Wednesday, January 18, 2023

మంచి మాట... లు(17-01-2022)

 ఆత్మీయ బంధుమిత్రులకు మంగళవారం శుభోదయం శుభాకాంక్షలు💐, శ్రీ వల్లి దేవసేవ సమేత తిరుత్తని సుబ్రమణ్య స్వామి వారు, మా ఇంటి దైవం వినుకొండ శ్రీరామ భక్త శ్రీ గుంటి ఆంజనేయ స్వామి వార్ల అనుగ్రహంతో మీరు మీ కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సంతోషాలతో నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ
17:01:2023 :-మంగళవారం 
ఈ రోజు *AVB* మంచి మాట... లు

 _*చీకట్లే దారి చూపితే వెలుగులెందుకు,, ప్రతి ప్రశ్నకు బదులు దొరికితే కాలమెందుకు,, అనుకున్నవన్ని జరిగితే దేవుడేందుకు,, జరిగినవన్ని మనం కొరినవే అయితే ఇక కన్నీళ్లేందుకు, ఏమంటారు ఫ్రెండ్స్,,,*_

_*పరాయ్ వాడు పాతిక రూపాయలు తిన్న పర్వాలేదు కానీ,, అయిన వాడు అర్ధరూపాయ్ తిన్నా ఒప్పుకోరు,ఇదే నేటి సమాజంలో కొంతమంది తీరు,,*_

*_ద్వేషంతో మొరిగే,_*
*_వీధి కుక్కల మధ్యన,_*
*_గజరాజులా సాగిపోవడమే..._*
*_నాకు తెలిసిన బతుకు.!_*
*_నా గమ్యాలు..._*
*_ ఊహకి అందని శిఖరాలు,_*
*_నేనొక అలుపెరుగని బాటసారిని,_*
*_నా కథ వేరు...నా బతుకు వేరు.!_*
*_నన్ను కన్న తల్లిదండ్రులు అంటూవుంటారు,_*
*_జంగం పోతుంటే కుక్కలు మొరుగుతాయ్ పట్టించుకోకు అని..._*

_*ఎవరో ఒకరు మన రంగును, రూపాన్ని హేళన చేసినంత మాత్రాన మనకు ఉన్న విలువలు పాతాళానికి పడిపోవు,, సముద్రం నీరు ఉప్పుగానే ఉండవచ్చు,కానీ దానిలో సంపదకు కొదవలేదు కదా,, మనం కూడా అందంగా లేకపోవచ్చు, కానీ మన మంచితనానికి కొదవ లేదు కదా,,,*_

సేకరణ ✒️AVB సుబ్బారావు 💐🤝🕉️🥰

No comments:

Post a Comment