భగవాన్ రమణ మహర్షి నిత్య పారాయణంఓం నమో భగవతే శ్రీ రమణాయ
అధ్యాయము 22
ఆణిముత్యాలు 7 - ఆత్మ
భగవాన్ ఇప్పటివరకు సర్వం బ్రహ్మమే లేక ఆత్మయే తప్ప మరి ఇతరమంటూ ఏమీ లేదని చెప్పారు . ఐతే కొందరి భక్తులు ఆత్మను గురించి పలురకములైన ప్రశ్నలను వేసి అసలు ఆత్మ అంటే ఏమిటో దాని రూపమేమిటో అది ఎలా సాక్షాత్కరించుకోవాలో అనే సందేహాలు వెలిబుచ్చారు . భగవాన్ వాటికి సమాధానాలు ఇచ్చారు . భగవాన్ చెప్పిన సమాధానములలో కొన్ని ఆణిముత్యాలను ఏరి ఇక్కడ తెలియపరచుచున్నాము .
భగవాన్ ఎప్పుడూ అంటూ ఉండేవారు *ఆత్మ అంటేనే నేను అని . కాని పైకి కనిపించే వ్యక్తిగతం మటుకుకాదని . పైకి కన్పించే ఈ వ్యక్తిగత అహానికి ఉనికిలేదు . దీనికి మనస్సు కల్పిస్తుంది . కావున భగవాన్ అసలైన నేనుని తెలుసుకుని వ్యక్తిగత అహాన్ని వదలమన్నారు *. భగవానుని కొందరు ఇట్లు ప్రశ్నించేవారు , “ ఎరుక ఉండవలెనని అన్నారు కదా ! ఆ ఎరుకను ఎలా పొందాలని ? " దానికి భగవాన్ “ *నీకు మరొక పేరే ఎరుక అని దానిని క్రొత్తగా సంపాదించుకోవాలని ఉండదు . ఆత్మ కానుటవంటి విషయాలను అనగా అనాత్మయైన వాటిని ఎరుకను మరవాలని ఎప్పుడైతే వాటి గురించి ఎరుకను విడిచినచో మిగిలినది స్వచ్ఛమైన ఎరుకే అదే నీవు మరియు అదే ఆత్మ* .
" భగవాన్ ఎప్పుడూ ఇలా చెప్పేవారు , ఆత్మ ఎప్పుడూ ఉంటూనే ఉంది అని అది ఒక క్రొత్త పదార్ధము వలె జనులు చూడాలని కాంక్షిస్తారు . అది శాశ్వతముగా అందరిలోను ఉన్నది . కాని కొందరు *అదేదో మెరిసే కాంతి అని మరి ఇంకో విధముగా చూడాలని కోరుతూ ఉంటారు . ఆత్మ వెలుగు కాదు , చీకటి కాదు . నిజానికి దానిని నిర్వచించలేము* .
కొందరు భగవానుని ఇట్లు ప్రశ్నించేవారు , “ ఆత్మ సాక్షాత్కారమైన వారు చూసేది ఏమిటని ? ” దానికి భగవాన్ ఈ విధముగా చెప్పారు . “ *ఆత్మ ఎప్పుడూ సాక్షాత్కారమై ఉండేదే . కావున ఆత్మ సాక్షాత్కారము పొందడమంటే క్రొత్తగా దేనినో చూడటము అని అర్థముకాదు . నిజము కానిదాన్ని నిజమనుకోవటం వదలాలి . అప్పుడే ఆత్మగానే గుర్తిస్తాము . అసలు చూడటమంటూ ఏమీ ఉండదు . దృశ్యానికి , దృష్టికి అతీతమైనది *.
” *భగవాన్ కొన్ని సందర్భాలలో మౌనమే ఆత్మ అని కూడా అంటూ ఉండేవారు* . ఎందుకంటే ఆత్మ నిమగ్నులైన వారు అటువంటి వారికి భావాలిక ఉండవు . ఒక్క మౌనమే ఉండును . ఆ మౌనము అహంకార రహితమై అతీతమైన స్థితిలో ఉండును .
మరికొందరు భక్తులు “ జీవరాసులు ఎన్నో కనబడుతుండగా ఒకే ఒక ఆత్మ ఉన్నదని ఎలా అనగలం " అని ప్రశ్నించేవారు . దానికి భగవాన్ నేను *ఈ దేహాన్ని అనే భావాన్ని అంగీకరిస్తే ఆత్మలు అనేకం . ఈ భావం మాయమైపోయే స్థితిలో ఉండేదే ఆత్మ* . భగవాన్ మరియొక విషయాన్ని స్పష్టం చేశారు , మెలకువలోకాని స్వప్నములో కాని లేదా సుషుప్తిలోగాని జరిగేవాటికి ఎటువంటి ప్రభావం ఉండదని . ఈ మూడు స్థితుల్లో ఆత్మగానే ఉంటారని చెప్పారు . ఈ విషయ .0 సాధకుడు తెలిసికొనినచో జాగ్రత్ , స్వప్న మరియు సుషుప్తిలగు ఈ అవస్థలు ఎటువంటి ఇబ్బంది పెట్టవన్నారు . ఉదాహరణకు తెరపై చిత్రాలు చూపిస్తారు . కాని ఆ తెరకి చూపించే చిత్రాలు అంటుకోవు . తెరమీద చిత్రాలలో సముద్ర కెరటాలు పొంగుతున్నట్లు చెట్లు తగులబడుతున్నట్లు కనబడినప్పటికి తెరకు ఏమీ అంటుకోవు . అనగా తెరని ఏమీ చేయలేవు . కొందరు నేను స్వప్నము చూశాను అని , నేను బాగా నిద్రపోయానని మరియు నేను మేల్కొని ఉన్నానని అనినప్పుడు ఆ అనే వ్యక్తి ఆ మూడు స్థితులలో ఉన్నట్లే . కావున ఈ మూడు అవస్థలు వచ్చిపోయినను అతను మాత్రము ఎప్పుడు ఉంటాడు . *ఈ మూడు అవస్థలు ఆత్మకి పట్టవు . ఉన్నదల్లా ఒకే ఒక అవస్థ అది చైతన్య స్థితి లేక ఎరుక లేక ఉనికి . అన్ని అవస్థలలోను ఉండే ఆ “ నేను ” ఆ ఉనికే సత్యం* . చైతన్యానికి మెలకువను , నిద్రను , కలను జోడించగా వచ్చే మూడు స్థితులు జాగ్రత్ , సుషుప్తి స్వప్నావస్థలు . భగవాన్ చెప్పిన ఈ అవస్థలను గురించి విన్న తరువాత కొందరిట్లు ప్రశ్నించారు . ఈ మూడు అవస్థలు ఆత్మ అనే తెర మీదకు ఎందుకు వస్తాయని . దానికి భగవాన్ ఇట్లు జవాబు చెప్పినారు . “ *అసలు ఈ ప్రశ్న వేసిందెవరు ? ఈ అవస్థలు వస్తూపోతూ ఉంటాయని ఆత్మ అంటుందా ? ద్రజ్జీ అంటున్నాడు . అసలు మనస్సు ఎలా65 తయారవుతుందంటే ద్రష్ట , దృశ్యము కలిస్తేనే మనస్సవుతుంది . నిజానికి మన మనస్సనేది ఏదైనా ఉన్నదా అని గమనించు . మనస్సు ఆత్మలో లీనమైనప్పుడు ద్రష్టలేడు , దృశ్యములేదు . ఉండేది మాత్రం ఆత్మే* .
భగవాన్ మరియొక రహస్యము కూడా చెప్పారు . ఆత్మకి భిన్నంగా మనస్సనేది ఉండదని . ఆత్మ మనస్సు లేకుండా ఉంటుంది . కాని ఆత్మ లేకుండా మనస్సు ఉండలేదు . *అంతర్ముఖమైన మనస్సే ఆత్మ . అదే మనస్సు బహిర్ముఖమైతే అహము మరియు ప్రపంచమవుతుంది *. పరిపూర్ణ ఆనందమే బ్రహ్మమని పరిపూర్ణ శాంతి ఆత్మ అని ఆ ఆనందమే ఆత్మ యొక్క స్వరూపమని భగవాన్ చెప్పారు . కావున అటువంటి సత్యాన్ని తెలుసుకుని ఆత్మలో ఉంటూ ఆనందాన్ని పొందమన్నారు . *అసలు సంతోషమనేది సహజముగా ప్రతి జీవి లోపలే ఉందని ఆ సంతోషము బాహ్య పరిస్థితుల వల్ల పొందేదికాదని చెప్పారు . భగవాన్* . ఉదాహరణకు మనము మంచి నిద్రలో ఉన్నప్పుడు అతను ఒక దేహమని జ్ఞాపకముకాని , సిరిసంపదలతో ఉన్నాడనిగాని నిద్రలో తెలియదు . కాని ఎంతో సంతోషంగా ఉంటాడు . కావున ఎవరైనా తమ ఆనందము బైట కనిపించే సంపదల వల్ల అనుకుంటే అది తప్పే .
భగవంతుడు ఆత్మ హృదయం చైతన్య స్థావరం అన్నీ ఒక్కటే . హృదయమే కేంద్రం . అది భౌతికం కాదు . ఆ హృదయము లేకపోతే ఏదీ లేదు . అక్కడి నుండే భావాలు ఉదయించి మళ్ళీ దానిపై ఆధారపడి అందులోనే లయమయి పోతాయి . మనస్సు ఈ భావాల సమూహం . ఆ భావాలే ప్రపంచానికి రూపు కల్పిస్తాయి .
భగవాన్ చెప్పిన మాటలను జ్ఞప్తికి ఉంచుకొని , మనకి ఆత్మ అంటే ఏమిటో ఎరుక కలుగవలెనని భగవాన్ని వేడుకుంటూ శరణువేడుదాం .
రమణశ్శరణాగతి అరుణాచల శివ.
No comments:
Post a Comment