*శుభోదయం*
🎻🌹🙏దేవతలు అనంత పద్మనాభస్వామిని పూజిస్తారు అనడానికి ప్రత్యక్ష నిదర్శనం..!!
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
🌸అనంత పద్మనాభ స్వామి మహిమలు అనంతం....
🌿మొన్న కురిసిన భారీ వర్షాలకు కేరళ రాష్ట్రంలో ఎన్నో జిల్లాలు వరదల పాలయ్యాయి. అనంత పద్మనాభ స్వామి కొలువై ఉన్న తిరువనంతపురం లోను వరదలు వచ్చాయి.
🌸స్వామి వారి ఆలయం ముందు ఉండే పద్మ తీర్ధం నిండిపోయింది, ఆలయం దగ్గరకు వెళ్ళే మార్గం వర్షపు నీటిలో మునిగిపోయింది. దాంతో మూడు రోజుల పాటు స్వామి వారి ఆలయం తెరువలేదు, నిత్య పూజలు జరుగలేదు.
🌷దేవతల ఆరాధన :
🌿అయితే పురాణ ప్రాశస్త్యం ప్రకారం అనంత పద్మనాభ స్వామి వారిని ప్రతి రోజూ దేవతలు పుజిస్తారట. అర్చక స్వాములు ఆలయాన్ని తెరువక ముందే దేవతలు స్వామి వారిని సేవిస్తారట.
🌷అఖండ దీపం :
🌸స్వామి వారి సన్నిధిలో ఒక దీపం అఖండలంగా ప్రజ్వరిల్లుతూ ఉంటుంది. అందులో కేవలం ఆవు నేయ్యి మాత్రమే వేయాలని ఆలయ శాసనం.
🌿ప్రతి రోజు ఆలయం మూసివేసే సమయంలో అర్చక స్వాములు అందులో ఆవు నెయ్యి వేసి వెళతారు. మరుసటి రోజు ఉదయం ఆలయం తెరించేంత వరకూ అఖండలంగా వెలుగుతున్న ఆ జ్యోతిలోనికి మరల నెయ్యి వడ్డిస్తూ కొనసాగిస్తూ ఉంటారు.
🌸మనం లౌకికంగా ఆలోచిస్తే నూనె కంటే నెయ్యితో దీపం వేలగాలంటే కాస్త కష్టమే, ఎందుకంటే నెయ్యి వాతావరణాన్ని బట్టి గడ్డకడుతూ ఉంటుంది. దీపం వెలగడానికి ద్రవంగా మారడానికి సమయం పడుతుంది.
🌿చల్లటి వాతావరణంలో నెయ్యి తొందరగా గడ్డ కడుతూ ఉంటుంది. దీపానికి కావలసిన ద్రవంగా నెయ్యి మారక దీపం కొండెక్కిపోయే అవకాశాలు ఎక్కువ. ఇది మనందరికీ అనుభవనీయమైన సంగతే.
🌸కానీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో దీపం లోనికి గడ్డ కట్టిన నెయ్యి వేసిన అది ద్రవంగా మారి దీపం అఖండలంగా ప్రజ్వరిల్లుతూ ఉంటుంది.
🌿అయితే కొందరికి అనుమానం కలగచ్చు దీపపు ప్రమిద లేక దీపపు కుందె ఎల్లప్పుడూ వెలుగుతూనే ఉంటే అది వేడిగా ఉండి నెయ్యిని కరిగిస్తుంది కదా ఇందులో గొప్ప విశేషం ఏముంది అనిపించవచ్చు.
🌸స్వామి వారి సన్నిధిలో దీపం మట్టి ప్రమిద లోనో లేక లోహపు కుందె లోనో ఉండదు. శిలలో చెక్కబడిన రాతి ప్రమిదలో ఉంటుంది.
🌿ఇప్పుడు ఆలోచించి చుడండి దీపం ఎంత పెద్దగా ప్రజ్వరిల్లితే ఆ వేడికి రాతి ప్రమిద వేడెక్కాలి, అందులో నెయ్యి కరగాలి ? ఉష్ణోగ్రత తరచుగా ఒకచోట నుండి మరొక చోటికి ప్రయాణిస్తూ ఉంటుంది.
🌸రాతి శీలలో ఉండే చలి యొక్క ఉష్ణోగ్రత అదే రాతి శిలలోని ప్రమిదను కుడా చల్లబరుస్తూ నెయ్యిని గడ్డ కట్టేలా చేయాలి.
🌿కానీ అందుకు విరుద్ధంగా నెయ్యి కరిగిపోతూ దీపం నిరంతరాయంగా వెలుగుతూ ఉంటుంది. ఇది సైన్స్ చెప్పే వాటికి వ్యతిరేకంగా లేదా ? స్వామి వారి మహిమ కాక మరేమిటి ?
🌷మరొక నిదర్శనం :
🌸అర్చక స్వాములు ఉదయాన్నే ఆలయం తెరిచి చూసినప్పుడు దీపంలో నెయ్యి కాస్త తగ్గి ఉంటుంది. ఆ దీపాన్ని మళ్ళీ నెయ్యి వేసి నింపుతారు.
🌿అంటే ప్రతి రోజు ఉదయం, మధ్యాహ్నము, సాయంత్రం, రాత్రి అర్చక స్వాములు అప్రమత్తంగా ఉంటూ దీపం అఖండలంగా ఉండేలా నెయ్యి వడ్డిస్తూ ఉంటారు కదా.
🌸మరి మూడు రోజులు ఆలయం మూసి ఉన్నా కూడా ఆ దీపం అలానే వెలుగుతూ ఉంది అంటే ఎవరు నెయ్యి వడ్డించి ఉంటారు? ఇది దేవతలు స్వామి వారిని సేవిస్తుంటారు అనటానికి నిదర్శనం కాదా?
🌷మరొక నిదర్శనం :
🌿అనంత పద్మనాభ స్వామి వారి మూర్తి పూర్తిగా నీటిలో మునిగిపోతే ప్రళయం సంభవిస్తుందని ఆలయ శాసనంలో ఉంది. మొన్న కురిసిన వర్షాలకు తిరువనంతపురం దాదాపుగా మునిగిపోయింది.
🌸స్వామి వారి మూర్తి ఎంత వరకూ వరదలో మునిగిందో అనీ తిరువనంతపుర ప్రజలు భయాందోళలను పొందారు. ఆలయం దగ్గర కనిపించిన వరద తాకిడి కూడా భయానకంగా కనిపించిందట.
🌿మూడు రోజుల తరువాత అర్చక స్వాములు ఆలయ తలుపులు తీసి చూడగా వారు నిశ్చేష్టులయ్యారు. స్వామి వారి గర్భాలయంలోనికి నీరు ప్రవేశించలేదు. ఎక్కడా తేమ కూడా లేదు.
🌸అప్పుడే కడిగి శుబ్రపరచినట్లుగా పొడిగా, సుగంధ పరిమళాలతో సువాసనలతో, అఖండలంగా ప్రజ్వరిల్లుతున్న దీపం దర్శనమిచ్చాయి. అంతే కాదు స్వామి వారికి అలంకరించిన పూల మాలలు తాజాగా ఉన్నాయి.
🌿బయట ధ్వజస్థంభం కూడా పరిశుభ్రంగా తేమ లేకుండా ఉన్నాయి. స్వామి వారి ఆలయం చుట్టూ ఉండే ఉపాలయాలలోను వరద నీరు ప్రవేశించలేదు. ఇలా నేటికీ స్వామి వారి ఉనికి మనకు చాటుతూనే ఉన్నారు.
🌸మనమే ఆయనను గుర్తించలేక శిలలా భావిస్తూ యాంత్రికంగా షోడశోపరచార పూజలు చేస్తూ మన భక్తికి సాటిలేదు అంటూ గర్విస్తూ అజ్ఞానంలో ఓలలాడుతూ ఉన్నాము.
🌿ఇలాంటి నిదర్శనాలు ప్రతి ఆలయంలోను జరుగుతూనే ఉంటాయి. అంతటి భక్తి మనలో ఉంటే వాటిని దర్శించే భాగ్యము స్వామి వారే కలిగిస్తారు.
🌸ఇలాంటి నిదర్శనాలను అందరికీ తెలియజేసి నాస్తికులలోను, హేతువాదులలోను మార్పు తెచ్చి మన సనాతన ధర్మాన్ని పరి రక్షించుకోవలసిన కర్తవ్యం మనది కాదా ఆలోచించండి ...
🌿" ఓం నమో నారాయణాయ " అని వ్రాస్తూ స్వామి వారి అనుగ్రహం పొందండి..ఓం నమో నారాయణాయ..స్వస్తి....🚩🌞🙏🌹🎻
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
No comments:
Post a Comment