Thursday, January 26, 2023

రండి కాఫిర్లారా( అవిశ్వాసులారా ) తెలుసుకోండి శాంతి మతం గురించి . మరింత సమాచారం కోసం కామెంట్ సెక్షన్ చూడగలరు. ఇస్లాంలో తెలుసుకోవలసిన కొన్ని పదాలు

 రండి కాఫిర్లారా( అవిశ్వాసులారా ) తెలుసుకోండి శాంతి మతం గురించి . మరింత సమాచారం కోసం కామెంట్ సెక్షన్ చూడగలరు.

ఇస్లాంలో తెలుసుకోవలసిన కొన్ని పదాలు
___________________________________

ఇస్లాంను అర్థం చేసుకోవడానికి, దాని నిజస్వరూపాన్ని చూపడానికి ఖురాన్, హదీస్లను తెలుసుకోవడంతోపాటు మహమ్మద్ ప్రవక్త తన జీవితకాలంలో ఇస్లాంను ఎలా వ్యాప్తి చేశాడో కూడా గ్రహించాలి. దీనికోసం ఇస్లాంలోని మౌలికమైన అంశాల్ని తెలుసుకోవాలి. ఇస్లాంలో కొన్ని ముఖ్యమైన పదాల అర్థాలు పరిశీలించడం చాలా ముఖ్యం. ఇస్లాం మత పరిభాష అరబ్బీలో ఉంది. కొన్ని ముఖ్యమైన పదాల అర్థాలు చూద్దాం. 

1. అల్లాహ్

ఇస్లాం పుట్టుక ముందు అరబ్బులు అనేకమంది దేవతలను కొలిచేవారు. అప్పుడు అల్లాహ్ అనే పదాన్ని దేవుడు (God) అని వారిలో ఏ దేవుడికైనా వాడారు. తరువాత మహమ్మద్ దాన్ని ఏకైక దేవుడు (The God) గా మార్పు చేశాడు (See Prophet of Doom by Craig Winn). ఇస్లాం దేవుడి పేరు అల్లాహ్. అతని వాక్యం కల్మా. కల్మా వాక్యం ఇలా అంటుంది - "లా ఇలాహ్ ఇల్లలాహ్ ముహమ్మద్ ఉర్ రసూలుల్లాహ్ '. అంటే 'అల్లా తప్ప మరెవరూ భగవంతుడు కాడు. మహమ్మద్ ఆ దేవుడి ప్రవక్త'. ఖురాన్ కూడా 'లా ఇలాహ్ ఇల్లలాహ్ ' (2-163) (3-2) అని చెపుతోంది. దీనినిబట్టి ఇస్లాం మొదటి నుంచి ఇతర మతాల అస్తిత్వాన్ని నిరాకరిస్తుందని, ఇతర మతాలను దేవుడి మరొక రూపమని నమ్మడాన్ని ఖండిస్తుందని, అలా ఇతర మతాలను విశ్వసించేవారిని అవిశ్వాసులుగా పరిగణిస్తుందని స్పష్టమౌతుంది. ఖురాన్ ఎంతవరకూ చెప్పిందంటే ఎవరైనా దేవుడి ఇతర రూపాలను అల్లాహ్ సమానంగా పరిగణిస్తే వారిని అల్లాహ్ అత్యంత కఠోరంగా శిక్షస్తాడని (2-165) హెచ్చరించింది.

2. ఇస్లాం (దాస్యం)

ఇస్లాం అంటే అల్లాహ్ దాసుడవడం. (ఖురాన్ 2-131, 132, 3-20) ఖురాన్ ప్రకారం ఇస్లాం మాత్రమే నిజమైన మతం (3,19,30). తక్కిన మతాలేవీ అసలు మతాలే కాదు. ఇస్లాం తప్ప మరే ఇతర మతాన్ని నమ్మేవారికైనా మరణదండన తప్పుదు. ఎందుకంటే ఖురాన్ ప్రకారం, ఆ తరువాత నరకంలో అత్యంత క్రూరమైన శిక్ష పడుతుంది. 

3. ఖురాన్

ఖురాన్ ఇస్లాం మూలగ్రంథం. క్రీ.శ. 610 నుంచి 628 మధ్యకాలంలో అల్లా గాబ్రియల్ అనే దూత ద్వారా తన సందేశాలను మహమ్మద్కు పంపాడని, ఆ సందేశాల సంకలనమే ఖురాన్ అని ముస్లిముల విశ్వాసం. ఖురాన్ దేవుడు స్వయంగా అందించిన గ్రంథమని (ఖురాన్ 11-1, 2, 32 మరియు 36-5) కూడా ముస్లిములు నమ్ముతారు. ఖురాను నమ్మి ఎవరు అందులో చెప్పినవిధంగా జీవిస్తారో వాళ్ళని మరణం తరువాత స్వర్గానికి పంపడం ద్వారా సత్కరిస్తానని అల్లా చెప్పాడు (35-11).

మహమ్మద్ ఖురాన్ సందేశాన్ని కొంత మక్కాలో, మిగిలినది మదీనాలో పొందాడు. 622 సంవత్సరంలో మహమ్మద్ మక్కా వదిలి మదీనాకు పారిపోయాడు. దీనినే 'హిజ్రా' (నిష్క్రమణ లేదా పలాయనం) అంటారు. పలాయనానికి ముందు మహమ్మద్ మక్కాలో ఉన్నప్పుడు అక్కడ అతనికి అనుయాయులు ఎవరూ లేరు. అందుకనే హిజ్రాకు ముందు అతను చెప్పిన ఆయాత్లలో తీవ్రత కనబడదు. అవి సాధారణంగా ఉంటాయి.

మదీనాకు వెళ్ళిన తరువాత మహమ్మద్ బలగం క్రమంగా పెరిగింది. దానితో ఆయాత్లో కఠినత్వం, తీవ్రత కూడా పెరిగాయి. అయితే హిజ్రా తరువాత వచ్చిన ఈ ఆయాత్లు అన్నీ మదీనాలోనే లభించలేదు. కొన్ని మక్కాలో కూడా పొందాడు. ఇక జిహాద్ విషయానికి వస్తే మదీనా ఆయాత్లు మక్కా ఆయాత్లకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. ముస్లిమేతరుల పట్ల దయాదాక్షిణ్యాలు చూపవచ్చన్న మక్కా ఆయాత్లను మదీనా ఆయాత్లు పూర్తిగా తిరస్కరించాయి (ఖురాన్ 2-106, 13-39, 16-103). 4. 

4. ముసల్మాన్

అల్లాహ్కు దాసుడై ఆదేశాల్ని పూర్తిగా పాటించేవాడు, అతడికి పూర్తిగా తలవంచేవాడు. అల్లాహ్ ను మాత్రమే కొలిచేవాడు (ఇబాదత్) ముసల్మాన్ (ఖురాన్ 39-11, 12).. 

5. ముస్లిమ్

ఇది ముసల్మాన్కు సమానార్థక పదం. ఎల్లప్పుడూ అల్లా ఆజ్ఞల (అదుపు) లో ఉండేవాడు. అల్లా మార్గంలో నిరంతరంగా సంఘర్షణ చేసేవాడు. ఎల్లప్పుడూ అల్లా ప్రార్థన చేసేవాడు. జకాత్ చెల్లించేవాడు ముస్లిం. అల్లాయే ముస్లిముల సంరక్షకుడు (ఖురాన్ 22-78).

6. మోమిన్

ఇస్లాం మత విశ్వాసి, అల్లాహ్ మతాన్ని మాత్రమే విశ్వసించేవాడిని 'మోమిన్' అంటారు. ఇది ముస్లిం, ముసల్మాన్లకు సమానార్థకమైన పదం. ఖురాన్, హదీస్ లో ముస్లిం, ముసల్మాన్ అనే పదాలకు బదులు ఈ మోమిన్ అనే పదాన్ని అనేకచోట్ల ప్రయోగించడం కనిపిస్తుంది (డిక్షనరీ ఆఫ్ ఇస్లాం, టి.పి. హ్యూజ్, పుట. 419). ఖురాన్ అనువాదంలో మోమిన్ పదానికి 'విశ్వాసుడు' అని అనువదించారు. ఖురాన్ ప్రకారం విశ్వాసుడు అంటే కేవలం అల్లాహు మాత్రమే విశ్వసించేవాడని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇతర మతాలను నమ్మేవాడు ఇస్లాం ప్రకారం నాస్తికుడు. అతడిని కాఫిర్ లేదా ముష్రిక్ అంటారు. ఈ విషయం కల్మాను పరిశీలించినా స్పష్టమవుతుంది. అందులో 'అల్లాహ్ తప్ప మరో దేవుడు లేడు. మహమ్మద్ మాత్రమే ఆ దేవుడి ప్రవక్త' అని ఉంది. అల్లాహ్ తప్ప మరో దేవుడు లేనేలేనప్పుడు ఇస్లాం తప్ప మరో మతాన్ని నమ్మే అవకాశం కూడా ఉండదు. అలాగే ఏ ఇతర మతాన్ని స్వీకరించేందుకు అల్లాహ్ ఎవరికీ, ఎలాంటి అనుమతి ఇవ్వలేదని ఖురాన్ స్పష్టంగా చెప్పింది. (3-45) 

7. దీన్

దీన్ అంటే పంథా లేక సంప్రదాయం. ఖురాన్ ప్రకారం ఇస్లాం మాత్రమే అసలైన 'దీన్', మిగిలిన మతాలన్నీ బూటకం. ఇతర మతాల అనుయాయులంతా పాపులు. వారందరినీ నరకంలో కాల్చుతారు (16-20, 21, 32–13, 98-6).

8. గాజీ

ఇస్లాం వల్ల, ఇస్లాం కోసం నిరంతరం పోరాడేవాడిని గాజీ అంటారు. విధర్మీయుల హత్య చేసే నాయకుడు లేదా యోధుడు గాజీ. గాజీ గురించి ఇస్లాం ఇలా చెపుతోంది - 'అల్లాహ్ సంతోషం కోసం అల్లాహ్ మార్గంలో ఎవరు పోరాటానికి సిద్ధపడతాడో అతన్ని స్వయంగా దేవుడే మెచ్చుకుంటాడు. అతను పోరాటంలో చనిపోకుండా తిరిగి వస్తే దోపిడి సొమ్ముతోపాటు బహుమతిని కూడా తెచ్చుకుంటాడు. ఒకవేళ పోరాటంలో చనిపోతే స్వర్గమే బహుమతిగా పొందుతాడు' (నిష్కత్ - గ్రంథం - 17, ప్ర. 1), (ఇస్లాం శబ్దకోశం - టి.పి. హ్యూజ్ ).

ఎక్కడెక్కడ, ఎప్పుడెప్పుడు ముస్లిం శబ్దానికి బదులు గాజీ పదాన్ని ఉపయోగించారో అక్కడ అది ఎవరిని ఉద్దేశించి వాడారో వారు లేదా వారి పూర్వజులు జిహాద్లో పాల్గొన్నారని, ముస్లిమేతరులను వధించారని అర్థం చేసుకోవాలి.

9. షిర్క్

షిర్క్ అంటే అనేకమంది దేవతల్ని నమ్మడం అల్లాహ్ తోపాటు వారిని పూజించడం. (ఇస్లాం శబ్దకోశం - టి.పి.హ్యూజ్).

10. ముష్రిక్

ముష్రిక్ అంటే విగ్రహారాధకుడు. ఎవరు విగ్రహారాధన చేస్తారో, ప్రకృతిలోని ఏ రూపాన్ని లేదా తత్వాన్ని (అల్లాతోపాటు లేదా అల్లాహ్ కాకుండా) పూజిస్తారో వారు ముష్రిక్ అవుతారు. ఖురాన్ ప్రకారం ముష్రిక్ అతి నీచ ప్రాణి. అలాంటి వారికి రెండే మార్గాలు ఉన్నాయి. అవి - ఇస్లాంను స్వీకరించడం లేదా మృత్యువును అంగీకరించడం. టి.పి. హ్యూజ్ ప్రకారం ముస్లిములు నేడు ఈ ముష్రిక్ అనే పదాన్ని విగ్రహారాధకులతో పాటు క్రైస్తవులకు కూడా ఉపయోగిస్తున్నారు (ఇస్లాం శబ్దకోశం). 

11. ఖమ్స్

ఆస్తి (అది దోపిడి సొమ్ము కూడా కావచ్చు) లో 1/5 వంతు బైతుల్ మాబ్ లేక కోశాగారానికి (public treasury) జమచేసిన మొత్తం. (8-41)

12. జజియా

ఒకరకం పన్ను. ఇస్లాం రాజ్యంలో ముస్లిమేతరులు తమ అస్తిత్వాన్ని కాపాడు కునేందుకు, రక్షణ పొందేందుకు చెల్లించే పన్ను. కానీ బూటకపు సెక్యులరిస్టు చరిత్ర కారులు మాత్రం జజియా అంటే ఇస్లాం రాజ్యంలో హిందువులు తీర్థయాత్రలు చేయడానికి చెల్లించే మతపరమైన పన్ను అంటూ వక్రభాష్యం చెపుతారు. నిజానికి జజియా అంటే ఇస్లాం రాజ్యంలో ముస్లిమేతరులు ప్రాణాలు కాపాడుకునేందుకు (వివిధ అవమానాలు ఎలాగూ తప్పవు) ముస్లిం పాలకులకు కట్టే పన్ను. 

13. ఖరజ్

ముస్లిం రాజ్యంలో ముస్లిమేతరులు భూమిని కలిగి ఉండడానికి కట్టాల్సిన పన్ను ఇది. ముస్లిం పాలకులకు ఖరజ్ చెల్లిస్తే కాస్త భూమిని కలిగి ఉండే అనుమతి లభిస్తుంది. ఇది జజియాతోపాటు అదనంగా చెల్లించాల్సినది. ఖరజ్ చెల్లించలేకపోతే అలాంటి ముస్లిమేతరుల భూమి స్వాధీనం చేసుకోవడమేకాక వారిని శారీరిక హింసకు గురిచేసేవారు. జజియా మాదిరిగానే ఖరజ్ కూడా కేవలం ముస్లిమేతరుల నుంచే వసూలు చేసేవారు (హిదాయా ఖండం - 2).

14. దిమ్మీ లేదా జిమ్మీ

ఇది అరబ్బీ శబ్దం. ఎక్కువగా జిమ్మీ అనే ఉపయోగిస్తుంటారు. అరబ్ దేశాల్లో దీనిని ముస్లిమేతరులను (యూదులు, క్రైస్తవులు) ఉద్దేశించి ఉపయోగిస్తారు. జజియా, ఖరజ్ పన్నుల్ని చెల్లించిన ముస్లిమేతరులు ముస్లిం రాజ్యంలో జీవించడానికి అనుమతి  పొందుతారు. జమ్మీలు రెండవ తరగతి పౌరులుగా గడిపేవారు. వారికి ఎలాంటి హక్కులు ఉండవు. పైగా వీళ్ళు అనేక నిబంధనలు, ముస్లిం పాలకుల ఆజ్ఞలు  పాటించి తీరాలి.  భారత్లో పాలన ప్రారంభించిన ముస్లిం రాజులకు ఇక్కడ పెద్ద సంఖ్యలో ఉన్న హిందువుల్ని (ముష్రిక్లు) పూర్తిగా అణచివేయడం, చంపివేయడం, పూర్తిగా ఇస్లాంలోకి మార్చడం సాధ్యపడదని తెలిసింది. దీనితో హిందువులను ఆర్థికంగా చితికిపోయేట్లు చేసి వారిని జిమ్మీలుగా పరిగణించడం ప్రారంభించారు.

15. షహీద్ షహదత్

ముస్లిమేతరులతో పోరాడుతూ (జిహాద్) ప్రాణాలు కోల్పోవడం షహదత్. అలాంటి ముస్లిము షహీద్ అవుతాడు. షహీద్ ఉత్తముడైన ముస్లిం. అలాంటివాడికి స్వర్గంలో భగవంతుని దగ్గర స్థానం నిశ్చయమైపోతుంది. 

16. కాఫిర్

ఇస్లాం కాకుండా మరే ఇతర మతాన్నైనా అనుసరించేవాడు కాఫిర్ అవుతాడు.

17. మునాఫిక్

మునాఫిక్ అంటే మోసకారితనం. మహమ్మద్ కాలంలో పైకి ఇస్లాం పట్ల విశ్వాసాన్ని ప్రకటిస్తూ, ఇస్లాంను ప్రచారం చేస్తూ లోపల మాత్రం ఆ మతాన్ని నమ్మనివారికి ఈ పదం ఉపయోగించేవారు. ఆధునిక కాలంలో కూడా ఖురాన్ ఆదేశాలకు వ్యతిరేకంగా ఇతర మత విశ్వాసాలను కలిగినవారిని మునాఫిక్ అంటున్నారు. ఇస్లాం ఆక్రమణ, హింసను విశ్వసించదని, అది ఇతర మతాలను గౌరవిస్తుందని కొందరు ముస్లిం పండితులు చెపుతూ ఉంటారు. కానీ వారి వాదనకు, ఖురాన్ చెప్పే విషయాలకు అసలు పొంతనే లేదు. ఖురాన్ 3-85 ప్రకారం అల్లా ఇచ్చిన ఇస్లాం తప్పించి మిగతా ఏ మతాన్ని అనుసరించరాదు. అలాగే 6–19 ప్రకారం అల్లా ఇతర మతాలపై విజయం సాధించేందుకే మహమ్మద్ను పంపాడు. దీనినిబట్టి ఇస్లాం ఇతర మతాలను గౌరవిస్తుందని, సహనం వహిస్తుందని భావించే ముస్లిము ముస్లిం కాకుండాపోతాడు. పైగా మునాఫిక్ అవుతాడని అర్థమవుతుంది. జిహాద్లో పాల్గొనడానికి నిరాకరించే ముస్లిం కూడా మునాఫికే అవుతాడు, అతనికి కాఫిర్లకు విధించే శిక్షే వర్తిస్తుంది. ఈ విషయాన్ని ఖురాన్ పదేపదే పేర్కొంది. 

18. ముత్రాద్

మతం మారడాన్ని ముత్రాద్ అంటారు. ఎవరైనా ముస్లిం ఇతర మతాన్ని విశ్వసించినా, ఆ మతాన్ని పుచ్చుకున్నా అది ముత్రాద్ అవుతుంది. అలాంటివాడిని చంపివేస్తారు. ఎందుకు? ఇస్లాంను వదిలి మరో మతాన్ని పుచ్చుకున్న నేరం చేసినందుకు. ఇస్లాం ఇతర మతాలకు చెందినవారిని బలవంతంగానైనా మతం మార్చవచ్చును కానీ ముస్లిములు మాత్రం ఇస్లాం తప్ప మరే ఇతర మతాన్ని అనుసరించడం గానీ, కనీసం మెచ్చుకోవడం గానీ చేయడానికి వీలులేదు.

19. ఉమ్మా లేదా మిల్లత్

ఉమ్మా అంటే ప్రపంచవ్యాప్త ముస్లిం సముదాయం. ప్రపంచంలో ముస్లిములదే ఏకైక జాతి. దీనినే ఉమ్మా అంటారు. దీనికే మిల్లత్ అని కూడా పేరు. ఈ ఉమ్మా మరే ఇతర జాతీయత, భాష, ఇతర సరిహద్దుల్ని అంగీకరించదు. ఇస్లాం ప్రకారం ప్రపంచం మొత్తంలో కేవలం రెండు జాతులు మాత్రమే ఉన్నాయి. ఒకటి, అల్లాను అంగీకరించే జాతి. మరొకటి, ఇతర దేవతల్ని పూజించే జాతి. ఒక దేశంలో ఉండే ముస్లిం తన దేశంలోని ముస్లిమేతరులను కాకుండా ఇతర దేశాల్లోని ముస్లిములతో, ఆఖరుకు శతృదేశంలోని ముస్లిములతో కూడా సహోదరత్వాన్ని పాటిస్తాడు. తన దేశంలోని ముస్లిమేతరులతో మాత్రం విరోధం పాటిస్తాడు. ఇది ఇది ఖురాను ఆదేశం. 

20. ఖలీఫా

ఇస్లాం ఉమ్మాకు చెందిన అత్యున్నత మతపరమైన, పాలనాపరమైన నాయకుడినే ఖలీఫా అంటారు.

21. జిహాద్

ముస్లిమేతరులలో ఇస్లాం మత వ్యాప్తి, దోపిడి కోసం ముస్లిమేతరులపై నిరంతర యుద్ధం చేయడం జిహాద్.

22. ముజాహిద్

ముస్లిమేతరులకు వ్యతిరేకంగా, వారిని నాశనం చేయడం కోసం జరిగే యుద్ధంలో సైనికుడిగా పాల్గొనేవాడు (మరింత సమాచారం కోసం ఆరవ అధ్యాయం చూడండి). 

23. అన్సార్

 ప్రవక్త మహమ్మద్ మక్కా నుండి మదీనాకు వెళ్ళినప్పుడు (హిజ్రా) ఆయనతోపాటు వెళ్ళి, సేవలు చేసినవారు. కానీ ఇప్పుడు అన్సార్ అంటే జిహాద్ సాగిస్తున్న ముస్లిములకు సహాయపడేవారు, వారికి సేవ చేసేవారని అర్థం. దేశవిభజన సమయంలో ముస్లింలీగ్ భారత్ వైపుకు వస్తున్న హిందువుల నుండి విలువైన వస్తువుల్ని దోచుకునే పనిని అన్సారీలకు అప్పచెప్పింది. ఈ అన్సారీలు చాలామంది హిందూ స్త్రీలను అపహరించారు కూడా. 

24. మాల్ ఎ గనీమత్ (ఘనీమా)

యుద్ధంలో ముస్లిమేతరుల నుంచి దోచుకున్న సొత్తు. ఇలా దోచుకున్న సొత్తులో 1/5 వంతు దోపిడీదారుల నాయకుడికి చెందుతుంది. మిగతాది దోపిడీదారులు పంచుకుంటారు. దోపిడీ సొత్తులో డబ్బు, విలువైన వస్తువులేకాదు, పశువులు, ఆఖరుకు ముస్లిమేతర స్త్రీలు కూడా ఉంటారు. 

25. హదీస్

మహమ్మద్ ప్రవక్త పేర్కొన్న విధులన్నీ హదీస్ లో ఉంటాయి. ముస్లిములకు ఖురాన్ తరువాత హదీస్ కూడా చాలా ముఖ్యమైనది.

26. షరియా

సంపూర్ణ ఇస్లాం చట్టమే షరియా. ఖురాన్ తోపాటు మహమ్మద్ సంప్రదాయ సందేశాలను కలిపి షరియా అంటారు. ఇది ముస్లింల మతచట్టం.

27. జన్నత్ (స్వర్గం)

దీనినే అల్-జన్నాహ్ (ఉద్యానవనం) అని అంటారు. ఖురాన్లో ఎనిమిది స్వర్గాల ప్రస్తావన ఉంది. అవి వివిధ దశలలో లభ్యమవుతాయి. జన్నత్ సకల శారీరిక భోగాలు లభిస్తాయి.

28. అమన్ (శాంతి)

జజియా లేదా పన్ను చెల్లించేవారికి ముస్లిం ఆక్రమణదారు ఇచ్చే రక్షణ, భద్రత. 

29. అజాన్ (ప్రకటన)

నమాజ్ (ప్రార్థన) కోసం మువాజిన్ (అరిచి పిలిచేవాడు) ఇచ్చే పిలుపు. మసీదు పక్కనుండి లేదా ద్వారం నుండి లేదా పెద్ద మసీదుల్లో మీనార్ నుండి ఈ అజాన్ వినిపిస్తారు. ఈ అజాన్ అర్థం సంక్షిప్తంగా - "అల్లాహ్ (దేవుడు) అత్యంత గొప్పవాడు. ఈ దేవుడు తప్ప మరో దేవుడు లేడని నేను పేర్కొంటున్నాను. మహమ్మద్ ఆ దేవుని దూత అని పేర్కొంటున్నాను. నమాజుకు రండి. మోక్షానికి రండి. దేవుడు అత్యంత గొప్పవాడు. ఈ దేవుడుతప్ప మరొక దేవుడు లేడు”. తెల్లవారుఝామున చేసే నమాజ్కు ఇచ్చే అజాన్ (పిలువు) లో 'నమాజ్ నిద్రకంటే మంచిది' అనే వాక్యం కూడా ఉంటుంది. అజాన్ వినిపించిన వెంటనే ముస్లింలు ఎక్కడున్నా వెంటనే నమాజ్ కోసం మసీదువైపు రావాలి. అలాగే అజాన్ వింటున్నప్పుడు ప్రతి వాక్యాన్ని తాము కూడా చెప్పాలి. అజాను అత్యంత శ్రద్ధగా వినాలి. అజాన్ను తాగుబోతులు, పిచ్చివాళ్ళు, స్త్రీలు ఇవ్వడానికి వీలులేదు. 

30. రజ్ (రాళ్ళతో కొట్టి చంపడం)

అక్రమ సంబంధాలు పెట్టుకున్న మహిళలకు విధించే శిక్ష, నేరం ఋజువైతే మహిళను చుట్టూ చేరి రాళ్ళతో కొట్టి చంపుతారు. కొన్ని సందర్భాల్లో రాళ్ళతో కొట్టి చంపకుండా వంద కొరడా దెబ్బలు కూడా విధించవచ్చును. అయితే అక్రమసంబంధం కలిగిన పురుషులకు మాత్రం వంద కొరడా దెబ్బలు మాత్రమే శిక్ష అని మహమ్మద్ తీర్పునిచ్చాడు.

31. సున్నహ్

'ఒక మార్గం, దారి, జీవనపద్ధతి. ' మహమ్మద్ చెప్పినది లేదా చేసిన చూపిన విషయాలే ముస్లిం జీవనపద్ధతి లేదా సున్నాహ్. సంప్రదాయ చట్టాన్ని 1) సున్నాతుల్ ఫిల్ - మహమ్మద్ చేసిన పనులు, 2) సున్నాతుల్ కుల్ - మహమ్మద్ అంగీకరించినవి, 3) సున్నతుల్ తక్ర్ - మహమ్మద్ అంగీకారం కలిగి ఆయన సమక్షంలో చెప్పినవి, చేసినవి.

32. ఖిన్ ర్ (బహువచనం - ఖనాజర్)

పంది మాంసం ముస్లింలకు నిషిద్ధమని ఖురాన్లో సురాలు ii 168, v4, vi 146, xvi 116 లలో చెప్పబడింది.

33. తకియా

'స్వీయ రక్షణ'. ఇది షియాలు పాటించే పద్ధతి. తన మత ప్రత్యేకతలను కాపాడుకునేందుకు షియా ముస్లిం ఎలాంటి పద్ధతినైనా అనుసరించవచ్చును. వివక్షను, అణచివేతను తప్పించుకునేందుకు సున్నీలమని చెప్పుకోవచ్చును.

తకియాకు సమానమైన పద్ధతి సున్నీలలో ముదారత్. మతాన్ని రక్షించుకునేందుకు అబద్ధం చెప్పవచ్చును.

34. తవారియా

ఒక విషయాన్ని ఎలాగైనా వ్యాఖ్యానించి, మార్చుకునే విధంగా చెప్పడం. దీనివల్ల 'అబద్ధం' చెప్పినట్లు నిరూపించే వీలు ఉండదు.

No comments:

Post a Comment