Sunday, December 18, 2022

దుఖానికి మూలం ఏమిటి ?

 🙏🕉🙏                    ...... *"శ్రీ"*

                 💖💖💖
       💖💖 *"403"* 💖💖
💖💖 *"శ్రీరమణీయం"* 💖💖

*"దుఖానికి మూలం ఏమిటి ?"*
******"******************
*"ప్రాపంచిక విషయాలే ! జ్వరంతో ఉన్న చంటి పిల్లవాడు   చాక్లెట్ కావాలని మారాంచేస్తే తల్లి వాడి ఆరోగ్య పరిరక్షణ కోసం, ఇష్టమైన మరో తినుబండారాన్ని ఇచ్చి ధ్యాస మారుస్తుంది. దీంతో పిల్లవాడు చాక్లెట్ లేదన్న బాధ నుండి వెంటనే విముక్తుడు అవుతున్నాడు. కానీ మన విషయంలో జ్ఞాపకాల తీవ్రత విషయాన్ని అంత తేలికగా మార్చనివ్వదు. మరొక బలమైన విషయంలోకి ధ్యాస మారిస్తేగాని ప్రస్తుత వేదన మనల్ని విడనాడదు. అందుకే పూజలు, జపాలు, ధ్యానాల పేరుతో మనం మనసును, ధ్యాసమార్చే ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రయత్నాలన్నీ మనసుకు ఎంతో స్వాంతన చేకూరుస్తాయి. కానీ భగవాన్ శ్రీరమణమహర్షి సూచించిన విధంగా దుఃఖమూలాన్ని అన్వేషించకపోతే, ఎప్పటికీ మనం ఏదో ఒక విధానాన్ని ఆశ్రయించి, మాత్రమే విముక్తిని పొందగలుగుతాం. బాధించే విషయం మరీ బలమైనదైతే ఒక్కోసారి ఆ ప్రక్రియలు కూడా పనిచేయవు. దుఖానికి మూలాన్ని అన్వేషిస్తే అవి కేవలం ప్రాపంచిక విషయాలే అని అర్థమవుతుంది !"*

*"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}"*
           

No comments:

Post a Comment