*✅ తెలుసుకుందాం ✅*
*🔴గబ్బిలాలు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు🦇*
1. ఎగిర గలిగే ఒకే ఒక్క క్షీరదం గబ్బిలం. ఇతర క్షీరదాలు పాకే లక్షణాలు కలిగి ఉండగా గబ్బిలాలు మాత్రమే నిరంతరం ఎగరగలవు.
2. గబ్బిలాల లో దాదాపు 1000 రకాలు ఉన్నాయి.
3. గబ్బిలాలు దాదాపు 30 ఏళ్లు జీవిస్తాయి. గంటకు 60 మైళ్ల వేగంతో ప్రయాణిస్తాయి.
4. గబ్బిలాలు పూర్తి చీకట్లో కూడా ఆహారం చూడగలవు. ఎక్కువ శబ్దం చేసి సెకనుకు10-20 బీబ్స్ చేసి రీ సౌండ్ సృష్టించి కీటకాలను ఆకర్షించి ఆహారాన్ని తింటాయి.
5. గబ్బిలాలు గంటకు 1200 దోమలను తినగలవు. ప్రతి రాత్రి తమ శరీర బరువును పెంచుకుని దోమలు, కీటకాలు వ్యాపించకుండా చేస్తాయి.
6. తల్లి గబ్బిలాలు తమ పిల్ల గబ్బిలాలను కొన్ని వేల, లక్షల గబ్బిలాల మధ్య ఉన్నా దాని వాసన, శబ్దం ద్వారా గుర్తిస్తాయి.
7. ఎక్కువ గబ్బిలాలు కీటకాల పై ఆధారపడి జీవిస్తే, కొన్ని పళ్ళు, చేపలు తింటే కొన్ని రక్తం కూడా తాగుతాయి.
8. మూడు రకాల పిశాచ గబ్బిలాలు కేవలం రక్తం మాత్రమే తాగి జీవిస్తాయి.
9. ఈ పిశాచ గబ్బిలాలు పదునైన వాడి దంతాలు కలిగి ఉండి, ఒక జంతువు చర్మాన్ని ఆ జంతువు గమనించే లోగానే చీల్చి రక్తం తాగుతాయి.
10. పిశాచ గబ్బిలాలు చేసే గాయాలు చాలా ప్రమాదకరమైనవి.
11. కొన్ని గబ్బిలాలు కొద్దీ గుంపు తో జీవించడానికి ఇష్ట పడితే, చాలా గబ్బిలాలు గుహలలో వేలాదిగా కలిసి జీవిస్తాయి.
12. దక్షిణ పసిఫిక్ లో ఉండే “ఫ్లయింగ్ ఫాక్స్” జాతి గబ్బిలాల రెక్క విచుకున్నప్పుడు దాదాపు ఆరు అడుగులు ఉంటుంది. ఇది ప్రపంచంలో పెద్దది.
13. గబ్బిలాల లో చిన్న జాతి థాయిలాండ్ లో “బంబుల్ బీ” ఇది గోటి కంటే చిన్నగా, పైసా బరువు ఉంటుంది.
14. ఫ్లయింగ్ ఫాక్స్ లేదా పెరోతుస్ గబ్బిలాలు ప్రపంచంలో అతి పెద్దవి.
*సేకరణ*
No comments:
Post a Comment