద్రియము ఐన నేత్రములనూ కాను. నేను ఆకాశమునూ కాను, నేను భూమినీకాను నేను తేజస్సునూ కాను, నేను వాయువునూ కాను, చిదానంద రూపుదనైన శివుడనే,,🌷
2) నచ ప్రాణ సంజ్ఞో నవై పంచ వాయుర్నవా సప్త ధాతుర్నవా పంచ కోశఃన వాక్ పాణి పాదౌ నచోపస్థ పాయు చిదానంద రూపశ్శివోహం శివోహం🥀
-------------------------
నేను ప్రాణ వాయువులైన ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన వాయు సంఘమును కాను,సప్త ధాతువులైన రక్త, మాంస, మేథ, అస్థి, మజ్జ, శుక్ర, రసములను కాను, నేను అన్నమయ,ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయములనే పంచ కోశములను కాను, నేనుపంచ కర్మేంద్రియములైన వాక్కు, చేతులు, పాదములు, కామ ఇచ్చను తీర్చుకునే ఇంద్రియమునుకాను, విసర్జక అవయవ ఇంద్రియమునూ కాను..చిదానంద రూపుదనైన శివుడనే, నేను శివుడనే!
(3)న మే ద్వేష రాగౌ న మే లోభ మోహౌ మదో నైవ మే నైవ మాత్సర్య భావ
న ధర్మో నచార్దో న కామో న మోక్షః చిదానంద రూపశ్శివోహం శివోహం🥀
--------------------------
నాకు ద్వేషము లేదు, రాగము లేదు, నాకు లోభము లేదు,మోహము లేదు, నాకు మదముకానీ, మాత్సర్యము కానీ లేవు, నాకు ధర్మము, అర్ధము, కామము, మోక్షము లేవు, నేనుచిదానంద రూపుడనైన శివుడనే, నేను శివుడనే! అనగా నాకు ఏ ద్వంద్వములూ లేవు, నాకు
యే పురుషార్ధములూ లేవు..ఎందుకనగా..నేను భౌతిక శరీరాన్ని కలిగిన మానవుడిని కానుకనుక నేను సాక్షాత్తూ శివుడను కనుక, మానవ సహజమైన మంచి చెడులకు అతీతుడను కనుక!
4)న పుణ్యం న పాపం న సౌఖ్యం న దు:ఖం న మంత్రో న తీర్ధం న వేదా న యజ్ఞ అహం భోజనం నైవ భోజ్యం న భోక్తా చిదానంద రూప శ్శివోహం శివోహం🥀
-------------------------
నాకు పుణ్యము లేదు, పాపమూ లేదు, సౌఖ్యము లేదు, దు:ఖము లేదు,మంత్రము, తీర్ధము,వేదము, యజ్ఞము, ఏవీ లేవు. నేను అనుభవమును కాను, అనుభవించుట యనుక్రియనూ కాను, అనుభవించే వాడినీ కాను, నేను చిదానంద రూపుడనైన శివుడను,
నేను శివుడను!
(5)న మృత్యుర్నశంకా నమే జాతి భేద: పితా నైవ మే నైవ మాతా చ జన్మ
న బంధుర్న మిత్రం గురుర్నైవ శిష్యః చిదానంద రూపశ్శివోహం శివోహం🥀
-------------------------
నాకు మృత్యువు లేదు, శంకా లేదు, జాతి భేదములు లేవు, నాకు తల్లి లేదు, తండ్రి లేడు, జన్మలేదు, నాకు బంధువులు లేరు, మిత్రులు లేరు, గురువు లేడు, శిష్యులు లేరు, నేను చిదానంద రూపుడనైన శివుడనే, నేను శివుడనే! జనన మరణములు, జాతి భేదములు, తల్లి దండ్రులు,గురు శిష్యులు..ఏ బంధములు లేవు..ఎందుకనగా..నేను శివుడను కనుక..అన్ని బంధములకు, అనుబంధములకు అతీతుడను కనుక!
6)అహం నిర్వికల్పో నిరాకార రూపో విభుత్వాచ సర్వత్ర సర్వేంద్రియాణామ్
న చా సంగతం నైవ ముక్తిర్నబంధః చిదానంద రూపశ్శివోహం శివోహం🥀
-------------------------
నేను నిర్వికల్పుడను అనగా నాకు వేరే సాటి ఐనది లేదు, నేను నిరాకారుడను, ఎందుకంటే ఈఆకారం శాశ్వతం కాదు కనుక, అన్నింటికీ, అంతటా అన్ని ఇంద్రియములకూనేనే అధిపతిని, నాకు సంభంధించినవి ఏవీ లేవు, నాకు ముక్తి లేదు, బంధమూ లేదు, నేను చిదానంద రూపుడనైన శివుడనే, నేను శివుడనే!
పై నుండి పరిశీలిస్తే ఇది కాదు, ఇది కాదు అని చివరికి ఏది భగవంతుడో తెలియనప్పుడు, ఏది భగవంతుని తత్త్వమో తెలియనప్పుడు అసలు “” ఏది భగవంతుని తత్త్వము కాదో తెలిసికొనడం తేలిక కనుక ‘ఇది కాదు’ ‘ఇది కాదు’ అని తీసి వేస్తూ చివరికి మిగిలిన వర్ణనకు, వ్యాఖ్యానమునకూ అందని తత్త్వమేదో అదే పరమాత్మ తత్త్వము అని తెలిసికొనడాన్ని వేదాంతం ‘నేతి’..’నేతి’..అంటే .’న ఇతి’..’న ఇతి’..అంటే..’ఇది కాదు’..’ఇది కాదు’..అనే ‘నేతి’ మార్గం అని చెప్పింది! ఈ నిర్వాణ షట్కం లో ‘చిదానంద రూపుడైన శివుడు’ అనే పరమాత్మ తత్త్వాన్ని అదే మార్గంలో ఆది శంకరుడు తెలియ జేశారు! నిర్వాణ షట్కం భారతీయ వేదాంత మార్గంలో ఉన్నతమైన రచన.
ఇది అవగతం చేసుకుంటే రావడం పోవడం సాధారణం . మనం వాసల్ని వదలనంత వరకు ""అని అర్దం అవుతుంది .. 🌷🌷🌷 ఆదిశంకరాచార్య ...🙏🏻
No comments:
Post a Comment