Saturday, January 7, 2023

ఆశకన్నా ఆశయం ముఖ్యం

 *ఆశకన్నా ఆశయం ముఖ్యం*

కాలం అంటే 'కదలిక. ఇది మార్పుగా, కర్మఫలంగా ప్రత్యక్షమవుతుంది. వేదసంస్కృతిలో భగవంతుడంటే 'కర్మఫలప్రదాత. ఒక పనిచేశాడ ఆది కాలాంతరంలో ఫలంగా కనిపిస్తుంది... ఎప్పుడో వేసిన విత్తనం ఇప్పుడు వృక్షఫలంగా లభించినట్టు, నాటి విత్తనాన్ని నేడు ఫలంగా పరిణమింపజేసిన శక్తి కాలానిదే. కాలంలో సత్ఫలం లభించాలంటే కర్మలోనూ 'సత్' ఉండాలి. దీన్నే అందమైన ఉదాహరణతో మహాభారతంలో వ్యాసుడు హృద్యంగా వక్కాణిస్తాడు! 'ఒక విత్తనం వేసి, మరొక పండును ఆశించరాదు. జామవిత్తనం వేసి మామిడి ఫలాన్ని కోరుకోకూడదు. పాపానికి ఫలం దుఃఖం, పుణ్యానికి సుఖం దుఃఖాన్ని కోరుకోము. కానీ దుఃఖానికి కారణమైన పాపాన్నే చేస్తాం. పుణ్యఫలమైన సుఖాన్ని కోరతాం. కానీ సుభానికి మూలమైన పుణ్యాన్ని ఆచరించండి ఇక్కడ పుణ్యపాపాలంటే మంచి చెడులే. మంచి పనికి మంచి ఫలితం ఉంటుంది అనే దృఢ విశ్వాసమే శ్రద్ధ.

పనిచేసే తీరులో గొప్పతనం. సరిపోదు. దాని వెనక ఉన్న సంకల్పం, భావం కూడా పనికి శక్తినిస్తాయి. ధర్మరాజు రాజసూయ యాగం వైభవంగా చేశాడనే అసూయతో, పోటీగా దుర్యోధనుడు. ఒక యాగాన్ని తల పెడతాడు. కానీ అది రాణించదు. యాగక్రియ గొప్పగా జరిగినా అందులో 'సత్' లక్షణం లేదు. దుర్భావం దానికి పునాది. కనుక కాలం ఫలరూపంగా వచ్చేటప్పుడు. సత్ఫలాన్ని ఇవ్వలేక పోయింది. కర్మ గొప్పదైనా సంకల్పశుద్ధి లేనప్పుడు వికటిస్తుందనడానికి ఇదో ఉదాహరణ. దక్షుడు పరమేశ్వరుడైన శివుణ్ని అవమానించాలనే ఉద్దేశంతో యజ్ఞాన్ని తలపెడతాడు. ఆ యజ్ఞ ప్రయోజనం ఉన్నత లక్ష్యం కాకపోవడం చేత అది దుష్ఫలితాన్నే ఇచ్చింది.
తాము గొప్ప లక్ష్యాలు సాధించడం కోసమే కృషి చేస్తున్నామని, త్యాగం. చేస్తున్నామని పెద్దమాటలు చెబుతూ, ప్రచారాలు చేసుకునేవారు. తమను తామే గొప్పవారిగా ప్రకటించుకుంటారు. వారి అనుయాయులు భజన చేస్తుంటారు. కానీ, కాలం వారిని చూసి నవ్వుకుంటుంది. క్రమంగా కాలం వారికి గట్టి పాఠాన్నే నేర్పుతుంది. ఎవ్వరికోసం ఆగకుండా సాగిపోయే కాలం నిష్పక్షపాతంగా కర్మల ముందువెనకలను గమనించి తగిన ఫలితాన్ని ఇస్తుంది..

గతించిన కాలంలో చేదు- తీపి అనుభవాలు మిగిలినా, రానున్న కాలం మధురంగా జరగాలనే ఆకాంక్ష జరుగుతుందనే ఆశ మనిషికి ఉత్సాహాన్ని ఊపిరిగా పోసి కర్మకు పురిగొల్పుతుంది. మంచి పనికి అనంత కాలంలో తప్పక మంచి ఫలితం ఉంటుందనే శుభాశయం మనసుకు మంచి బలాన్నిస్తుంది. ప్రేరణనూ ప్రసాదిస్తుంది. అందుకే కాలం తిరిగే ప్రతి మలుపులో సాగిపోతున్న మానవుడు ఒక్కసారి ఆగి ఊపిరి పీల్చుకొని మంచి ఆకాంక్షతో ముందుకు సాగుతాడు.

మతపరంగా, ప్రాంతాలపరంగా ఎవరి కాలగణన వారికి ఉంటుంది. వాటి ప్రారంభంలో, ఎవరి పద్ధతిలో వారు ఉత్సవాలుగా, ఉత్సాహాలుగా 'శుభాలు జరగాలని కోరుకుంటుంటారు. ఆ కాలమానపు ఆరంభంలో ప్రతి ఒక్క అంతరంగం 'రానున్న ఏడాది అంతా హాయిగా జరగాలి. సుఖ సంతోషాలతో పరిమళించాలి' అని ఆశిస్తుంది. ఈ ఆశ వెనక ఆశయానికి సంకల్ప భాష, లక్ష్యశుద్ధి ఉండాలన్నది గమనించి, 'శుభాకాంక్ష'తో సత్కర్మలకు సంసిద్ధులమైతే- ఉందిలే మంచికాలం ముందు ముందున

సామవేదం షణ్ముఖశర్మ-
సేకరణ మీ రామిరెడ్డి మానస సరోవరం👏

No comments:

Post a Comment