*::::::::::: పోల్చడం::::::::*
చిన్నది, లావుది, సన్నది, పెద్దది, మంచిది, చెడ్డది అని దేని గురించి అయినా చెప్పాలంటే ఒక దానిని మరొక దానిని పోల్చి చెప్పాలి. ఇది మనందరికి తెలుసు.
మనం ఇతరులను గౌరవిస్తాం, గొప్ప వాడు అంటాం, తెలివి గల వాడు అంటాం. పేదవాడు అంటాం.
ఇది కూడా పోల్చి చెప్పే విషయాలే. ఈ పోలిక ఎవరి తో చేస్తూ వుంటాము. అనగా మనతోనే. మనలను ఎదుట తారస పడిన వ్యక్తి తో పోల్చి మనకు కన్నా గొప్ప అని భావిస్తే గౌరవిస్తాం, లేకుంటే చులకన చేస్తాం.
ఈ పోల్చడాన్ని అనుసరించి మనం రకరకాల మనుషుల తోటి రకరకాలుగా
వ్యవహరిస్తాము, ప్రవర్తిస్తాము.
ఇలా పోల్చడానికి బేస్
మనం మన మీద మనం వేసుకున్న అంచనా, ముద్ర.
ఓ మనిషీ దృష్టి లోపలికి త్రిప్పు, చూడు..అదే ధ్యానం.
*షణ్ముఖానంద9866699774*
No comments:
Post a Comment