సద్గురు పరబ్రహ్మణే నమః
ఎరుక
*
శ్రీ నిసర్గదత్త మహారాజ్ ముఖ్యభోదామృతవాక్యములు
స్వరూపము
**
1. సత్య స్వరూపము అన్నిటికంటే సులభమైనది. ఎందుకంటే అది తమ స్వరూపమే అయి ఉన్నది. స్వరూపము కంటే అన్యంగా మరే ఇతర ఆలోచన చేయకుండా ఉండటం, మరే ఇతర కోరిక లేకుండా ఉండటం చాలు.
2. మీ సొంతం కాని దానిని మీరు వదిలి వేస్తారు. మీరు ఎన్నడూ పోగొట్టుకోనిదైన మీ నిజస్వరూపాన్ని మీరు పొందుతారు.
3. సత్య రూపాన్ని నిరూపించలేము మరియు దానిని ఖండించలేము. మనసు లోపల మీరు ఎలా చేయలేరో మనసుకు ఆవల అలా చేయవలసిన అవసరం ఏమాత్రం లేదు.
4. నేనే అంతటా ఉన్నాను. నేనే అంతటా ఉన్న సత్యాన్ని. నాకంటే అన్యంగా అలాంటి ఏ సత్యము లేదు.
5. అబద్ధపు 'నేను'ను త్యాగం చేయాలి. అప్పుడే స్వరూపం యొక్క అన్వేషణ పూర్తవుతుంది.
6. సంసారం అనేది ఏమీ లేదు, మరియు "నేను" అనగా ఆత్మే అంతా.
7. అంతా శుద్ధ చైతన్యంలోనే ఉన్నది. శుద్ధ చైతన్యానికి ఎప్పటికీ మరణం లేదు. దానికి పునర్జన్మ కూడా లేదు. అదే ఆ మార్పు లేనట్టి సద్వస్తువు.
8. అన్ని నామరూపాలను త్యజించిన తదుపరి సత్య స్వరూపము మీ చెంతనే ఉంటుంది
9. తనను తాను తెలుసుకోవడానికి సహాయపడేదే - ధర్మము. ఆటంకాలు కల్పించేదే - అధర్మము. తన సత్య స్వరూపాన్ని తెలుసుకోవడమే పరమానందం. మరియు సత్య స్వరూపాన్ని మరిచిపోవడమే దుఃఖము.
10 . సత్యము ప్రేమమయము, ప్రేమాస్పదము. అది అందరినీ కలుపుతుంది. అందరినీ స్వీకరిస్తుంది. అందరినీ పవిత్రం చేస్తుంది.
సశేషం
హరిః ఓం
No comments:
Post a Comment