గణతంత్ర దినోత్సవం" గురించి తెలుసుకుందాం.
ఈ రోజే గణతంత్ర దినోత్సవం...
ఘనులైన త్యాగధనులను
గుర్తు చేసుకొనే దినం...
తరతరాల బానిసత్వానికి
శాశ్వతవిముక్తి కలిగిన దినం..
రాజ్యాంగం సృష్టి కర్త
బహుజనుల నుదిటి రాత
దేశాధినేత ఇచ్చిన రాజ్యాంగంతో
అందరూ మెచ్చివచ్చిన
స్వాతంత్ర్య గణతంత్ర దినోత్సవం..!!
దేశభక్తి అందరిలో ఊపిరై నిలువుగా...
భరతమాత గుండెల్లో
మూడురంగుల జెండాగా ఎగరగా...
స్వాతంత్ర్యం సాధించిన
సంబరాలు జరపగా....
చెరసాలలో చిక్కిన్నోళ్లను...
ఉరికంబమెక్కిన్నోళ్లను...
గుర్తు చేసుకొందాం!!...
గుండెల్లోనిలుపుకొందాం...
ఎన్నిజన్మలెత్తినా తీర్చకోలేము వీరి రుణం....
కులం కుళ్ళు పక్కకు తోసి..
మతం ముళ్ళు గుండెల్లోంచి తీసివేసి...
స్వాతంత్ర్యసాధనలో...
తెగింపుతో త్యాగమై నిలిచారు...
ఎందరో ప్రాణాలను వదిలారు....
తెల్లవారి కుటిల నీతి ఉక్కుపాదాల క్రింద..
ఎందరెందరో నలిగిపోయారు...
గాయమైన కాయాన్ని చూసి
కాలం కన్నీరు కార్చింది!!...
తెల్లదొరల ఆగడాలకు పట్టపగ్గాలులేవు!!...
చూపులను మోయలేని...
గుఱ్ఱపుడెక్కల కింద నలిగిన భరతజాతి...
నిశ్చలంగా..నిర్భయంగా
నిలబడిన త్యాగధనులు!!....
జీవితం పోయినా
పట్టువిడువని పరాక్రమవంతులు
భారతీయులు!!...
మహాత్ములు ఎందరెందరో
నేలకు ఒరిగారు!!....
నెత్తుటితో తడిసిన ఈనేల పైనే...
భారతఖ్యాతి నిలిపిన తేజం...
ఈదేశం గాలిపీల్చిన ప్రతిఒక్కరికీ....
ఓ చైతన్య స్ఫూర్తి రగిలిస్తోంది...
ఈ నేలపై నున్న ప్రతివ్యక్తిలో
పౌరుషం ఉప్పొంగుతుంది...
అవి ఓ అద్బుతక్షణాలు...
గతాన్ని తవ్వితే ఘనకీర్తి ఎంతో...
ఈనాటి వర్తమానం అన్నీట్లో వ్యర్థమే..
నాడు కర్తవ్యానికి కట్టుబడి ఉండేవారు...
సత్యం...ధర్మం..ముందుకు నడిపించింది....
తెగువతో కదంతొక్కారు...
రణం వైపు నినాదం...
యుధ్దభేరి మ్రోగింది....
విజయం వెనుక పరుగులుతీశారు!!...
తెల్లవారిని తరిమికొట్టారు!!...
అంబటి నారాయణ
సేకరణ మీ రామిరెడ్డి మానస సరోవరం.👏
No comments:
Post a Comment