Tuesday, December 20, 2022

🍇మంచి మాటలు 🍇

 🍇మంచి మాటలు 🍇

సత్యం నీ ఇంటి పేరైతే
ధర్మం నీ ఒంటి తీరు అవుతుంది
శాంతం నీ నోట్లో  ఊరుతుంది 
ప్రశాంతం నీ కంట్లో కనిపిస్తుంది.

నీవు గొప్పవాడివే అయితే 
నీవు కోరింది లభించక పోవచ్చేమో కానీ
నీకు అవసరమైంది మాత్రం నీ చేతికే అందుతుంది.

నీవేవరో నీకు అర్థం అయితే 
దేవుడు ఎవరో నీకు కనిపిస్తుంది.

సమయాన్ని ఒక్క నిముషం కాదు ఒక్క క్షణం కూడా వృదా చేయకు.

ఆహారాన్ని ఒక్క ముద్దకాదు
ఒక్క మెతుకు కూడా వృదా చేయకు,పడేయకు.

శాకాహారం నీ ఆశయం అయితే
ఆరోగ్యం నీకు పరవశం అవుతుంది.

నీకిష్టమైంది ధ్యానమే అయితే
నీకు కష్టమైంది దూరం అవుతుంది.

మౌనం నీకు అలవాటు అయితే
మోక్షం నీకు ఆకర్షితం అవుతుంది.

శ్వాస మీద ధ్యాసే ధ్యానం
🙏🙏

No comments:

Post a Comment