Saturday, January 7, 2023

విశ్రవస మహర్షి గురించి తెలుసుకుందాము..

 🎻🌹🙏మన మహర్షుల చరిత్రలు..!!

🌹🙏ఈరోజు 68, వ విశ్రవస మహర్షి గురించి తెలుసుకుందాము..🌹🙏

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

🌿విశ్రవస మహర్షి ఆయన్నే విశ్రవో బ్రహ్మ అనికూడా అంటారన్నమాట ! విశ్రవోబ్రహ్మ తండ్రి పులస్త్యుడు . తల్లి తృణబిందు . విశ్రవోబ్రహ్మ పుట్టడం గమ్మత్తుగా జరిగింది .

 🌸పులస్త్యుడు బ్రహ్మ కుడిచెవి నుంచి పుట్టాడు . గొప్ప తపశ్శాలి , జ్ఞానవంతుడు . అన్నింటిలోనూ బ్రహ్మగారితో సమానంగా వుండేవాడు 

🌿ఒకసారి పులస్త్యుడు తృణబిందుడి ఆశ్రమంలో తపస్సు చేసుకుంటున్నాడు . అతని కుమార్తె చెలికత్తెలో అక్కడ తిరుగతూ దర్భాసనం మీద కూర్చుని తపస్సు చేసుకుంటున్న పులస్త్యుణ్ణి చూసింది .

🌿 వెంటనే ఆమె గర్భవతయింది . ఆ మహర్షిని చూడగానే గర్భం వస్తుందన్న శాపం విషయం ఆమెకి తెలియక తండ్రికి తన పరిస్థితి చెప్పింది . తృణబిందుడు మహర్షి దగ్గరకి వెళ్ళి విషయం చెప్పి ఆమెని పెళ్ళి చేసుకోమన్నాడు . 

🌸తృణబిందుని కూతుర్ని పులస్త్యుడు పెళ్ళి చేసుకున్నాడు . ఆమె అందం , వినయం చూసి పులస్త్యుడు నీకు గొప్పవాడైన కొడుకు పుడతాడని చెప్పాడు . 

🌿రెండు వంశాల్ని ఉద్ధరించకలిగిన కొడుకు విశ్రవోబ్రహ్మ ఒక మంచి ముహూర్తంలో పుట్టాడు . తల్లి కడుపులో వుండగానే తండ్రి పులస్త్యుడు చదివే శ్రుతులన్నీ విన్నాడు . కనుక అతడికి “ విశ్రవో బ్రహ్మ " అని పేరు పెట్టారు .

🌸విశ్రవొబ్రహ్మ శుక్లపక్ష చంద్రుడిలా పెరుగుతూ తండ్రిలాగే వేదవిద్యలు నేర్చుకుని , గొప్ప తపశ్శక్తిని కూడా పొందాడు .

🌿 బ్రహ్మచర్యం , ధర్మం , వైరాగ్యం , శాంతం , ఆచారం , కృపాగుణము అన్నీ కలబోసి పుట్టిన విశ్రవసుడు తల్లిదండ్రుల అనుమతి తీసుకుని తపస్సు చేసుకుందుకు వెళ్ళాడు . కొంతకాలం తర్వాత తండ్రిని మించిన తనయుడిగా పేరుపొంది 

🌸దేవవర్ణిని పెళ్ళిచేసుకుని కుబేరుణ్ణి పొందాడు . కైకసిని చేసుకుని రావణ , కుంభకర్ణ , విభీషణ , శూర్పణఖల్ని 
      
🌿మూడవ భార్య కైకసి చెల్లెలు పుష్పాకి మహోదర మహాపార్శ్వాదులు పుట్టారు . నాల్లవ భార్య కైకసి రెండవ చెల్లెలు అయిన రాకకి ఖరదూషణుడు త్రిశిరుడు పుట్టారు .  

🌸కుబేరుడంతటి ధనవంతుణ్ణి , రావణుడంతటి శివభక్తుణ్ణి , విభీషణుడంతటి ధర్మపరాయణుణ్ణి పొందిన విశ్రడ్జి ఎంత గొప్ప మహర్షి మరి  ఇదే విశ్రవస మహర్షి కథ !! 

🌿ఇదండీ మనము తెలుసుకున్న విశ్రవస మహర్షి గురించి రేపు మరో మహర్షి గురించి తెలుసుకుందాము స్వస్తీ..🚩🌞🙏🌹🎻

No comments:

Post a Comment