నేటి ఆణిముత్యాలు .
నీది అయినది
ఎప్పటికీ నిన్ను వీడదు
నీది కానిది
ఎప్పటికీ నీకు దొరకదు
చావు పుట్టుకల మధ్య ఉన్న జీవితంలో నీవు ఎంత వరకు నీ జన్మకు న్యాయం చేశావు అన్నదే పరిగణనలోకి వస్తుంది
మనిషిగా పుట్టడం ఉన్నతమైనది దాన్ని జీవిచడంలో నీ పాత్ర మహోన్నతమైనది
ఉన్నంతలోనే జీవిచడం అవమానకరం కాదుఉన్నతంగా ఉన్నంతలోనే
జీవిచడం ఆనందకరం..
జన్మనివ్వడం తల్లిదండ్రులది
దాన్ని ఒక చక్కటి భావాలతో ఇతరులను నొప్పించక జీవించగలగాలి
అదే జీవితము.
గత జన్మలో మనకి, మన ఖర్మలకి సంభంధం వున్న వాళ్లే మనకు ఈ జన్మ లో పరిచయం అవుతారు.
అందుకే ఎన్నో కోట్ల మంది వున్న ఈ భూమి మీదకేవలం కొద్దిమంది మాత్రమే మన జీవితం లోకి వస్తారు.ఒక స్నేహితునిలా, ఒక సోదరి లా, ఒక సోదరునిలా, ఒక ఆత్మీయునీలా.. ఇలా ఎన్నో బంధాలు అనుబంధాలు..
ప్రతి పరిచయం వెనుక మన మనస్సుకి, మన మేధస్సు కి కూడా అంతు చిక్కని అంత రార్ధం వుంటుంది.
శుభోదయం చెబుతూ మీ రామిరెడ్డి మానస సరోవరం👏
No comments:
Post a Comment