2211. 1-9. 270123-8.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀108.
*మన ఆరోగ్యం…!
*డిప్రెషన్! (క్రుంగుబాటు)*
➖➖➖✍️
*డిప్రెషన్ లో ఉన్నవారు ఎలా ప్రవర్తిస్తారు..? గుర్తించడమెలా?*
*చాలా మందికి బాధకీ, డిప్రెషన్ కి తేడా తెలీదు. దీంతో.. బాధలో ఉన్నా కూడా డిప్రెషన్ లో ఉన్నామనే భ్రమలో ఉంటారు. అసలు డిప్రెషన్ లో ఉన్నవారి లక్షణాలు ఎలా ఉంటాయి.. బాధకీ, డిప్రెషన్ కి తేడా ఏంటో ఇప్పుడు చూద్దాం…*
*ప్రస్తుతం చాలా మంది చాలా రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అయితే.. వాటన్నింటిలో.. డిప్రెషన్ అనేది చాలా పెద్ద రోగం. *
*దీని వల్ల బాధపడుతున్నవారు సైతం ఈ రోజుల్లో చాలా మంది ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా 264 మిలియన్ల మంది.. ఈ డిప్రెషన్ తో బాధపడుతున్నారట.*
*ఏదైనా కోల్పోయిన సమయంలో, ఎక్కువ ఏడుస్తూ బాధపడే విషయంలో చాలా మంది ఈ డిప్రెషన్ కి గురౌతున్నారు. *
*తమకు నచ్చిన వ్యక్తి మరణించినప్పుడు.. ప్రేమలో బ్రేకప్, ఉద్యోగం పోవడం ఇలాంటి కారణాల వల్లే ఎక్కువ మంది డిప్రెషన్ కి గురౌతున్నట్లు సర్వేలో తేలింది.*
*కాగా.. చాలా మందికి బాధకీ, డిప్రెషన్ కి తేడా తెలీదు. దీంతో.. బాధలో ఉన్నా కూడా డిప్రెషన్ లో ఉన్నామనే భ్రమలో ఉంటారు. *
*అసలు డిప్రెషన్ లో ఉన్నవారి లక్షణాలు ఎలా ఉంటాయి.. బాధకీ, డిప్రెషన్ కి తేడా ఏంటో ఇప్పుడు చూద్దాం..*
*ఏదైనా అనుకోని బాధకలిగించే సంఘటన జరిగినప్పుడు మనకు దుఖం రావడం చాలా సహజం. అయితే... దానిని అనుభవించడమే బాధ. ఒక వ్యక్తి విచారంలో ఉన్నప్పుడు కూడా.. ఒక్కోసారి గతంలోని సంతోషకరమైన విషయాలు గుర్తుకు వస్తాయి. *
*వాటి వల్ల మరింత బాధ కలిగించే అవకాశం ఉంది. అయితే.. ఆ బాధ నుంచి త్వరగా బయటకు రాకుండా.. ఎక్కువ సేపు ఒంటరిగా.. విచారంగా ఉంటున్నారంటే.. వారు నెమ్మదిగా డిప్రెషన్ లోకి వెళ్తున్నట్లు గుర్తించాలి.*
*ఎక్కువ విచారంగా ఉంటూ.. *
*తాము కోల్పోయిన వ్యక్తి గురించే ఆలోచిస్తూ.. ఇతర ఏ పనిని పట్టించుకోకుండా ఉండటం వల్ల డిప్రెషన్ కి వెళ్లిపోయే అవకాశం ఉంది. కొందరికైతే సూసైడ్ థాట్స్ కూడా వస్తూ ఉంటాయి. తమను తాము హానిపరుచుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు.*
*డిప్రెషన్ లక్షణాలు..*
*1. విచారంగా, నిరాశగా ఉండటం*
*2. చిరాకు, ఆత్రుత, రెస్ట్ మోడ్, మూడీగా ఉండటం*
*3. ఇష్టమైన కార్యకలాపాలపై ఆసక్తి కోల్పోవడం*
*4. ఆకలి లేకపోవడం లేదా..! అతిగా తినడం*
*5. బరువు తగ్గడం లేదా పెరగడం*
*6. లైంగిక కోరిక అతిగా పెరగడం లేదా పనితీరు తగ్గడం*
*7. చాలా నిద్రపోవడం లేదా చాలా తక్కువ నిద్రపోవడం *
*8. ఏకాగ్రత, నిర్ణయాలు తీసుకోవడం లేదా సాధారణ కార్యకలాపాలను పూర్తి చేయడంలో సమస్య*
*9. అసహ్యం, నిస్సహాయత , అపరాధ భావన పెరిగిపోవడం*
*10. అలసట*
*11. ఆత్మహత్య లేదా ఆత్మహత్య ఆలోచనలు*
*ఇలాంటి లక్షణాలు కనిపిస్తే.. వారు కచ్చితంగా డిప్రెషన్ లో ఉన్నారనే విషయాన్ని గుర్తించాలి. లేదంటే.. మరింత ఇబ్బందిపడే ప్రమాదం ఉంది. *✍️
. 🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
No comments:
Post a Comment