Thursday, January 5, 2023

హిందూ బందువులకు ' అత్యంత ముఖ్యమైన హెచ్చరిక ' .. హిందువుల ఆస్తులు చట్టప్రకారంగా ' బలవంతంగా లాగేసుకోవడానికి ' ముస్లింస్ కోసం కాంగ్రేస్ పార్టీ 1995 లో వక్ఫ్ చట్టం తెచ్చింది..ఈ దుర్మార్గ చట్టం గురించి ఎంతమందికి తెలుసు??..

 హిందూ బందువులకు ' అత్యంత ముఖ్యమైన హెచ్చరిక ' ..
హిందువుల ఆస్తులు చట్టప్రకారంగా ' బలవంతంగా లాగేసుకోవడానికి ' ముస్లింస్ కోసం కాంగ్రేస్ పార్టీ 1995 లో వక్ఫ్ చట్టం తెచ్చింది..ఈ దుర్మార్గ చట్టం గురించి ఎంతమందికి తెలుసు??..
ఈ చట్టం ఉపయోగించి గత రెండు నెలల్లో  గుంటూరు జిల్లాలో రెండు చోట్ల.. 
1. చేబ్రోలు మండలం గొడవర్రు గ్రామంలో జంధ్యాల వసంతమ్మ అమ్మవారి 2 ఎకరాల 65 సెంట్లను..
2. కాకుమాను మండలం కొండపాటూరు గ్రామంలో గల శ్రీకృష్ణ మందిర ఉత్సవాలు జరిగే 11 సెంట్లను కాజేయడానికి స్థానిక ముస్లింస్ వక్ఫ్ చట్టాన్ని ప్రయోగించారు..
గొడవర్రు గ్రామంలో అయితే అత్యంత దారుణంగా ము.
స్లింస్ ప్రవర్తించారు..
వందలాది ఏళ్లుగా కులాలతో నిమిత్తం లేకుండా గ్రామస్తుల పూజలందుకుంటున్న ' జంధ్యాల వసంతమ్మ ' అమ్మవారి విగ్రహాన్ని ము. క్కలు ము. క్కలుగా పగలు. కొట్టి బావిలో వేసి..ఆ బావిని పూడ్చేశారు..
తర్వాత ఆ కాంపౌండ్ మొత్తం ప్రహరీ గోడ కట్టేశారు..
గ్రామస్తుల కడుపుమండి కులాలకతీతంగా ఏకమై రాత్రికి రాత్రి ఆ గోడ కూల్చేశారు..  
ఇంకా బయటకు రానివి వందల సంఖ్యలో ఉన్నాయి..ఒక్కొక్కటి బయట పడుతున్నాయి..
దేశంలోని ఎవరి ఆస్తినైనా ' మీదైనా నాదైనా ' ఎటువంటి అడ్డంకులు లేకుండా ఆస్తుల స్వాధీనానికి ' వక్ఫ్ బోర్డ్ కు ' అపరిమితమైన అధికారాలను 1995 వక్ఫ్ చట్ట రూపంలో నాటి కాంగ్రేస్ ప్రభుత్వం ముస్లింస్ కు కానుకగా ఇచ్చింది.. 
ఈ చట్టం గురించి క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
1947 లో భారత్ ..భారత్ పాక్ గా విడిపోయిన తర్వాత వక్ఫ్ చట్టాన్ని 1954 లో పార్లమెంటు ఆమోదించింది..అది షుమారు 41 ఏళ్ళు అమలులో ఉన్న తర్వాత కుట్రపూరితంగా కాంగ్రేస్ ప్రభుత్వం దీన్ని రద్దు చేసి 1995 లో కొత్త వక్ఫ్ చట్టాన్ని పార్లమెంట్ లో  ఆమోదింపచేసింది.. 
ఈ చట్టం ద్వారా వక్ఫ్ బోర్డుకు హిందువుల ఆస్తులు కేవలం ఒక నోటీస్ ద్వారా స్వాధీనం చేసుకునే రాకాసి హక్కులను ముస్లింస్ కు దారాదత్తం చేసింది..
ముస్లిం అనుకూల కాంగ్రేస్ రాబోయే ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి రాననే నమ్మకంతో  2013 లో ఈ చట్టాన్ని మరింత సవరించారు.. వక్ఫ్ బోర్డులకు ఎవరి ఆస్తినైనా లాక్కోవడానికి అపరిమితమైన అధికారాలను ఇచ్చారు..దీనిని ఏ న్యాయస్థానంలో కూడా సవాలు చేయలేని విధంగా చట్ట సవరణ జరిగింది..

2014 మార్చిలో లోక్ సభ ఎన్నికలు ప్రారంభం కావడానికి ముందు కాంగ్రెస్ ఈ చట్టాన్ని ఉపయోగించి ఢిల్లీలోని 123 పురాతత్వ శాఖ ఆధీనంలో ఉన్నటువంటి అత్యంత ప్రధాన ఆస్తులను ఢిల్లీ వక్ఫ్ బోర్డుకు బహుమతిగా ఇచ్చింది..గత 40 ఏళ్లలో సగం డిల్లీని  వక్ఫ్ పేరిట ముస్లింస్ బలవంతంగా  ఆక్రమించుకున్నారని మీకు తెలుసా??
నాటి ముస్లింస్ పాలనలో కంటే గత 40-50 ఏళ్లలో వక్ఫ్ ను అడ్డంపెట్టుకొని హిందువుల ఆస్తులను ఆక్రమించుకున్నది ఎక్కువ..

ఈ చట్టం ఉపయోగించి షుమారు 500 లకు పైగా హిందువుల మోహల్లాళ్లను ఆం ఆద్మీ ప్రభుత్వం కేజ్రీవాల్ వక్ఫ్ కు దారాదత్తం చేసింది..కేజ్రీవాల్ ప్రజాధనం 101 కోట్లను వక్ఫ్ కు బహుమతిగా ఇచ్చాడు కేవలం 2020-21 ఈ ఒక్క సంవత్సరంలోనే 62 కోట్లరూపాయలు దోచిపెట్టాడు..
ఈ నల్ల చట్టం కారణంగా దేశంలో ఇప్పటివరకు వేలాది ఎకరాల హిందువుల భూములు లాక్కున్నారు. 
ఇటీవల తమిళనాడు వక్ఫ్ బోర్డు 1500 సంవత్సరాల పురాతన హిందూ ఆలయంతో సహా తమిళనాడులోని 7 గ్రామాలను వక్ఫ్ ఆస్తులుగా ప్రకటించింది..
సరళంగా చెప్పాలంటే, ముస్లిం దాతృత్వం పేరిట ఆస్తులను క్లెయిమ్ చేయడానికి వక్ఫ్ బోర్డుకు అపరిమితమైన అధికారాలు ఉన్నాయి. కానీ ఇది ఎలా సాధ్యమైందో అర్థం చేసుకోవడానికి, మనం చరిత్ర పుటలను తిప్పాలి.
వాస్తవానికి, పాకిస్తాన్ నుండి విభజన తరువాత భారతదేశానికి వచ్చిన హిందువులను, పాకిస్తాన్ లోని వారి ఆస్తులను ముస్లింలు మరియు పాకిస్తాన్ ప్రభుత్వం ఆక్రమించాయి. కానీ భారత ప్రభుత్వం భారతదేశం నుండి పాకిస్తాన్ కు వెళ్ళిన ముస్లింల భూమిని వక్ఫ్ బోర్డులకు ఇచ్చింది. ఆ తర్వాత 1954లో వక్ఫ్ బోర్డు చట్టం తీసుకొచ్చారు. కానీ, 1995లో వక్ఫ్ బోర్డు చట్టాన్ని కొత్తగా తీసుకురావడం  ద్వారా వక్ఫ్ బోర్డులకు భూమి సేకరణకు అపరిమితమైన హక్కులు కల్పించారు. ఆ తరువాత వక్ఫ్ బోర్డు ఆస్తులు పెరిగాయి.
వక్ఫ్ మేనేజ్ మెంట్ సిస్టమ్ ఆఫ్ ఇండియా డేటా ప్రకారం, ప్రస్తుతం 8,54,509 ఆస్తులు వక్ఫ్ బోర్డుల వద్ద ఉన్నాయి, ఇవి ఎనిమిది లక్షల ఎకరాలకు పైగా భూమిలో విస్తరించి ఉన్నాయి. ఆర్మీ, రైల్వేల తర్వాత ఎక్కువ భూభాగం వక్ఫ్ బోర్డుల ఆధీనంలోనే ఉందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.
2009లో వక్ఫ్ బోర్డు ఆస్తులు నాలుగు లక్షల ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి. ఇది ఇప్పుడు రెట్టింపు కంటే ఎక్కువ. అయితే దేశంలో భూమి మునుపటి మాదిరిగానే ఉంది. మరి వక్ఫ్ బోర్డు భూములు ఎలా పెరుగుతున్నాయి? దేశంలో ఎక్కడ స్మశానవాటికకు సరిహద్దు గోడ దొరికినా, దాని చుట్టూ ఉన్న భూమిని వక్ఫ్ బోర్డు తన ఆస్తిగా పరిగణిస్తుంది. 
అదేవిధంగా, అక్రమ మందిరాలు మరియు మసీదులను క్రమంగా వక్ఫ్ బోర్డు వారి ఆస్తిగా ప్రకటించింది. సరళమైన భాషలో చెప్పాలంటే ఇది ప్రజల యొక్క ఆస్తుల ఆక్రమణ అని అంటాము..గమ్మత్తుగా ఈ ఆక్రమణలు చేయడానికి వక్ఫ్ బోర్డుకు సర్వ హక్కులూ ఉన్నాయి..
వక్ఫ్ చట్టం, 1995 లోని సెక్షన్ 3 ప్రకారం, ఆ భూమి ముస్లింకు చెందినదని వక్ఫ్ భావిస్తే అది వక్ఫ్ ఆస్తి. వక్ఫ్ గురించి ఆలోచించడం మాత్రమే సరిపోతుందని, దీనికి వక్ఫ్ బోర్డుకు ఎటువంటి రుజువులు అవసరం లేదని ఇక్కడ గమనించాలి. మీ ఆస్తి మీది కాదని, వక్ఫ్ బోర్డుకు చెందినదని వక్ఫ్ భావిస్తే , అప్పుడు మీరు కోర్టుకు కూడా వెళ్లలేరు. 
మీరు వక్ఫ్ ట్రిబ్యునల్ కోర్టును ఆశ్రయించవచ్చు.
వక్ఫ్ చట్టంలోని సెక్షన్ 85 ప్రకారం అది మీ సొంత భూమి అని వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్ ను సంతృప్తి పరచలేకపోతే, ఆ భూమిని ఖాళీ చేయమని మిమ్మల్ని ఆదేశిస్తారు. ట్రైబ్యునల్ నిర్ణయమే తుది నిర్ణయం. వక్ఫ్ ట్రిబ్యునల్ నిర్ణయాన్ని ఏ కోర్టు, సుప్రీంకోర్టు కూడా మార్చలేవు.
వక్ఫ్ చట్టంలోని సెక్షన్ 40 ప్రకారం, వక్ఫ్ బోర్డు ఒక వ్యక్తి భూమిపై దావా వేసినప్పుడు, భూమిపై హక్కును నిరూపించడం వక్ఫ్ బోర్డు బాధ్యత కాదు, కానీ భూమి యొక్క నిజమైన యజమాని తన భూమి యాజమాన్యాన్ని నిరూపించాలి.

అంటే, వక్ఫ్ బోర్డు ఏదైనా భూమిని క్లెయిమ్ చేస్తే, అప్పుడు వక్ఫ్ బోర్డు భూమికి సంపూర్ణ యజమానిగా మారిందని అర్థం చేసుకోండి.
భారతదేశం వంటి లౌకిక దేశంలో వక్ఫ్ చట్టం వంటి మతపరమైన చట్టం ఎలా వర్తిస్తుంది? హిందువులు, క్రైస్తవులు, సిక్కులకు అలాంటి చట్టం ఎందుకు లేదు? ముస్లింలకు మాత్రమే ఎందుకు? 1991 లో ప్రార్థనా స్థలాల చట్టం చేయబడింది, ఇది దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు ఉన్న మతపరమైన ప్రదేశాలను యథాతథంగా ఉంచుతుందని చెబుతుంది. 
అదే సమయంలో, 1995 లో, వక్ఫ్ చట్టం అమలులోకి వచ్చింది, ఇది దేశవ్యాప్తంగా వక్ఫ్ బోర్డుకు ఏదైనా లేదా ఎవరి ఆస్తిపైనైనా యాజమాన్య హక్కులను పొందే హక్కును ఇస్తుంది..
అత్యంత దుర్మార్గ విషయం ఏంటంటే బాధిత పక్షం దీనికి వ్యతిరేకంగా దేశంలోని ఏ న్యాయస్థానంలో అప్పీల్ కూడా చేయలేరు.
ఒక లౌకిక దేశంలో ఇటువంటి చట్టం ఉందని వినడం విచిత్రంగా ఉందని నమ్మశక్యంగా లేదని మాతో హిందువులే వాదనకు దిగుతారు.. 90% హిందువులకు ఈ చట్టం గురించి  తెలియదు..తన ఆస్తిని వక్ఫ్ స్వాధీనం చేసుకుంటే ఏం చేయాలో కూడా తెలియదు..
అసలు వక్ఫ్ తన ఆస్తిని స్వాధీనం చేసుకుందని వక్ఫ్ వాడు బోర్డ్ పెట్టిందాకా కూడా తెలియదు.. 
విచిత్రంగా ఏ ముస్లిం దేశంలో కూడా అలాంటి దుర్మార్గ చట్టమూ లేదూ ఇలాంటి చర్యలూ తీసుకున్న దాఖలాలు లేవు..టర్కీ, లిబియా, ఈజిప్ట్, సూడాన్, లెబనాన్, సిరియా, జోర్డాన్, ఇరాక్ వంటి ముస్లిం దేశాలలో వక్ఫ్ బోర్డు లేదా వక్ఫ్ చట్టం లేదు.. 
భారతదేశంలో కూడా వక్ఫ్ చట్టానికి చోటు ఉండకూడదు..వక్ఫ్ పేరుతో మన హిందూ దేవీదేవతల ఆస్తులూ..మన పురాతన సత్రాల ఆస్తులు..మన పూర్వీకుల ఆస్తులు కాజేస్తున్న ఈ రాకాసి వక్ఫ్ చట్టాన్ని వెంటనే రద్దుచేసి మన హిందువుల ఆస్తులు కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము.. అవ్వారు.శ్రీనివాసరావు గారి వాల్ నుండి

No comments:

Post a Comment