Monday, January 23, 2023

:::: చర్యలు::::

 :*::::::::::: చర్యలు:::::::::::::*
    మనం నిరంతరం బాహ్య ప్రపంచంతో మనస్సు, వాక్కు, కాయం రూపంలో (మనో వాక్ కాయ కర్మలు) చర్య జరుపుతాము,ఈ చర్యలు వేటి ఆధారంగాజరుపుతాముఅంటే.
 1) *వేదన* మనం చూచింది , విన్నది రుచి చూసినది ,తాకినది మనలో వివిధ రకాల సంవేదనలు కలిగిస్తాయి. ఇవి ఎలాంటివి అన్న దానిని బట్టి మన చర్య  వుంటుంది.
2) *వైఖరి* మనం ఈ ప్రపంచంతో సంబంధం కలిగి వుండే మనదైన వైఖరి స్థిర పడి వుంటుంది.దీని ప్రకారం చర్య చేస్తాము.
3) *అనుభవాలు* కొన్ని అనుభవాలు వుంటాయి.ఇవి మనలను నడిపిస్తాయి.
4) *జ్ఞానం* మనం ఈ సమస్త వస్తు, విషయాల పట్ల కోంత జ్ఞానం కలిగి ఉంటాము.దీని ఆధారంగా చర్యలు చేస్తాం 
5) *సంజ్ఞ* మనుషులను,
సంఘటనలను, ఎలా గుర్తిస్తాము అన్నదాన్ని  బట్టి మన ప్రవర్తన వుంటుంది.
    *ధ్యానం* ధ్యాని యెక్క రూటే వేరు. ధ్యాని మొత్తం చర్య లో అంతఃభాగమై వుంటాడు. చర్యే గాని ధ్యాని కనపడడు.
*షణ్ముఖానంద 98666 99774*

No comments:

Post a Comment