Tuesday, January 10, 2023

ఎంత డబ్బున్నా,లేకున్నా మనకు దొరకని ముఖ్యమైన వస్తువు

 ఈ సృష్టిలో డబ్బు పెడితే ఏదైనా దొరుకుతుంది.
ప్రేమాభిమానాలు,ఆప్యాయతలు,అనురాగాలు, మమకారాలు,కన్నీళ్ళు కార్చే బంధాలు 
ఇంకా చాలానే..
అవి దొంగవా,నిజమా అనేది తరువాత సంగతి.
కొంతసేపైనా మనకు ఆనందం ఇచ్చేలా ఉంటాయి.
ఈ మధ్య అన్నయ్య కళ్యాణ్ రామ్ సినిమా 
ఒకటి వచ్చింది.అలా అన్నమాట.
కానీ ఎంత డబ్బు ఉన్నా దొరకనిది #ప్రాణం,#కాలం.
ఒక్కసారి పోయిన ప్రాణం
గడిచిన కాలాన్ని వెనక్కి తీసుకోలేము.
అలా తీసుకురాగలిగితే 
మనం కన్నీరు కార్చాల్సిన అవసరమే ఉండదు.
రేపు ఏమి జరగబోతుంది అనే 
సంశయాలు ఉండవు.
అందుకే కాలాన్ని జాగ్రత్తగా వాడుకోవాలి.
ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి.
ఎంత డబ్బున్నా,లేకున్నా మనకు దొరకని ముఖ్యమైన వస్తువు #మనఃశాంతి.
డబ్బుకోసం పరిగెడుతూ కొందరు,
డబ్బు ఉండి దాన్ని ఎలా దాచాలో అని సతమవుతూ కొందరు మనఃశాంతి లేక
అనారోగ్యం పాలై మరణాన్ని చవిచూస్తున్నారు.
పేదోడైనా,ఉన్నోడైనా జీవితంలో ఏదో ఒక సమస్యతో బాధపడుతూ,
ప్రపంచం ముందు నవ్వులు నటిస్తూ
ఇంట్లో మనఃశాంతి లేక ఏడుస్తూ బ్రతుకుతున్నాడు.
వీటన్నింటికి కారణం #డబ్బు.
గడిచిన కాలంలో మన పెద్దలు రోగం అనేది తెలియకుండా 100 ఏళ్ళు బ్రతికారు,
కరోనా సమయంలో అన్నీ విధాలా ఆరోగ్యంగా
ఉన్నవారే చనిపోయారు.
ముసలివారే ఆరోగ్యంగా ఉన్నారు.
కారణం వారి ఆహారపు అలవాట్లు,
వారి రోజువారీ వ్యాయామాలు.
కావాలంటే మీ కుటుంబాలలో వారిని గుర్తుతెచ్చుకోండి.
కానీ నేటి మనిషి టెక్నాలజీకి,మెషీన్స్ కి విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి కొందరు,
బాధ్యతలకు బానిసై మరి కొందరు
తమ ఆయుర్ధాయాన్ని కోల్పోతున్నారు
ఇప్పుడు ప్రతి ఒక్కరి లైఫ్ స్పాన్ 60 ఇయర్స్.ఇంతకంటే ఎక్కువ బ్రతికితే అదృష్టవంతులు అనే అర్థం.
కానీ ఎక్కువకాలం బ్రతికినా ఆనందంగా బ్రతుకుతారని చెప్పలేము.
అందుకే డబ్బు కోసం పరిగేడితే #జబ్బులు తప్పవు.
అలా అని పరిగెత్తకపోతే #తిప్పలు తప్పవు.
మనిషిని నడిపించే ఇంధనం #ధనం.

No comments:

Post a Comment