Thursday, December 8, 2022

 భ్రమవీడితే చెడినట్లు కనపడేది, చెడినట్లు కాదు. సహజంగా నీవు నీవుగానే ఉన్నావు. అందుకే నేను అనేటటువంటిది, ఆత్మను, సూత్రాత్మను పరమాత్మను అంటూ పోయి, బ్రహ్మమే ఉందంటే, నీకేమి ఉపయోగం? బ్రహ్మ ఎంతగా గొప్పదైనా, నీకేమీ లాభం లేదు. నువ్వే ఆ బ్రహ్మవు కాబట్టి, నీవు ప్రయత్నం చేస్తున్నావు.

       ‘ఆత్మానాం ఉద్ధరేత్‌ ఆత్మానం’ నిన్ను నీవు ఉద్ధరించుకోవడమే. ఉత్‌ అంటే పైకి ధరించడం అంటే ధారణ చేయడం. దేహాత్మగా ఉన్న నీవు దేహము నేను కాదని జీవాత్మనని జీవాత్మగా ఉన్న నీవు జీవుడివి కాదని యదార్థ నేనుగా ఉన్నటువంటి దృక్కుగా ఉద్ధరించుకో! ధారణ చేయి!  ఆ ధారణగా ఉన్నదానిని దృశ్యాన్ని చేసి, బింబ చైతన్యంగా, బింబ ప్రకాశంగా ఉన్నటువంటి పరమాత్మని ధారణ చేయి. దృష్టిని పైకి తీసుకెళ్తున్న కొద్దీ, సాధకుడైనవాడు, వాడే పైకి వెళ్తున్నాడు. ఆ క్రిందివన్నీ దృశ్యమై, యదృశ్యం తన్నశ్యమై, కనపడుతున్నప్పటికీ, లేనివిగా, మిథ్యగా, చూడడం అనేది అలవాటు చేసుకుంటావు. లేని దానికి ఎందుకు తాదాత్మ్యత? అని విడిపోతావు. లేనిదానికి ఎందుకు వెంపర్లాట? అని వైరాగ్యాన్ని పెంచుకుంటావు. లేనిదాని గురించి వచ్చిన ప్రారబ్ద కర్మని, వైరాగ్యంతో, మిథ్యాభావంతో, ఆగామి జోలికి పోకుండా, ఆ జనన మరణ చక్రాన్ని అక్కడికి ఆపేస్తావు. పాతకర్మ అనుభవిస్తూ, కొత్తకర్మ జోలుకి వెళ్ళడు. కొత్తకర్మ అతనికి అంటుకోదు. కొత్తకర్మ అంటుకోని స్థితిలో, తను ఆత్మకు దగ్గరగా, సమీపానికి వెళ్తాడు. తన అనుభవంలో సాక్షి చైతన్యాన్నే అనుభవిస్తుంటాడు. విషయాకారం పొందక, ఆత్మాకారం పొంది, ఆత్మ చైతన్యాన్ని అనుభవిస్తుంటాడు. ఇది ఉద్ధరేతి ఆత్మానం అంటే!- విజ్ఞాన స్వరూపం ఆత్మ జ్ఞానం...

అపస్మారక మనస్సు సామాన్యులకు తెలియదు. మన దైనందిన జీవితంలో మేల్కొనే సమయంలో ఉపయోగించే మరియు పెంపొందించే మనస్సులోని చిన్న భాగాన్ని, మేల్కొనే స్థితిలో మనం ఉపయోగించే మనస్సు యొక్క భాగాన్ని చేతన మనస్సు అంటారు. అయినప్పటికీ, మన దైనందిన జీవితంలో మనసులోని చిన్న భాగం మన నియంత్రణలో ఉండదు. స్పృహ మరియు అపస్మారక స్థితితో సహా మొత్తం మనస్సు మనస్సును ఎలా శుద్ధి చేయాలో తెలిసిన వారిచే నిర్దేశించబడుతుంది. మనస్సును శుద్ధి చేయడం అంటే, మిమ్మల్ని మీరు విడిచిపెట్టడం ద్వారా మీ చేతన మనస్సును నిర్వహించడం నేర్చుకోవడం, అన్ని సంస్కారాలను మానసికంగా ఎదుర్కోవడం మరియు వాటిని వదిలివేయడం నేర్చుకోవడం...

మిత్రులారా..... జీవిత సాఫల్యంలో ఒక వ్యక్తి విజయం సాధించాలంటే కష్టాలు ,నష్టాలు ,బాధలు , దుఃఖాలు, మనిషి గుండెలు పగిలిపోయే వేదనలు, నిద్రలేని రాత్రులు, నిట్టూర్పులు, నీ కళ్ళలో నుంచి కన్నీటి దారలు, ఇవి అన్ని నీకు మిత్రులవుతారు అనుభవమనే గుణపాటాలు ఒక కొత్త మార్గాన్ని సృష్టిస్తుంది
కాలం ఆగని జీవన పోరాటాలే చరిత్రలో గొప్పవాలుగా నిలుపుతాయి .వీటిల్లో ఏ ఒక్కటి లేకుండా విజయం సాధిస్తే వారు చరిత్రలో పేరు మాత్రమే పొందుతారు.
అదే జీవన సాఫల్యంలో అనుభవం పొందిన వ్యక్తి కొన్ని వేల మందిని దుఃఖ నివారణకు మార్గం చూపగలడు అలాంటివాడే సాధకుడు
అలాంటివాడే నిజమైన గృహస్థుడు అలాంటి వాడే నిజమైన రాజయోగి.

No comments:

Post a Comment