Tuesday, December 20, 2022

🙏🙏 జగత్ సత్యం 🙏🙏

 🙏🙏 జగత్ సత్యం 🙏🙏

దేవుడు మూగ వాడు కావచ్చు 
దేవుడు చెవిటి వాడు కావచ్చు
దేవుడు కుంటి వాడు కావచ్చు
దేవుడు మనకు కనిపించక పోవచ్చు                          
కానీ మనం దేవుడికి కనిపిస్తాం.

దేవుడు గుడ్డి వాడు మాత్రం కాదు, కానే కాదు.
దేవుడి దగ్గర A/C కెమెరా వుంది (మరవద్దు)
పగలు సూర్యుడు లాగా
రాత్రి చంద్రుడు లాగా
(మన దగ్గర C C కెమెరా లాగా)

మనమే ఇంత గొప్పవారం అయితే
మనతో పాటు 750 కోట్లమంది
ఇంకా 84 లక్షల జీవరాశులు
ఈ మొత్తం సృష్టి ఆయనే కదా
మరి ఆయన ఎంత గొప్పవాడు అయ్యుంటాడు.
తలచుకుంటేనే వామ్మో........

దేవుడు మన పొరపాట్లు క్షమిస్తాడేమో కానీ
దేవుడు మనం చేసిన చిన్న చిన్న తప్పులు క్షమిస్తాడెమో కానీ
(అదీ కూడా మనం తెలుసుకుని ప్రాయచిత్తం కోరితేనే )
దేవుడు మనం చేసిన చెడు క్షమించడు
దేవుడు మనం చేసిన పాపాలు క్షమించడు 
(అనుభవించి తీరాల్సిందే)
అలాంటి ఏర్పాట్లు వున్నాయి
అక్కడ 
మినహాయింపులు లేవు, ఉండవు.
ఒకే ఒక మినహాయింపు వుంది.
;అదే జ్ఞానాగ్ని దగ్ద ఖర్మానాం;

ధ్యానం ద్వారానే జ్ఞానం
జ్ఞానం ద్వారానే మోక్షం
శ్వాస మీద ధ్యాసే ధ్యానం
ఇందుకు మౌనం శాకాహారం అత్యంత అవసరం.

ఒక ధ్యాన పిపాసి.👏

No comments:

Post a Comment