1412. 1- 120123-8.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀118.
*మన ఆరోగ్యం…!
*కంటిచూపు…!*
➖➖➖✍️
*ప్రస్తుతం చిన్నా పెద్దా, ఆఫీసు, స్కూలు తేడా లేకుండా స్క్రీన్స్ వైపే చూస్తున్నారు. ఇంటి నుండి బయటకు వెళ్ళడం ఎంత తగ్గిస్తే అంత మంచిదన్న ఉద్దేశ్యంతో రిలాక్సేషన్ కూడా స్క్రీన్ మీదే డిపెండ్ అవుతున్నాం. కంప్యూటర్ కాకపోతే టీవీ, అదీ కాదంటే మొబైల్స్. అందువల్ల డిజిటల్ ఐ స్ట్రైన్ ఒక తప్పనిసరి ప్రాబ్లమ్ గా తయారైంది.*
*ఈ డిజిటల్ ఐ స్ట్రైన్ తగ్గించుకోవడానికి మీరు మీ వర్క్ తగ్గించుకోనక్కరలేదు, సోషల్ మీడియా, గేమ్స్, ఇంటర్నెట్... ఏదీ ఎవాయిడ్ చేయనక్కరలేదు. కేవలం ఐ-ఫ్రెండ్లీ హ్యాబిట్స్ డెవలప్ చేసుకోవడం ద్వారా, మీ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ ని ఎడ్జస్ట్ చేసుకోవటం ద్వారా మీ ఐస్ కి మీరు రిలీఫ్ ఇవ్వవచ్చు.*
*కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ లేదా డిజిటల్ ఐ స్ట్రైన్ యొక్క లక్షణాలు:*
*1. కళ్ళ అలసట*
*2. మసకగా కనిపించడం..*
*3. కళ్ళు పొడిబారడం..*
*4. తలనొప్పి*
*5. భుజాల, మెడా నొప్పులు*
*కంప్యూటర్ మానిటర్స్, ఎలక్ట్రానిక్ డివైసెస్ నుండి వచ్చే గ్లేర్ డిజిటల్ ఐ స్ట్రైన్ ని కలుగచేస్తుంది. కంప్యూటర్ తోనే వర్క్ చేసేవాళ్ళు కనీసం ఏడు గంటలు స్క్రీన్ వైపు చూస్తూ ఉంటారని ఒక అంచనా. ఇది కేవలం వర్క్ మాత్రమే. సోషల్ మీడియా, గేమ్స్ ఇంటర్నెట్ వాడకం ఇవి ఈ ఏడు గంటల లోకి రావు. రాయడం, ఫొటోగ్రఫీ, డిజిటల్ డిజైన్ వంటి కొన్ని క్రియేటివ్ హాబీస్ కూడా స్క్రీన్ టైమ్ కి దోహదం చేస్తున్నాయి. రీడింగ్ హ్యాబిట్ ఉన్న చాలా మంది ఇప్పుడు మొబైల్ లోనే బుక్స్ చదువుతున్నారు. స్క్రీన్ బట్టి ఇందులో ఉన్న కంఫర్ట్ మారుతుంది. టాబ్లెట్, మొబైల్, కంప్యూటర్ మానిటర్ ని బట్టీ, అందులో ఉన్న సెట్టింగ్స్ ని బట్టీ కాంట్రాస్ట్ సరిగ్గా ఉండకపోవచ్చు, ఎడ్జెస్, డీటైల్స్ షార్ప్ గా ఉండకపోవచ్చు.*
*1. సరైన లైటింగ్..*
*సరైన లైటింగ్ వల్ల చాలా డిఫరెన్స్ ఉంటుంది. మీ చూట్టూ ఉన్న లైటింగ్ మీ మానిటర్ లైట్ కంటే బ్రైట్ గా ఉండాలి. ఇందు వల్ల మానిటర్స్, డివైసెస్ నుండి వచ్చే గ్లేర్ యొక్క ఎఫెక్ట్ రెడ్యూస్ అవుతుంది. లైటింగ్ సరిగ్గా లేకపోతే ఐ స్ట్రెయిన్ కి అది కాంట్రిబ్యూట్ చేస్తుంది.*
*2. మంచి పోశ్చర్ మెయింటెయిన్..*
*మీరు కూర్చునే పోశ్చర్, మీ వర్క్ స్టేషన్ యొక్క హైట్ వంటివి కూడా ఈ ప్రాబ్లమ్ ని క్రియేట్ చేయవచ్చు. మీ మానిటర్ మీకు చేయి చేస్తే అందే దూరం లో ఉండాలి. అలాగే, మీ ఐ లెవెల్ కంటే మీ మానిటర్ 10 డిగ్రీలు కిందకి ఉండాలి. మీ డెస్క్, లేదా ఛైర్ ని ఈ పద్ధతిలో ఎడ్జస్ట్ చేసుకోండి. అలాగే, మాట్ స్క్రీన్ ఫిల్టర్ యూజ్ చేయవచ్చు.*
*3. గ్లేర్ మినిమైజ్..*
*మీ చుట్టూ ఉన్న లైటింగ్ కన్నా మీ మానిటర్ లైట్ తక్కువ ఉండేలా మానిటర్ బ్రైట్నెస్ ని ఎడ్జస్ట్ చేసుకోండి. బ్లూ లైట్ ఎక్కువైతే ప్రీమెచ్యూర్ ఐ ఏజీయింగ్ జరుగుతుంది. మనకి ప్రధానం గా సూర్యుని నుండే బ్లూ లైట్ వస్తుంది. కానీ, ఎలీడీ మానిటర్స్ వల్ల బ్లూ లైట్ ఎక్స్పోజర్ పెరుగుతుంది. మీ మానిటర్ లో కలర్ సెట్టింగ్స్ ని బ్లూ లైట్ డిక్రీజ్ అయ్యేలా ఎడ్జస్ట్ చేసుకోవడం మంచిది. లేదా నైట్ టైమ్ సెట్టింగ్స్ కూడా బ్లూ లైట్ ని రెడ్యూస్ చేస్తాయి. అలాగే, కాంట్రాస్ట్ ని కూడా ఎడ్జస్ట్ చేసుకోండి. ఇందు వల్ల మానిటర్ వైపు చూస్తున్నప్పుడు సౌకర్యవంతం గా ఉంటుంది. ఇమేజెస్ షార్ప్ గా ఉన్నప్పుడు మీరు స్క్రీన్ మీద ఈజీగా చదవగలుగుతారు.*
*4. కళ్ళకి మధ్యలో బ్రేక్స్..*
*స్క్రీన్ వైపు చూడడం నుండి మీ కళ్ళకి ఫ్రీక్వెంట్ గా బ్రేక్స్ ఇవ్వండి. 20-20-20 రూల్ ఈ విషయం లో చాలా హెల్ప్ చేస్తుంది.*
*1. ప్రతి ఇరవై నిమిషాలకీ ఒక సారి బ్రేక్ తీసుకోండి.*
*2. ఇరవై అడుగుల దూరం లో ఉన్న ఏదైనా నాన్-డిజిటల్ వస్తువు వైపు చూడండి.*
*3. ఆ వస్తువు మీద ఇరవై సెకన్లు ఫోకస్ చేయండి.*
*అలాగే మీరు కంప్యూటర్ మీద వర్క్ చేస్తున్నప్పుడు ప్రతి రెండు గంటలకీ ఒక పావు గంట బ్రేక్ తీసుకోండి. అంతే కాక, మీ వర్క్ పూర్తిగా కంప్యూటర్ బేస్డ్ అయితే కనక మీ లెజర్ స్క్రీన్ టైమ్ ని రెడ్యూస్ చేయడానికి చూడండి. బ్రేక్స్ తీసుకుంటూ ఉంటే కళ్ళు ఫ్రెష్ గా ఉంటాయి. అలాగే, అప్పుడప్పుడూ బ్లింక్ చేయడం వల్ల మీరు మీ కళ్ళకి ఒక మైక్రో బ్రేక్ ఇచ్చినట్లు.*
*5. బ్లింక్ చేయడం..*
*మనం నిమిషానికి పదిహేను సార్లు కనురెప్పలు ఆర్పుతామని ఒక అంచనా. ఇందు వల్ల కంటిలో నీరు కన్ను మొత్తం స్ప్రెడ్ అవుతుంది. కన్ను హైడ్రేటెడ్ గా ఉంటుంది. కానీ, కంప్యూటర్ స్క్రీన్ వైపు చూస్తున్నప్పుడు మనం అన్ని సార్లు బ్లింక్ చేయం. అందుకని, నాచురల్ గా బ్లింక్ చేయడం అలవాటు చేసుకోండి. అవసరమనుకుంటే ఆర్టిఫిషియల్ టియర్స్ తో సప్లిమెంట్ చేయండి. తగినన్ని సార్లు బ్లింక్ చేయకపోవడం వల్ల డ్రై ఐ సిండ్రోమ్ కూడా వస్తుంది. మీరు కాంటాక్ట్ లెన్సెస్ వాడుతున్నట్లైతే వాటి నుండి కూడా అప్పుడప్పుడూ కళ్ళకి రెస్ట్ ఇవ్వండి. ఎందుకంటే, అవి కూడా డ్రై ఐస్ ని కలుగచేస్తాయి.*
*7. రెగ్యులర్ గా ఐ చెకప్స్..*
*సంవత్సరానికి ఒకసారి మీ ఐస్ చెక్ చేయించుకోండి. ఏవైనా విజన్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటే వెంటనే ట్రీట్మెంట్ తీసుకోండి. మీ లైఫ్ స్టైల్ ని మీ ఐ స్పెషలిస్ట్ తో డిస్కస్ చేస్తే వారు మీ పరిస్థితికి అనువైన సూచనలు చేయగలరు.*✍️
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
No comments:
Post a Comment