*అనంతమైన, సృజనాత్మకమైన స్వేచ్ఛను పొందడం ఎలాగ?*
*How to attain Dynamic Freedom which is Unlimited?*
*~~~*
- సద్గురు శ్రీ మెహెర్
చైతన్యజీ మహరాజ్
(Part - 3)
*(ప్రశ్న:: _"కష్టం" ఎందుకు కలుగుతుంది, అసలు ??_)*
*గురుదేవులు:: పక్షి ఆకాశంలో హాయిగా విహరిస్తున్నప్పుడు, దానికి వాస్తవమైనటువంటి స్వాతంత్ర్యము, స్వేచ్ఛ తెలియదు. (ఎందుకంటే) సహజమైనటువంటి, సాధారణమైనటువంటి జీవితం జీవిస్తుంటుంది.*
_(కానీ) ఎప్పుడైతే తాను ఒక పంజరములో చిక్కుకుని, పరిమితమైనటువంటి అనుభవాన్ని అనుభవిస్తుందో, అప్పుడు– తాను విడిచి వచ్చినటువంటి అనుభవం యొక్క విశిష్టత తాను గుర్తిస్తుంది._
*అప్పుడు, దాని నుండి తప్పింపబడినప్పుడు,*
ఆ ఆనందానికీ,
ఆ స్వేచ్ఛకు,
ఆనందానుభూతికీ
ఒక అదృశ్యమైనటువంటి
ఒక దివ్య హస్తము
ఏదో ఉండి,
ఇదంతా నిర్వహింపచేస్తుంది
*అని తెలుస్తుంది.*
*(అదే విధంగా) ఏ ఆత్మ అయితే తన యొక్క వాస్తవమైనటువంటి "దైవీ స్థితి"ని తెలుసుకుని అనుభవించలేడో, అటువంటి వ్యక్తికి–*
ఒక కష్ట
సంబంధమైనటువంటి,
ఒక
దుఃఖమిశ్రితమైనటువంటి
ఒక అనుభవాన్ని
కల్పిస్తాడట.
(కల్పించి)
ఆ అనుభవం నుండి
జాగరూకుని
చేస్తాడట,
మేల్కొల్పుతాడట.
*తద్వారా,*
తన ఉనికి ఉన్నదనిన్నీ,
తన ద్వారా ఈ రక్షణ
జరిగినది అనిన్నీ
అనుభవింప చేస్తాడట.
*అటువంటి దివ్యానుభవ సంప్రాప్తికి కూడా, ఈ "పీడకల" అనేటువంటిది ఉపకరిస్తుంది అని బాబా తెలియజేసారు.*
తరువాత, వాస్తవమైనటువంటి స్వాతంత్ర్యము, స్వేచ్ఛ– "భగవదానుభూతి"ని పొందిన పిదపనే మానవాత్మకు లభిస్తుంది.
To be contd.....
No comments:
Post a Comment