Tuesday, January 10, 2023

****రమణ మార్గము, మనోలయం - మనోనాశనం

 [1/10, 07:43] +91 73963 92086: *🧘‍♂️86 - శ్రీ రమణ మార్గము🧘‍♀️*
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైతచైతన్యజాగృతి
🕉🌞🌏🌙🌟🚩

*మనోలయం - మనోనాశనం*

“ఈ 'నేను' అనేది ఎక్కడ ఉద్భవిస్తున్నదో విచారించే తరుణంలో మనసు చలనాలు ఆగిపోయిన స్థితి ఒకటి సంభవిస్తుంటుంది. కానీ అటు తర్వాత ముందుకు సాగలేకుండా ఉన్నాను. ఏ రకమైన ఆలోచనలేని ఆ ప్రత్యేక స్థితిలో ఒక 'శూన్యత’ నన్ను ఆవరిస్తుంది. 

నేనేదో చిన్న వెలుతురు చుక్క అయిపోయినట్లు, నాకు దేహమే లేనట్లూ ఒక వింత అనుభూతి కలుగుతుంది. దేనినీ గుర్తించలేను. నా శరీరమూ, రూపమూ గుర్తులేకుండా పోతుంది. ఇటువంటి పరిస్థితి సుమారు ఒక అరగంట సేపు కొనసాగుతుంది; ఇది మనసుకు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. మోక్షమనండి, కైవల్యం, శాశ్వతానందం, ఏదైనా అనండి - ఇవన్నీ సాధించడానికి నేనిప్పుడు చేస్తున్న ఈ సాధనే కొనసాగిస్తూ, కేవలం అరగంటసేపు కాకుండా, గంటల తరబడి లేక రోజులు నెలలు ఇదే చేస్తూ ఉంటే చాలంటారా?" అని ఒక సాధకుడు అరుణాచల రమణుల వారిని అడిగాడు.

అందుకు సమాధానంగా శ్రీ రమణులు “ఇది మోక్షం కాదు. ఈ స్థితిని మనోలయమంటారు”. అంటే ఆలోచన ఆగినందువల్ల ఏర్పడే నిశ్శబ్దం, కదలికలేని స్థితి.

అసలు ఈ మనోలయమంటే ఏమిటి? మనోలయమంటే ఏకాగ్రత; ఆలోచనా తరంగాలను తాత్కాలికంగా నిరోధించడమన్నమాట. ఏకాగ్రత విరమించగానే, ఆలోచనలు - కొత్తవి, పాతవి, కోకొల్లలుగా యధావిధిగా మనసులోకి తోసుకు వచ్చేస్తాయి. ఈ విధంగా మనస్సును జోకొట్టి నిద్రపుచ్చిన స్థితి ఓ వెయ్యేళ్ళు సాగినప్పటికీ, ఆలోచనను శాశ్వతంగా నిర్మూలించడం జరగదు; ఆలోచనల శాశ్వత నిర్మూలన మాత్రమే జనన మరణాల చక్రం నుండి విముక్తి ప్రసాదించ గలుగుతుంది

. అందుచేత సాధకుడు నిత్య జాగరూకతతో ‘ఈ అనుభవం తనలో ఎవరికి కలుగుతున్నది?' 'ఎవరు ఈ రకమైన సుఖాన్ని పొందుతున్నారు? అనే విషయాన్ని నిశితంగా పరిశీలిస్తూ ఉండాలి. ఈ విచారణ చేయకపోతే అతడొక దీర్ఘమైన సమాధి స్థితిలో యోగనిద్ర వంటి దానిలో మునిగిపోతాడు. చాలామంది సాధకులు ఇలాంటి పొరపాటు చేసి ఇదే కైవల్యమని, మోక్షమని భ్రమపడుతుంటారు.

ఇందుకు సంబంధించిన ఓ చిన్న కథ చెప్తాను విను. ఒక యోగి గంగ ఒడ్డున కూచొని చాలా ఏళ్ళపాటు తపస్సు చేస్తూ ఉండిపోయాడట. ఏకాగ్రతలో చాలా ఉన్నత స్థాయికి చేరిన అనంతరం, అదే స్థితిలో దీర్ఘకాలం మనసును నిలపగలిగి ఉండడమే మోక్షమని భావించి, ఆ సాధనే చేస్తూ ఉండేవాడు. 

ఒకనాడు ఈ విధమైన ఏకాగ్రతలో పూర్తిగా మునిగిపోకముందు, దాహంగా ఉన్నందువల్ల గంగానది నుండి కాసిని మంచి నీళ్ళు తెచ్చిపెట్టమని శిష్యుడికి చెప్పాడు. కానీ ఈ శిష్యుడు ఆ నీరు తెచ్చేలోగా ఆ తపస్వి యోగ నిద్రలోకి వెళ్ళిపోయాడు. ఈసారి ఆ నిద్రాస్థితి ఏళ్ళ తరబడి అలాగే ఉండిపోయింది. ఈ నిద్రానుభవం నుండి యోగి చాలాకాలం తర్వాత మేల్కొన్నాడు. కానీ మేల్కొన్న మరుక్షణమే “మంచినీళ్ళు, మంచినీళ్ళు" అని కేకపెట్టాడు. ఏళ్ళూ వూళ్ళూ గడిచిపోయిన కారణంగా అక్కడ శిష్యుడూ లేడు. ఆపాటికి ఆ గంగా మహానదే ఎంతో దూరంగా ప్రవహిస్తోందిట!

యోగనిద్రలోకి జారుకునే ముందు అతడి ఆలోచనల్లోకెల్లా ప్రధానమైన 'మంచి నీటి ఆలోచన' మనస్సు పైపొరల్లోకి వచ్చింది. ఎంతటి తీవ్రమైన ఏకాగ్రతను సాధించి నప్పటికీ, ఎంతకాలంపాటు దానిని నిలపగలిగినప్పటికీ, ఆ ఆలోచన మనసు అంతరాంతరాళాల్లోకి అణగతొక్కబడిందే కానీ నిర్మూలనం కాలేదు. తీరా నిద్ర నుండి మేల్కొన గానే మనసు పైశ్రేణిలోని ఆలోచనల కుప్ప నుండి ఈ ‘మంచినీటి ఆలోచన’ వరద నీటిలాగా కట్టలు తెంచుకుని ముందుకు ఉరికింది.

యోగనిద్రకు ఉపక్రమించక ముందు, తాత్కాలికంగా కలిగిన ఈ 'మంచినీటి’ ఆలోచనే నిర్మూలనం కాలేదంటే, ఇక చాలాకాలంగా పాతుకుపోయిన ఆలోచనల గతేమిటో ఆలోచించు. సమయం వచ్చినప్పుడు ఈ తలపులన్నీ పైకినెట్టుకు వస్తూనే ఉంటాయి. ఆలోచన అనేది సమూలంగా తుడిచిపెట్టుకుపోతేనే మోక్షము అని అంటుంటే, ఈ యోగి విముక్తుడని ఎలా అనగలం?

తాత్కాలికంగా ఆలోచనలు అణగతొక్కి మనసును కదలకుండా ఉంచగలిగే మనోలయానికీ, తలపులను సంపూర్తిగా నిర్మూలించే మనోనాశనానికీ, వుండే భేదాన్ని సాధకులు సామాన్యంగా గ్రహించరు. తలపులను అంతంచేసే మనోలయాన్ని సాధించి వెయ్యేళ్ళపాటు ఆలోచనను అణగార్చినా, ఆ మనోలయం అంతమైన మరుక్షణాన, ఆ ఆలోచన మళ్ళీ పొడసూపుతుంది. కాబట్టి ఈ తాత్కాలిక నిరోధంతో సాధకుడు సంతృప్తిపడరాదు.

ఇలాంటి 'ప్రశాంతత' నెలకొన్నప్పుడు, చైతన్యాన్ని తిరిగి మేల్కొల్పి, ఈ ప్రశాంతత అనుభవిస్తున్నది ఎవరు అనేది జాగ్రత్తగా గమనించాలి. నిజానికి అన్నిటికన్నా సులభ మైనది, సూటి అయినది నీ చేతుల్లో ఉన్నదీ, 'విచారణ మార్గము' ఒక్కటే. ఈ విచారణ నీ ఆలోచన మూలస్థానానికి తీసుకువెళ్తుంది కాబట్టి అది అక్కడ అంతమవుతుంది. అప్పుడే సమస్తమైన ఆలోచనలను శాశ్వతంగా నాశనం చేసి, నీ స్వస్థానంలో నీవు విశ్రమించగలవు” అని ముగించాడు.

ఈ సందర్భంలో ‘ఆలోచన' అన్నప్పుడు, ఒక సామాన్య కార్యనిర్వహణకు అవసరమైన ఆలోచన గురించి కాదు చెప్తున్నది.
[1/10, 07:44] +91 73963 92086: ఒక చెరువు గండి పూడ్చడానికి, ఒక వంతెన నిర్మించడానికి, ఒక చోటుకి వెళ్లేందుకు రవాణా సౌకర్యం కుదుర్చుకోడానికి, ఒక యంత్రాన్ని పనిచేయించడానికి, ఆఖరికి మన ఇంటికి మనం తిరిగి వెళ్ళడానికి కూడా కొంత ఆలోచన అవసరమనేది ఎవరికైనా తెలుస్తుంది. దీనిని విసర్జించి, అనాలోచితంగా, అయోమయంగా జీవించమని ఎవరూ సూచించడంలేదు.

రమణుడుగానీ, మరో మహా పురుషుడుగానీ ఉదహరిస్తున్న 'ఆలోచన' మనిషి తరచూ తన ఊహలోకంలో చేసే భావన. తాను అది అందుకోవాలని, ఇది అందుకోవాలని, ఏదో గొప్ప సాధించాలనీ, ఎంతో కీర్తి ఆర్జించాలనీ, ఎన్నో కోర్కెలు తీర్చుకోవాలనీ, చేసే అనేకానేక భావనల సంగతి ప్రస్తావిస్తున్నారు. ఈ భావనలే మనిషి జనన మరణాలకూ, లోకంలో మనిషిపడే పలు బాధలకూ మూలమని జ్ఞానులు అంటారు. మనిషి ఈ భావనలను [concepts] వదిలితే చాలని జెన్ [ZEN] బౌద్ధుల విశ్వాసం; ఇక ఆ తర్వాత జ్ఞానం, తరణోపాయం కోసం విడిగా ప్రత్యేకమైన కృషి అవసరమే ఉండదని అంటారు. వారిలో ఒకరు అనిన మాటల సొగసు చూడండి.

బుద్ధుడి బోధ యావత్తూ ఒక్కందుకే ఉద్దేశించబడింది !

ఆలోచించే స్థితి నుండి మనల్ని ఆవలకు చేర్చడమే దాని పరమ లక్ష్యం !  కనుక  ఆలోచనల నుండి విముక్తి చెందగలిగితే !
ఇక బుద్ధుడు నేర్పిన ధర్మాలతో పనేముంటుంది”?

🕉️🌞🌏🌙🌟🚩

No comments:

Post a Comment