Thursday, December 29, 2022

వేదాల మూలంగా వెలసిన మన ప్రాచీన విజ్ఞాన గ్రంథాలు.

 [12/29, 06:20] +91 73963 92086: వేదాల మూలంగా వెలసిన మన ప్రాచీన విజ్ఞాన గ్రంథాలు.
..................................................................

వేదకాలంనుండే మన దేశంలో అనేక శాస్త్రాల అధ్యయనం జరిగింది. అనేక విజ్ఞాన శాస్త్ర గ్రంథాలు వెల్లివిరిశాయి. వాటిలో కొన్నింటిని గురించి తెలుసుకుందాం.

(1) అక్షరలక్ష - ఇది సర్వశాస్త్ర సంగ్రహం (Endopedic Science). దీనికర్త వాల్మీకి, రేఖా గణితం, బీజగణితం, త్రికోణమితి, భౌతిక గణితశాస్త్రం మొదలైన 325 రకాల గణిత ప్రక్రియలు, ఖనిజశాస్త్రం, జలయంత్ర శాస్త్రం, భూగర్భశాస్త్రం, గాలి, ఉష్ణము, విద్యుత్తులను కొలిచే పద్ధతులు మొదలైన ఎన్నో విషయాలు ఇందులో తెలుపబడ్డాయి.

(2)  శబ్దశాస్త్రం - ఖండికఋషి ప్రణీతం, పేరుకు తగ్గట్టు ఇది సృష్టిలోని చరాచర పదార్థాల ధ్వనుల్ని, ప్రతిధ్వనులను గూర్చి చర్చించింది. కృత్రిమంగా ధ్వనుల్ని ప సృష్టించడం, వాటి స్థాయి, వేగాలను కొలవడం అనే విషయాలను ఐదు అధ్యాయాలలో వివరించబడింది.

(3) లక్షణశాస్త్రం - శకటాయన ఋషిచే రచించబడింది.. చైతన్య, జడ  పదార్థాల గురించిన శాస్త్రం.

(4) కన్యాలక్ష్ణణ శాస్త్రం - బభృముని ప్రణీతం. కన్యా లక్షణాలను చర్చించిన ఈ శాస్త్రంలో సౌశీల్యాది విషయాలను నిర్ధారించే విధానాలు తెలుపబడ్డాయి. 

(5) శకునశాస్త్రం - గార్గముని ప్రణీతం. పక్షుల ధ్వనులను బట్టి, మనుషుల మాటను బట్టి శుభాశుభము.
లను నిర్ణయించే విధానాలు తెలుపబడ్డాయి.

(6) శిల్పశాస్త్రం - కశ్యపఋషి ప్రణీతం. 22 అధ్యాయాల్లో 307 రకాల శిల్పాలను గూర్చి అంటే101 రకాల విగ్రహాలతో కలిపి కూలంకషంగా చర్చించబడింది. గుళ్ళు, రాజభవనాలు, చావడులు మొదలైన నిర్మాణ విషయాలు ఇందులో వెయ్యికి పైబడి ఉన్నాయి. ఇదే శాస్త్రం మీద విశ్వామిత్రుడు, మయుడు, మారుతి, ఛాయా పురుషుడు మున్నగు వారు చెప్పిన విషయాలు కూడా ఇందులో చర్చించ బడ్డాయి.

(7) సూపశాస్త్రం - సుకేశ ప్రణీతం ఇది పాకశాస్త్రం. సుమారు 108 రకాల వ్యంజనాలు, ఊరగాయలు, మిఠాయిలు, రొట్టెలు, పిండి వంటలు మొదలైన వంటకాల గురించి, ప్రపంచ వ్యాప్తంగా వాడుకలో ఉన్న 3032 రకాల పదార్థాల తయారీ విధానం చెప్పబడింది.

(8) మాలినీ శాస్త్రం - ఋష్యశృంగునిచే రచింపబడింది. పూల అమరిక గురించి చెప్తుంది. మాలలు తయారు చెయ్యడం పూలగుత్తులు (Banquet), పూలతో వివిధ రకాల శిరోలంకరణలు, గుప్త (కోడ్)భాషలో పూలరేకుల మీద ప్రేమసందేశాలు పంపడం వంటి అనేక విషయాలు 16 అధ్యాయాలలో విశదీకరించబడింది.

(9) కాలశాస్త్రం - భగవాన్ కార్తికేయ ప్రణీతం: కాలం, కాలవిభజన, శుభ అశుభ కాలాలు వాటి అధిదేవతలు మొదలైన విషయాలు విశదీకరించబడ్డాయి.

(10) సాముద్రిక శాస్త్రం - సముద్రునిచే చెప్పబడి సాముద్రిక శాస్త్రంగా ప్రసిద్ధి పొందింది. శ్రీ మహావిష్ణువు ఆదిశేషునిపై శయనించి ఉన్నప్పుడు ఆయన శరీరంపైనున్న శుభముద్రలను సముద్రుడు తెలిపాడు. ఈ శాస్త్రం తదుపరి కాలంలో నారద, మాండవ్య, వరాహ, కార్తికేయాదులచే విస్తరింపబడింది. హస్తం రేఖాశాస్త్రం ఇందులోనిదే.

(11) ధాతుశాస్త్రం - అశ్వనీకుమార ప్రణీతం, సహజ, కృత్రిమ ధాతువులను గూర్చి 7 అధ్యాయాలలో కూలంకషంగా విశదీకరించబడింది. మిశ్ర ధాతువులు, ధాతువులు రూపాంతరణ, రాగిని బంగారంగా మార్చడం మొదలైన విషయాలు కూడా వివరించబడ్డాయి.

(12) విషశాస్త్రం - అశ్వనీ కుమార ప్రణీతం. 32 రకాల విషాలు, వాటి గుణాలు, తయారీ, ప్రభావాలు, విరుగుళ్ళు మొదలైన సమస్త విషయాలు చెప్పారు.

(13) చిత్రకర్మశాస్త్రం -  భీమ ప్రణీతం. చిత్రలేఖనం గూర్చిన శాస్త్రం. 12 అధ్యాయాల్లో సుమారు 200 దళాలు చిత్రలేఖన ప్రక్రియలను గురించి తెలుపబడింది. ఒక వ్యక్తి యొక్క తలవెంట్రుకలను గాని, గోటినిగాని, ఎముకను గాని చూసి ఆ వ్యక్తి బొమ్మను గీసే ప్రక్రియ చెప్పబడింది.

(14) మల్లశాస్త్రం - మల్ల ప్రణీతం. ఆరోగ్య పరిరక్షణకు కసరత్తులు, క్రీడలు వివరించ బడ్డాయి. వట్టి చేతులతో చేసే 24 రకాల యుద్ధ విద్యలు చెప్పబడ్డాయి.

(15) పరకాయ ప్రవేశం - వాలఖిల ప్రణీతం. ఒక శరీరాన్ని వదలి ఇంకొక శరీరంలోకి ప్రవేశించటం. 32రకాల యోగవిద్యలు, అణిమాది అష్టసిద్దులను నేర్పుతుంది ఈ శాస్త్రం.

(16) అశ్వశాస్త్రం - అగ్నివర్మ ప్రణీతం. గుర్రములు, వాటికి సంబంధించిన శుభాశుభ చిహ్నాలు, దేహ ధర్మాలు, ఈనడం, శిక్షణ మొదలైన సమస్త విషయాలను కూలంకషంగా తెలుపుతుంది. 

(17) గజశాస్త్రం - కుమార స్వామి ప్రణీతం. ఏనుగుల శరీర లక్షణాల్ని పరీక్షించడానికి 16 పద్ధతులు.
ఇంకా అనేక విషయాలు సవివరంగా చర్చించబడ్డాయి. 

(18) రత్నపరీక్ష - వాత్సాయన ఋషి ప్రణీతం, రత్నాలకు సంబంధించి 24 లక్షణాలు, సహజ - కృత్రిమ రత్నాలు వాటి రూపాలు, బరువు మొదలైన విషయాలన్నీ తరగతుల వారీగా విభజించి తర్కించ బచ్చాయి. రత్నాల శుద్ధతను పరీక్షించడానికి 32 పద్ధతులు వర్ణించబడ్డాయి.

(19) మహేంద్రజాల శాస్త్రం - సుబ్రహ్మణ్య స్వామి శిష్యుడైన వీరబాహు ప్రణీతం. ఇందులో గారడీ విద్య వివరించబడింది. నీటిపై నడవడం, గాలిలో తేలడం వంటి భ్రమలను కల్పించే విధానాలు నేర్పుతుంది.
[12/29, 06:21] +91 73963 92086: (20) అర్థశాస్త్రం - వ్యాస ప్రణీతం. 3 భాగాలుగా, 82 ధనసంపాదనా విధానాలను అందునా ధర్మబద్ధమైన సంపాదనలు ఇందులో వివరించబడ్డాయి.

(21) శక్తితంత్రం - అగస్త్య ప్రణీతం. 8 అధ్యాయాలు గలది. మూలప్రకృతి, మాయ; సూర్యుడు, చంద్రుడు,
గాలి, అగ్ని మొదలైన వాటి 64 రకాల బాహ్యశక్తులు వివరించబడి వాటి ప్రత్యేక వినియోగాలుకూడా చెప్పబడ్డాయి. అణువిచ్ఛేదనం ఇందులోని విభాగమే.

(22) సౌధామినీ కళ - మతంగ ఋషి ప్రణీతం. నీడలద్వారా, ఆలోచనలద్వారా సమస్త దృగ్గోచర విషయాలను ఆకర్షించే విధానం చెప్పబడింది. పర్వతాల అంతర్భాగాల, భూమి అంతర్భాగాల ఛాయా చిత్రాలను తీసే ప్రక్రియ చెప్పబడింది.

(23) మేఘశాస్త్రం - అత్రిముని ప్రణీతం, 12 రకాల మేఘాలు, వాటి లక్షణాలు, 12 రకాల వర్షాలు, 64 రకాల మెరుపులు, 33 రకాల పిడుగులను గూర్చి తెలుపబడింది.

(24) యంత్రశాస్త్రం -  భరద్వాజ ప్రణీతం. భూమిపై ప్రయాణానికి ఉపయుక్తమైన 339 రకాల వాహనాలు,నీటిపై చరించడానికి 783 రకాల పడవలు, ఓడలు; 101 విధాల గాలి ఓడలు (విమానాలు) -
మంత్ర తంత్ర కృత్రిమ విధానాలతో సాధ్యమయ్యేవి చెప్పబడ్డాయి. గంధర్వాదులు ఉపయోగించే వాహనాలు కూడా వివరించబడ్డాయి.

(25) స్థాపత్యవిద్య -  అధర్వవేదం లోనిది. ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్, కట్టడాలు, నగర ప్రణాళిక మొదలైన
సమస్త నిర్మాణ విషయాలు తెలుపబడ్డాయి.

(26) ఆయుర్వేదం - బ్రహ్మ, అశ్వనీ దేవతలు, ధన్వంతరి, భరద్వాజుడు, అత్రి, అగ్నివేశాదులచే చెప్పబడింది. తరువాత చరకుడు సమస్త ఆయుర్వేద విజ్ఞానాన్ని క్రోడీకరించి తన సంహితలో రాశాడు. సుశ్రుతుడు మరింత ముందుకు తీసుకుపోయాడు. వాగ్భటుడు ఒక గ్రంథం రాశాడు. ఔషధాలే కాక శస్త్ర చికిత్స, ఇంజక్షన్లు కూడా ఉపయోగించారు. సుశ్రుతుడు కాయకల్పం మీద ఒక గ్రంథం రాశాడు.

(27) ధనుర్వేదం - విశ్వామిత్ర మహర్షిచే చెప్పబడింది. ఇందులో దీక్ష, సంగ్రహం, సిద్ధాంతం, ప్రయోగం అని నాలుగు విభాగాలు, చక్రం కత్తి వంటివే కాక అనేక ఇతర ఆయుధాల ప్రయోగం కూడా చెప్ప బడింది. బ్రహ్మాస్త్రం, వైష్ణవాస్త్రం, పాశుపతాస్త్రం, ఆగ్నేయాస్త్రం వంటి వివిధ శస్త్రాస్త్ర ప్రయోగం ఆయా అస్త్రదేవతలు, మంత్రాలు, ఆయుధాల వర్ణన వంటివే కాక నకిలీ యుద్ధాలు కూడా వర్ణించబడ్డాయి. 

(28) గాంధర్వవేదం - నందికేశ్వర, నారద, హనుమదాదులచే చెప్పబడిన సంగీత నాట్య విద్యను భరతముని విపులంగా గ్రంథస్థం చేశారు. గాత్ర, వాద్య సంగీతాలు, నృత్యం ఇందులోని భాగాలు, భగవదర్చ నతో మానసిక తాదాత్మ్యం పొందడమే ఈ శాస్త్రం యొక్క ముఖ్యోద్దేశం.

రామకృష్ణమఠము వారి భారతీయ ప్రతిభావిశేషాలు నుండి 

/సేకరణ /
........................ జిబి.విశ్వనాథ, 9441245857, అనంతపురము.

No comments:

Post a Comment