Friday, January 6, 2023

*****:::::::ఇంద్రియ సుఖాలు:::::*

 *:::::::ఇంద్రియ సుఖాలు:::::*
   ఇంద్రియాలు బాహ్య ప్రపంచంతో నిరంతరం  సంబంధాన్ని కలిగి ఉంటాయి.అలాంటి సందర్భం లో  మనకు సుఖ/దుఃఖ వేదనలు కలుగుతాయి.అలా కలిగే వేదనలలో సుఖ వేదనలను ఇంద్రియ సుఖాలు అంటారు. వీటి పట్ల నిగ్రహం అవసరం. ఎందుకంటే...
      1)ఇవి మనలను వాటి 
వెంటబడేటట్లు  చేస్తాయి. 
      2)ఈ సుఖాల వేటలో ఇంగిత జ్ఞానం కొరవడి మనం ప్రవర్తన గాడి తప్పుతుంది
       3)మనలను  వ్యసన పరుడుని చేస్తాయి.
       4) జీవితం అంటేనే సుఖించడం అనే భావనకు లోనై స్వార్థ పరుడిని చేస్తాయి. 
         5)ఈ సుఖాలు ఇచ్చే ఉత్తేజం తృప్తిని ఇవ్వక ఎప్పటికప్పుడు మరింత ఉత్తేజం కోసం అన్వేషణ చేస్తూ జీవితం వృధా అవుతుంది.
       6)చివరికి జీవితం అసంతృప్తితో, నిరాశతో, నిరుత్సాహంగా, అశాంతిగా, , దుఃఖంతో ముగిసేటట్లు చేస్తాయి.
    *ధ్యానం  నిగ్రహాన్ని పెంచి సుఖదుఃఖాలను సమం చేస్తుంది* 
షణ్ముఖానంద 9866699774.

No comments:

Post a Comment