Saturday, January 7, 2023

విపుల మహర్షి గురించి తెలుసుకుందము ..

 🎻🌹🙏 మన మహర్షుల చరిత్రలు..

ఈరోజు 67,వ విపుల మహర్షి గురించి తెలుసుకుందము ..🌹🙏

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

🌸మనం విపుల మహర్షి గురించి తెల్సుకుందాం. విపుల మహర్షి గొప్ప గురుభక్తి కలవాడు. భృగువంశంలో పుట్టాడు విపులుడు. అతడు దేవశర్మ అనే గురువుగారి దగ్గర విద్యలు నేర్చుకున్నాడు. అతని శ్రద్ధ భక్తి, వినయం, విధేయత, గుణం అన్నీ చూసి దేవశర్మకి విపులుడంటే చాలా యిష్టం.

🌿దేవశర్మ భార్య చాలా అందగత్తె. ఆమె పేరు రుచి, మహాపతివ్రత. ఆమె ఆందాన్ని చూసిన ఇంద్రుడు దేవశర్మ లేకుండా ఎప్పుడు ఆశ్రమానికి వద్దామా అని చూస్తున్నాడు. దేవశర్మకి ఆ విషయం తెలిసి రుచిని చాలా జాగ్రత్తగా చూస్తున్నాడు.

🌸ఒకనాడు దేవశర్మ వేరే గ్రామం వెళ్ళాల్సివచ్చి విపులుణ్ణి పిలిచి సంగతి చెప్పి తన భార్యని జాగ్రత్తగా చూసుకోమని, ఇంద్రుడు ఏ రూపంలోనయినా రావచ్చని చెప్పాడు. దేవశర్మ వెళ్ళగానే ఇంద్రుడు వచ్చాడు. రుచి ఎవరో వచ్చారనుకుని ఏం పని మీద వచ్చారనడిగింది.

🌿వెంటనే విపులుడు గురుపత్నిలో ప్రవేశించి ఆమె శరీరం కదలకుండా చేశాడు. ఇంద్రుడు ఎన్ని సైగలు చేసినా ఆమెలో చలనం లేదు. ఇంద్రుడు సిగ్గుపడి మళ్ళీ మళ్ళీ పలకరించాడు. ఆమె నోటి నుండి నువ్వెందుకొచ్చావు ఫో! అని మగాడి గొంతుతో విన్పించింది. ఇంద్రుడికి అప్పుడర్థమయింది.

🌸వెంటనే విపులుడు బయటికి వచ్చి వెంటనే వెళ్ళకపోతే ఇక్కడే భస్మం చేస్తానని చెప్పగానే ఇంద్రుడు వెళ్ళిపోయాడు. రుచికి విషయం తెలిసి విపులుణ్ణి అభినందించింది. దేవశర్మ రాగానే జరిగింది చెప్పాడు విపులుడు. 

🌿దేవశర్మ శిష్యుణ్ణి మెచ్చుకుని ఏం కావాలో కోరుకోమన్నాడు. విపులుడు గురుదేవా! ఎప్పుడూ ధర్మకార్యాలు చేస్తూ, బుద్ధి భగవంతుడి మీదే వుండేటట్లు అనుగ్రహించమన్నాడు . విపులుడు గురువు అనుమతి తీసుకుని వేరేచోట ఆశ్రమం ఏర్పాటు చేసుకుని తపస్సులో మునిగిపోయాడు. 

🌸కొంతకాలం తర్వాత అతని తపశ్శక్తితో భూలోకంలోనూ, స్వర్గలోకంలోనూ కూడా స్వేచ్ఛగా తిరగ్గలిగే శక్తిని పొందాడు విపులుడు. రుచి ఒకసారి తన అక్క ఇంటికి బయల్దేరి వెడుతూ వుంటే ఒక అప్సరస విడిచి వెళ్ళిన దేవ కుసుమాలు దొరికతే తల్లో పెట్టుకుంది.

🌿అవి చూసి ఆమె ఆక్క కూడా అలాంటి పువ్వులు కావాలని అడిగింది రుచిని. గురువు ఆజ్ఞ ప్రకారం తపశ్శక్తితో విపులుడు అలాంటి పువ్వులు తీసికొస్తుండగా ఇద్దరు మనుషులు ఏదో గొడవ పడుతూ కనిపించారు. 

🌸ఇంకా కొంత దూరం వెళ్ళాక నలుగురు మనుషులు పాచికలాడుకుంటూ కనిపించారు. ఆ పువ్వులు గురుపత్నికిచ్చాడు విపులుడు. గురువుగార్ని తాను చూసిన మనుషుల గురించి అడిగాడు విపులుడు. నువ్వు మొదట చూసిన ఇద్దరు అహోరాత్రులు,  తర్వాత చూసినవాళ్ళు ఋతువులు. 

🌿మనిషి తాను చేసిన పాప పుణ్యాలు ఎవరు చూడట్లేదనుకుంటాడు. కాని ఆ హోరాత్రులు, ఋతువులు వాటిని గమనిస్తూనే వుంటాయి అని చెప్పాడు దేవశర్మ. ఇప్పుడు నీకు కనిపించడానికి కారణం నువ్వు గురుపత్నిని రక్షించినప్పుడు మంచి పని కోసమే గురుపత్నిలో ఆవహించావు.

🌸కాని అది తప్పే కాబట్టి వాళ్ళు నీకు కనపించారు. ఆ దోషం లేకుండా నేను నీకు వరమిస్తున్నానని దేవశర్మ విపులుడికి వివరంగా చెప్పాడు. 

🌿గురువాజ్ఞ తీసుకుని తపస్సు చేసుకునేందుకు వెళ్ళిపోయాడు విపుల మహర్షి . ఇదండీ విపుల మహర్షి గురించి మనకు తెలిసిన సమాచారం రేపు మరో మహర్షి గురించి తెలుసుకుందాం....స్వస్తి..🚩🌞🙏🌹🎻

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

No comments:

Post a Comment