Tuesday, January 10, 2023

పూజ, సాధన, ప్రార్ధన అంటే ఏమిటి?

 090123a1728.    100123-1.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀734.
నేటి…

               *ఆచార్య సద్బోధన:*
                  ➖➖➖✍️

 *పూజ, సాధన, ప్రార్ధన అంటే ఏమిటి?* 
*దేవుడిచ్చిన ప్రతీదానిని నిరసనలు లేకుండా, ప్రసాదంలాగా స్వీకరించడమే నిజమైన పూజ.*

*దేవుడు మనకిచ్చిన బంధాలపట్ల, చేస్తున్న వృత్తిపట్ల, ప్రవృత్తి పట్ల, ప్రకృతి పట్ల, మన చుట్టూ ఉన్న ప్రతిదానిపట్ల, కృతజ్ఞతాపూర్వకంగా ఉండడమే పూజ.*

*అహం, మనస్సు, రాగద్వేషాలు నాశనమే నిజమైన సాధన.*

*అంతఃకరణను శుద్ధి చేసుకోవడమే సాధన*.

*సత్కార్యమే అత్యుత్తమ ప్రార్ధన.*

*సర్వుల యందు సమస్తమందు ప్రేమగా దయగా ప్రవర్తించడమే నిజమైన ప్రార్ధన.*

*భూమి మీద కొన్ని అనుభవాలు పొందటానికే   శరీరం వచ్చింది.* 

*ఆ అనుభవాలు పొందింపచేయటం ద్వారా ఈశ్వరుడు మనలను వివేకవంతులను చేస్తాడు.*

*చెరుకుగడ గెడలాగే ఉంటే రసం రాదు, దానిని యంత్రంలో  పెట్టి పిప్పి చేస్తేనే తియ్యటి రసం వస్తుంది.*

*అలాగే మన దేహం అనేక కష్టాలకు గురి అయితేగానీ, దానినుండి అమృతత్వం రాదని ఉపనిషద్ వచనం...*✍️
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


No comments:

Post a Comment