Wednesday, December 7, 2022

మౌనము

 🌸🫐🌸🫐🌸🫐🌸🫐🌸

 
*మౌనము*


ప్రస్తుత జీవితములో చేసిన కర్మల వలన ఏర్పడినవి మరియు వారసత్వంగా పొందిన పాపపు ముద్రలు వ్యక్తి నడవడి, స్వభావాలను రూపొందిస్తాయి. అవి గుప్త నిధి మాదిరిగా, ప్రాణశక్తిలో నిగూఢంగా ఉండి సకాలంలో బాధ, సంతోషాలను కల్గించే త్రికరణాలైన ఆలోచన, మాట, పనులు గాను, వ్యాధుల రూపంలోను బహిర్గత మవుతాయి. 
       ఒక నెలలో గానీ, సంవత్సరంలో గానీ ఒక వ్యాపారి ఒకటి లేదా రెండు రోజులు తన వ్యాపారానికి సంబంధించిన నిలువలను సరి చూసుకోడానికి కేటాయించినట్లు, ప్రతి ఒక్కరూ ఒక రోజును మౌన సాధనకు కేటాయించి తనను,తన కర్మలను విశ్లే శించుకోవాలి. ధ్యానము, ఆత్మ పరిశీలనను చేసుకోవాలి. అప్పుడు తన తప్పులను తెలుసుకొని వాటిని సరి దిద్దుకోవడానికి తగిన నిర్ణయాలను తీసుకో గల్గుతాడు. మౌనం యొక్క లక్ష్యాన్ని మరియు దాని విలువను అర్థం చేసుకోడానికి ప్రయత్నించి, ఆత్మ నుండి పాపపు ముద్రలను తొలగించుకోవడానికి మౌన సాధన చేద్దాం. మనలను మన కుటుంబాన్ని, బంధువులను, దేశ ప్రజలను మరియు యావత్ ప్రపంచాన్ని నిస్వార్థంగా దీవించి, ఆ దీవెన లోనే సంతోషాన్ని పొందుదాము.
మౌనంగా ఉంటూ అంతరంగ సందేశాలు వింటూ దుఃఖ రహిత జీవితం అనుభవిస్తూ దుఃఖ రహిత సమాజం కొరకు కృషి చేద్దాం... విశ్వ ప్రణాళికలో భాగంగా విశ్వ కళ్యాణం కొరకు మన వంతు పాత్ర అధ్బుతంగా పోషించాలి.
సేకరణ 
🌸🫐🌸🫐🌸🫐🌸🫐🌸

No comments:

Post a Comment