అరుణాచల👏
🌻ఓం నమో భగవతే శ్రీ రమణాయ🌺
*భక్తుడు :*
మనుష్యుని జీవితంలో వాని వృత్తి ఉద్యోగాలలాంటి ముఖ్యమైన విషయాలు మాత్రము ముందే నిర్ణయింపబడి ఉంటాయా? లేక మరీ చిన్న చిన్న విషయాలు (ఓ గ్లాసుడు నీళ్లు తాగడం, గదిలో ఒకచోట నుంచి మరో చోటికి వెళ్లడం) లాంటివి కూడానా !
*మహర్షి :*
అవును, ప్రతీదీ ముందే నిర్ణయింపబడి వుంది.
*భక్తుడు :*
అటువంటప్పుడు మనిషికి పురుషకారము ( మానవ ప్రయత్నం ) ఏముంటుంది ? బాధ్యత ఎలా ఉంటుంది ?
*మహర్షి :*
అయితే దేహము ఎందుకు కలిగిందంటావు? ఈ జీవితంలో చేయ నిర్ణయింపబడిన వాటిని చేయడానికే ఈ దేహం ఉద్దేశింపబడింది. చేయవలసిన సర్వమూ ముందే నిర్ణయింపబడింది. *"శివుని ఆజ్ఞలేనిదే చీమైనా కుట్టదు"* అనే విషయం అటువంటి సత్యాన్నే తెలియ చేస్తోంది. అది కర్మవల్ల అయితేనేమి, దైవలీలవల్ల అయితేనేమి. ఏమన్నా అను. నిజమదే.
ఇక పురుషార్థం విషయానికి వస్తే, దేహంతో తాదాత్మ్యం చెందకుండా శారీరక వ్యాపారాల కారణంగా కలిగే సుఖదుఃఖాలచేత ప్రభావితం కాకుండా ఉండేందుకు మనిషికి ఎప్పుడూ స్వేచ్ఛ ఉంది.
🌻ఓం తత్సత్🌺
No comments:
Post a Comment