Thursday, January 26, 2023

ఓ కొత్తరకం ఆసరా ➖➖➖✍️

 31.5.     1A.         250123-6.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


                *ఓ కొత్తరకం ఆసరా
                    ➖➖➖✍️

                                  
అదో గేటెడ్ కమ్యూనిటీ.   లోన అన్నీ రిటైర్మెంట్ హోమ్స్...
ఉదయమే ఐదున్నర కల్లా తమ ఇంటి నుండి ఉదయపు వ్యాహ్యాళికి బయలుదేరి రెండిళ్ల అవతల ఇంట్లో ఉంటున్న వాసుదేవరావు గారిని కలిసి, ఒక గంట నడిచి రావడం   రామారావు గారి దినచర్య.

ఇప్పుడు ఇటువంటి హోమ్స్ ఎక్కువ వచ్చాయి..   వివిధ కారణాలతో పిల్లలు దూరంగా ఉండి, పని మనుషులు అందు బాటులో లేక, ఉన్నా భద్రత లేక, ఒంటరిగా అవస్థ పడలేక,  చాలామంది పెద్దలు ఇప్పుడు రిటైర్మెంట్ హోంలలోకి మారుతున్నారు.

రిటైర్మెంట్ హోమ్ లు   అన్నీ పక్కపక్కనే   కాటేజెస్ లా ఉంటాయి...    ఇక్కడ స్వేచ్ఛగా, గౌరవంగా తమింట్లో తాము వుంటూనే అన్ని  సౌకర్యాలు పొందొచ్చు. 

ఇక్కడ అందరివీ సొంత ఇళ్లే......!  సొంత ఇల్లు అయినప్పుడు ఎక్కడున్నా ఒక్కటే...... పైగా భద్రత. సకల సౌకర్యాలు అందించే బాధ్యత కొన్ని సంస్థలు తీసుకుంటాయి.*

*సకల సౌకర్యాలతో.. వృద్ధ శ్రీమంతుల ఇళ్ళు అవి.        NRI పిల్లలు తమ తల్లిదండ్రులకు కొనిపెట్టిన ఇళ్ళు కూడా...
***************

*రామారావు గారు వెళ్ళేసరికి ఇంటిముందు వాసుదేవరావు గారు లేరు... 
నిద్ర లేవలేదేమో అనుకుని.. సర్లే ఎందుకు డిస్టర్బ్ చేయడం అని ముందుకు వెళ్లిపోయారు.   అక్కడ ఇంకో స్నేహితుడు కలవడంతో మాట్లాడుకుంటూ ముందుకు వెళ్లిపోయారు....

*గంట తరువాత తిరిగి వస్తూ చూసేటప్పటికి అప్పటికీ కూడా వాసుదేవరావు గారి ఇంటి తలుపులు తెరిచి లేవు... మళ్లీ బెల్ కొట్టినా  ఎవరూ తలుపు తీయలేదు...* 
‘తాళం వేసుకుని బయటికి వెళ్లినా తెలీదు ఈ కొత్త పద్ధతులతో’ అనుకుని తన ఇంటికి వెళ్లిపోయారు.*

*ఆ సాయంత్రం వరకూ కూడా కనపడకపోవడంతో   మర్నాడు కమ్యూనిటీ ఆఫీస్ కి వెళ్లి అడిగారు.. వాసుదేవరావు గారి ఇంటి నెంబర్ చెప్పి. 

వాళ్ళు వెంటనే.   "సర్! వాళ్ళు వెళ్లిపోయారు కదా! ....నిన్ననే.... అని... మీరు రామారావు గారా? మీకిమ్మని ఈ కవర్ ఇచ్చారు" అన్నారు.

*ఆయన..., అదేంటి..?  అనుకుంటూ.. కొంచెం ఆతృతగా అక్కడే కూర్చుని.. కవర్ ఓపెన్ చేసి చదవడం మొదలెట్టారు...*
**********

*రామా...!
*నువ్వు మా గురించి  ఆందోళన పడతావని తెలుసు... అందుకే ఈ ఉత్తరం రాస్తున్నాను...
*మేమిద్దరం బాగున్నాము కంగారు పడకు... సావధానంగా చదువు...

*నేను ఒక నెల క్రితం ఒక న్యూస్ పేపర్ లో ఒక మూల చిన్న ప్రకటన చూశాను... విచిత్రం అనిపించింది... వాళ్లు ఇద్దరు వయసైన భార్యాభర్తలు తమకి తల్లిదండ్రులుగా ఉండాలని... 
ఏ బాదరబందీ లేని వాళ్ళు, ఆసక్తి ఉన్నవాళ్ళు, ఆరోగ్యంగా ఉన్న భార్యాభర్తలు  కావాలని... కింద నెంబర్ ఇచ్చి ఫోన్ చేయమని,

*వెంటనే ఆసక్తిగా ఫోన్ చేసాను...
*అతను ‘ఆఫీస్ లో ఉన్నాను, తనే ఫోన్ చేస్తాను’ అన్నాడు. 
నేను మరచి పోయాను... శనివారం అతనికి సెలవు రోజు. అతనే కాల్ చేసాడు నాకు.. 
అతని పేరు గోకుల కృష్ణ అట...
*సాఫ్ట్ వేర్ ఇంజినీర్..   భార్యా భర్తలు ఉద్యోగస్తులు...ఒక పాప... తన వివరాలు చెప్పి  నా వివరాలు అడిగాడు... 
నేను నా గురించి చెప్పాను...... అంతా విన్నాడు..... ఒకసారి వచ్చి కలిసాడు... నన్ను, రాజేశ్వరి ని... 

అతని ద్వారా తెలిసింది ఏమంటే 
ఆ గోకుల కృష్ణ, అతని భార్య మాధురి కూడా అనాధాశ్రమంలో పెరిగారట... వాళ్ళకి ఒకరంటే ఒకరికి ఇష్టమంట...
*వాళ్ళు చదువుకుని ఉద్యాగాలు వచ్చేకే ఇద్దరూ పెళ్లి చేసుకున్నారట....... ఒక సంవత్సరం పాప ఉందట...
*పాపని చూసుకోడానికి ఒక మనిషిని పెట్టుకున్నారట...

*అయితే ఎవరైనా పెద్ద వాళ్ళు ఇంట్లో వుండి కనిపెట్టుకుని ఉంటే బాగుంటుందని అనిపించిందిట. అతని భార్య ఆలోచనట ఇది... ‘మనిద్దరికీ ఎవరూ లేరు. ఎవరైనా పిల్లలు లేని పెద్దవాళ్ళని మనం తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే మనకి అండ దండగా ఉంటుంది, వాళ్ళకీ మన సపోర్ట్ ఉంటుంది. మన పాపకి తాతా బామ్మల్లా ఉంటారు.’ అని ఈ ఐడియా మాధురి ఇచ్చిందట.

*అతనికి నచ్చి ఈ ప్రకటన ఇచ్చాడట..! 

‘కానీ మాకు పిల్లలున్నారు కదా..... అని సందేహం వ్యక్త పరిచాను’ మేము మా పరిస్థితి చెప్పాము.

*మా పిల్లలు ఒప్పుకోరేమో గొడవలవుతాయేమో అని భయపడ్డాడు. కానీ మేమిద్దరం నచ్చామని అన్నాడు. అది అతని కళ్ళలో కనపడింది.

*మేమిద్దరం ఎడ్యుకేటెడ్, జాబ్స్ చేశాం. మా ప్రాపకంలో వాళ్ళ పాప చక్కగా పెరుగుతుంది,’ అన్న నమ్మకం కలిగింది అన్నాడు. 

నాకూ అతని పద్ధతి, అతని ఆలోచనా తీరునచ్చింది. ఇక్కడ  మేము ప్రశాంతంగా జీవిస్తున్నాము. ఒంటరి తనం లేదు దేనికి లోటు లేదు... కానీ మా బ్రతుక్కి  కూడా ఒక అర్ధం ఉండాలనిపించింది... నేను రాజేశ్వరితో మాట్లాడాను...
*తానూ చదువుకుంది కాబట్టి  తనూ ఆలోచించింది.... మేమిద్దరం ఏమనుకున్నాం అంటే... మా పిల్లలా ఇక్కడికి రారు..... మాకు వాళ్ళ దగ్గరికి అన్నేసి గంటలు కూర్చుని విమాన ప్రయాణం చేసే ఓపిక లేదు........ ఇలా ఉంటే బాగుంటుందని అనిపించింది...

*ఒకరోజు అతను తన భార్యను తీసుకుని వచ్చాడు... మీ అందరితో నా స్నేహితుడు కొడుకు కోడలు అని చెప్పాను నీకు గుర్తుందో లేదో...

*ఆ అమ్మాయి కూడా మంచి పిల్ల..... మాతో మనసు విప్పి మాట్లాడింది. తనకు ఒక కుటుంబం కావాలని...... ఇంట్లో పెద్ద వాళ్లు ఉంటే బాగుంటుందని వాళ్ళకి అనిపించిందట.... వాళ్ళ పాప అన్నీ అంటే మన సభ్యత, సంస్కృతి  నేర్చుకునే అవకాశం ఉంటుందని...

*ఒక నెల రోజులుగా మేము ఒకరికొకరు బాగా తెలుసుకున్నాకా మా నలుగురికీ ఒకరి మీద ఒకరికి నమ్మకం ఏర్పడ్డాకా... ఒక బాండింగ్ ఏర్పడ్డాకా... నేను మా పిల్లలతో మాట్లాడాను.

*వాళ్ళు షాక్ అయ్యారు... మాట్లాడారు. పోట్లాడారు. ఇదేంటి అన్నారు...వద్దు అన్నారు.. మీ డబ్బు వాళ్ళు చూసి వచ్చారేమో అన్నారు...
*మేము చెప్పాo వివరంగా. మా పైసా కూడా వాళ్ళు వద్దన్నారని, గోకుల్ వాళ్ళ మొత్తం వివరాలు ఇచ్చాను...

*వాళ్ళకి మేము.. మాకు వాళ్ళు ఆసరాగా ఉందామని నిర్ణయం తీసుకున్నామని... మాకు ఇప్పుడు కావలసినవి హంగులతో ఉన్న ఇల్లు, ఫర్నిచర్, సౌకర్యాలు కాదు...*
*కొంచెం ప్రేమా ఆప్యాయతలు ఇచ్చే మనుషులు కావాలని...

*గోకుల్, మాధురి ఇద్దరూ కూడా మీ బట్టలు తెచ్చుకోవాలంటే తెచ్చుకోండి... అవి కూడా తీసుకురాకపోయినా పర్వాలేదు అన్నారు...

*వాళ్ళది మూడు బెడ్ రూముల ఫ్లాట్... గేటెడ్ కమ్యూనిటీ లో ఉంది...పొందికైన ఇల్లు...  రోజూ పొద్దున ఒక నానీ వచ్చి సాయంత్రం వాళ్ళొచ్చేవరకూ పాపని చూసుకుంటుంది... మేము  ఆ పాపకి తాతా అమ్మమ్మ లానో తాతా బామ్మలాగో ప్రేమని ఇవ్వాలి... మాకూ శ్రమ లేదు...

*మేము పిల్లలని ఒప్పించాము...
*చూద్దాం..... మేము అడ్జస్ట్ అవుతామనే నమ్మకం ఉంది.... అందుకని ఇక్కడ ఖాళీ చేస్తున్నామని లెటర్ ఇచ్చాం.

*ఈ మా ఇల్లు రెంట్ కి ఇచ్చేట్టు మాట్లాడాము... మా బట్టలు రెండు సూట్ కేసుల్లో  సర్దుకుని అతనితో కార్ లో పంపించాము.

*మిగిలిన ఇంట్లోని ఫర్నిచర్ అంతా అలానే ఉంచాము...
*అందరికీ చెప్పకుండా వెళ్ళాము కావాలనే... ఇవన్నీ అందరికీ తెలియడం ఎందుకని...

*వాళ్ళు కూడా వాళ్ళ సర్కిల్ లో 
వాళ్ళ పేరెంట్స్ గానే చెప్తామన్నారు. మమ్మల్ని! "మా అమ్మా నాన్నగారు అంటే"... "మా అమ్మా నాన్నగారు"  అని గోకుల్ మాధురి పొట్లాడు కుంటుంటే నిజంగా మాకు ముచ్చటేసిందిరా రామా...!!*

*నిన్ను, రామలక్ష్మి గారిని తరువాత వచ్చి కలుస్తాము...
*మీరూ మా ఇంటికి వస్తూ ఉండొచ్చు... మనకి ఫోన్ లు ఎలానూ ఉన్నాయి... రామా... ఇద్దరం ఉండలేకపోతున్నాం.. ఇది అందరి సమస్య..అనుకో... చూద్దాం ఈ దారి కొత్తగా ఉన్నా దేవుడే చూపించాడేమో...

*ఈ వయసులో మేము వాళ్ళకి ఉపయోగపడతామో... మాకు వాళ్ళు ఉపయోగపడతారో కాలమే నిర్ణయిస్తుంది... నువ్వే నాకు దగ్గర అయ్యావు కాబట్టి నీకు చెప్పడం నా బాధ్యత అనిపించింది... ఉంటాను..
                           -వాసుదేవరావు.... అని ఉంది...
************

*రామారావు గారు లేచి,  ‘వాళ్ళు ఈ వయసులో ఏది కావాలని వెళ్లారో... అది వాళ్ళకి పుష్కలంగా దొరకాలి దేవుడా..’ అని,  మనసులో అనుకుని .. ఆ ఉత్తరం జేబులో పెట్టుకుని,  ముందుకు కదిలారు...✍️
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

No comments:

Post a Comment