Thursday, January 5, 2023

****మన ఆరోగ్యం…! #ఇండియన్_టాయిలెట్స్ ! ➖➖➖✍️

 Xx9. X.   2-9.   010123-8.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*మన ఆరోగ్యం…!


       #ఇండియన్_టాయిలెట్స్ !
                 ➖➖➖✍️

మనం ఉపయోగించే టాయిలెట్స్ లో నిజంగా ఏవి మంచివో ఎందుకు మంచివో తెలుసుకుందాం.

“అమ్మ నాన్న” అని పిలిపించుకోవడం చిన్నతనం.. 
“మమ్మీ డాడీ”  అనిపించుకుని మురిసిపోతాము..
కట్టుబొట్టుకి ఫ్యాషన్ పేరుతో ఎప్పుడో తెలుగుతనానికి తిలోదికాలిచ్చేశాము...
కేక్ కటింగ్ అంటూ పుట్టినరోజే దీపాలు ఆర్పేస్తున్నాము..

ఆరోగ్యకమైన ఊతప్పం, పుల్లరొట్టెలు, దిబ్బరొట్టెలు ఎపుడో వదిలేశాము... రోగాలు తెచ్చిపెట్టే మైదాపిండితో చేసే…. ఆ దరిద్రగొట్టు పిజ్జాని పదిలంగా తెప్పించుకుని ఆవురావురుమంటూ లాగిస్తున్నాము.

వీకెండ్లు...vఅంటూ అన్ని అనారోగ్యకరమైన పనులకూ అలవాటు పడ్డాము.

చల్ల మజ్జిగ...కొబ్బరినీళ్లు చులకన.!
టీ కాఫీ.. కూల్ డ్రింక్స్ కి బానిసలు అయిపోయాము.

పప్పు ఉండలు... నువ్వు జీడీలు.. ఎపుడో అటకెక్కాయి.

బుడిబుడి అడుగులు వేసే చిన్నారుల చేతుల్లో కూడా పరమ పరమ పరమ నీచాతి నీచమైన ఎంతో అనారోగ్యకరమైన లేస్.. స్ప్రైట్ లు  తెచ్చేస్తున్నాం.

హాయిగా వుండే మండువా ఇల్లు.. రెండు గదుల ఇరుకుపెట్టె అయ్యింది.

ఇంటికి ఆవల ఉండే మరుగుదొడ్డి ఇంట్లో పెట్టుకుని, దానికి కెమికల్ సెంటులు కొడుతూ కంపు కనిపించకుండా అవి తెగపీల్చుకుంటూ మహా బుద్దిహీనంగా బతికేస్తున్నాం.

ఇదంతా ఏదో పాశ్చాత్యపు పైత్యం అనుకుందాం... అభివృద్ధి అనుకుందాం.. మార్పు సహజం అనుకుందాం.. మంచిని అరువు తెచ్చుకోవడంలో తప్పులేదు కానీ మరీ ప్రతిదీ విదేశీ తరహా ఉండాలంటారా.. 
చివరకు మనం వాడే మరుగుదొడ్డితో సహా..? 

పిచ్చి పలు రకాలు.. 
వెర్రి వేయి విధాలు...
విదేశీయులు మన దేశ అమూల్య సంపదలైన యోగ.. ధ్యానం నేర్చుకుని చక్కగా ఆరోగ్యాలు కాపాడుకుంటుంటే మనం వాళ్ళ దగ్గర ఉన్న చెత్త అంతా నెత్తికి ఎక్కించుకుంటున్నాము. 

చివరకు మన పిచ్చి ఎంతలా ముదిరింది అంటే... అన్నీ విదేశీ తరహాలో ఉండాలి అనుకునేంతలా.

మన పిల్లలకి ఇండియన్ టాయిలెట్ అంటే తెలియనంతలా.

మీరు వెళ్లిన  ప్రతీ ఇంట్లో గమనించండి... రెండు లేదా మూడు బాత్రూములు ఉన్నా అన్నీ వెస్ట్రన్ వే! రెండో మూడో టాయిలెట్స్ ఉన్నప్పుడు ఒక ఇండియన్ టాయిలెట్ అయినా ఉంచుకోవడం ఈరోజుల్లో చిన్నతనం అయిపోయింది. 

చివరకు పల్లెటూర్లలో సైతం ఈ జాడ్యం విస్తరించింది. విదేశాల్లో ఉండే మన వాళ్ళు ఇండియన్ టాయిలెట్ ఉన్న ఇల్లు దొరికితే బావుండు అని వెతుక్కుంటూ ఉంటారు. 

ఇక్కడ స్వదేశంలో కూడా చివరకు ఆ దుస్థితి దాపురించింది. 

మన బానిసత్వపు అలవాట్లూ.. ఎంతవరకూ వెళ్ళాయంటే అవి మన రక్తంలో మన ఎముకల మూలుగలోకి కూడా వెళ్ళిపోయాయి.  

వెస్ట్రన్ టాయిలెట్ ఉంటే మనం గొప్ప ధనవంతులం.. లేదా గొప్ప జ్ఞానవంతులం అనా..? 

ఇండియన్ టాయిలెట్ ఉంటే పల్లెటూరు మొద్దులం అని అనుకుంటారు అనా..? 

లేక మార్కెట్లో ఇండియన్ టాయిలెట్స్ దొరకడం లేదా? ఎందుకు మనకు ఈ పిచ్చి?? 

వెస్ట్రన్ టాయిలెట్స్ అవసరమే..! 

 ఎవరికి..? 
ముసలి వారికి.. మోకాళ్ళ నొప్పులు.. ఇతర రోగాలు ఉన్నవాళ్ళకి...! 
అలాంటి వారు మాత్రమే వాడుకుంటే సరిపోతుంది. 

మరీ చిన్న పిల్లల దగ్గర నుండీ అందరూ ఉపయోగించి లేనిపోని అనారోగ్య సమస్యలు తెచ్చుకోవడం ముందుగానే రోగాలు తెచ్చుకుని ముసలివాళ్ళవ్వడం అవసరం అంటారా?

ఇండియన్ టాయిలెట్ అని పిలుచుకునే మన మరుగుదొడ్డిని #Squat #Toilet అంటారు.

ఈ విధమైన టాయిలెట్ ఒక్క ఇండియాలో కాకుండా చాలా ఆసియా, ఆఫ్రికన్ దేశాల్లో ఉపయోగిస్తారు.

దీనిపైన squatting భంగిమలో కూర్చుంటారు కాబట్టి ఆ పేరు వచ్చింది. యోగా భాషలో ఈ squatting భంగిమను ‘మలాసన’ అంటారు. ఆంగ్లములో Garland Pose అంటారు. 

యోగాలో ప్రతీ ఆరోగ్య సమస్యకి సమాధానం ఉంటుంది. ప్రతి ఆసనానికి పలు ప్రయోజనాలు వున్నాయి. వుంటాయి.

ఈ ఆసనం యొక్క ఉపయోగాలు చూద్దాము…
1. పొట్ట కండరాల మీద ఒత్తిడి తీసుకుని వస్తుంది. ప్రేగులో ఉన్న వ్యర్ధాలని పూర్తిగా విసర్జించడానికి ఉపయోగపడుతుంది. 
ఈ ‘మలాసన’ భంగిమ రోజూ వేయడం ద్వారా పెద్ద ప్రేగులో ఏ చెత్త ఉన్నా బయటకు నెట్టివేయబడుతుంది. ఈ విధంగా పెద్ద ప్రేగుకి కాన్సర్ రాకుండా నివారించవచ్చు.

2. పొత్తి కడుపు కండరాలలో రక్తప్రసరణ బాగా జరిగేలా చేస్తుంది.

3. ప్రతి రోజూ ఈ ఆసనం వేయడం గర్భిణీ స్త్రీలకు సుఖ ప్రసవం జరగడానికి సహాయం చేస్తుంది. 

4. మలబద్ధకాన్ని నివారిస్తుంది.

5. కడుపులో పేరుకుని ఉన్న చెడు వాయువులని బయటకు పంపుతుంది.

6. తొడలు, మోకాళ్ళ యొక్క పనితీరుని మెరుగు పరుస్తుంది. వెన్ను నొప్పి, సయాటికా నొప్పులు, మోకాళ్ళ నొప్పులు రాకుండా నివారిస్తుంది.

7. ఊబకాయం, గర్భాశయ సమస్యలు రాకుండా నివారిస్తుంది.

ఒకసారి మన ఇండియన్ టాయిలెట్స్ ఉపయోగాలు ఒకసారి చూద్దాం...

1. భారతీయ మరుగుదొడ్లు శాస్త్రీయంగా రూపొందించబడ్డాయి.  
మన పూర్వీకులు ఇలా సహజ స్థితిలో కూర్చోవడం వల్ల పేగుల్లో పేరుకుపోయే వ్యర్ధాలు పూర్తిగా తొలిగిపోతాయని భావించారు. 
ఇండియన్ టాయిలెట్స్ ను ఇల్లుకట్టుకునే సమయంలో  తాపీ మేస్త్రీ లు వాటిని బిగించే ముందు మీరు దగ్గరే వుండండి. వాటిని స్లోప్ గా పెడుతున్నారు అలా స్లోప్ గా పెట్టవలసిన అవసరం ఇండియన్ టాయిలెట్స్ కి లేనే లేదు. ఎందుకంటే కిందబేసిన సహజంగానే ఎంతో స్లోప్ గా వుంటుంది. నీరు పోవడానికి ఎక్కువగా వీలు వుంటుందని వాళ్ళు స్లోప్ గా పెట్టాలని మనకు చెప్తారు. కానీ సహజంగానే ఆ స్లోప్ వుండడం వల్ల అది అవసరమే లేదు. అలా పెట్టడం వల్ల కాసేపు అయ్యేసరికి వెనక్కి పడిపోతామేమో అనే భయం వేస్తుంది. అది మలమూత్ర విసర్జన సరిగ్గా చేసుకోలేకపోవడం జరుగుతుంది. 
కనక పొరపాటున కూడా వెనక్కి వాలేటట్టుగా లేకుండా సరిగ్గా సమతలంగా వుండేట్టు చూసుకుని కట్టించుకోండి. ఒక వేళ అలా వెనక్కి స్లోప్ గా ఇప్పటికే వుంటే వాటిని తప్పని సరిగా సరిచేయించుకోండి.

2. భారతీయ మరుగుదొడ్డి పాశ్చాత్య మరుగుదొడ్డి కంటే చాలా శుభ్రంగా ఉంటుంది. సూక్ష్మక్రిములు తక్కువ దాగి ఉంటాయి. 

మన శరీరం టాయిలెట్ సీటును తాకదు కాబట్టి యుటిఐ (Urinary Tract Infections), మరే ఇతర అంటువ్యాధులు రాకుండా నివారిస్తుంది. 

3. భారతీయ మరుగుదొడ్డి  మోకాళ్ళు, చీలమండల సామర్థ్యం పెంచుతుంది. వెస్ట్రన్ టాయిలెట్స్ చిన్నప్పటి నుండే వాడుతుంటే చిన్న వయసులోనే మోకాళ్ళ నొప్పులు కొని తెచ్చుకున్నట్లే..

4.  భారతీయ మరుగుదొడ్డి ప్రేగు కదలికపై ఒత్తిడిని కలిగిస్తుంది. జీర్ణక్రియ ప్రక్రియ మెరుగుపడుతుంది. వ్యర్ధాలు పూర్తిగా తొలగించబడతాయి. పాశ్చాత్య మరుగుదొడ్డి స్థితిలో ఇది జరగదు.

5. భారతీయ మరుగుదొడ్డి తక్కువ నీటిని ఉపయోగిస్తుంది. దీనిని శుభ్రం చేయడం తేలిక. శుభ్రం చేయడానికి కూడా తక్కువ నీరు ఉపయోగిస్తుంది. 

6. పాశ్చాత్య మరుగుదొడ్డిలో ప్రజలు బోలెడంత టాయిలెట్ పేపర్‌ను ఉపయోగిస్తున్నారు. మన వాటికి నీరు ఉంటే చాలు. 

7. మలబద్దకం నిరోధిస్తుంది. పెద్దప్రేగు క్యాన్సర్‌ను నివారిస్తుంది:  అపెండిసైటిస్, మలబద్ధకం, ప్రేగు వ్యాధి మరియు అనేక ఇతర కడుపు సమస్యల అవకాశాలను కూడా తగ్గిస్తుంది.

8. గర్భాశయంపై ఎటువంటి ఒత్తిడి చేయనందున భారతీయ మరుగుదొడ్లు గర్భిణీ స్త్రీలకు ఉత్తమమైనవి. ఇది గర్భిణీ స్త్రీలను సహజ ప్రసవానికి సిద్ధం చేస్తుంది.

9. చిన్న పిల్లలు కూడా భారతీయ మరుగుదొడ్డిని ఎటువంటి మద్దతు లేకుండా సులభంగా ఉపయోగించుకోవచ్చు. వెస్ట్రన్ టాయిలెట్ కి వేరుగా సీట్ కొనుక్కోవాలి.

10. ఒకరు వాడాక మరొకరు వాడుకోవడం సులభం.

11. భారతీయ మరుగుదొడ్లు పర్యావరణ అనుకూలమైనవి.

12. భారతీయ మరుగుదొడ్ల ఖరీదు చాలా తక్కువ.

13. భారతీయ మరుగుదొడ్లు మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. కచ్చితంగా భారతీయ మరుగుదొడ్డి వాడడం ఒక తెలివైన ఉత్తమమైన పద్ధతి.

14. మన టాయిలెట్లలో కూర్చుని వున్నప్పుడు ఎక్కడా ఒకరి కాళ్ళు తొడలు తాకిన చోట మరొకరివి తగలవు. అంటే వారికి వుండే గజ్జీ తామర వంటి ఎలాంటి చర్మవ్యాధులూ మనకు అంటుకునే అవకాశం కూడా లేదు. 

15. ఇతరులు మూత్రం పోసిన చోట మనం కూర్చోవాల్సిన పనే లేదు. 
వారి మూత్రం మనకు అంటించుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. 

16. #Squat #Toilet అదే ఇండియన్ టాయిలెట్స్ ని ఎవ్వరైనా ఉపయోగించుకున్నా మనకు ఎలాంటి ఇబ్బంది రాదు. ఎలాంటి అంటువ్యాధులూ, వాళ్ళ దురదలూ మనకు వచ్చే అవకాశం లేదు.
అదే వెస్ట్రన్ టాయిలెట్స్ ఉపయోగిస్తే...? హమ్మయ్యా మీకు అర్థమైంది కదా..! అందుకే మరోసారి వివరించడం లేదు.  

17. కనక మీ ఆరోగ్యం బాగుండాలంటే చక్కగా కింద కూర్చోవడానికి వీలుగా వుండే ఇండియన్ టాయిలెట్స్ #Squat #Toilet లను ఉపయోగించండి. 
ఆరోగ్య సమస్యలు బోలెడంత డబ్బులు పోసి జబ్బులు కొని తెచ్చుకోవాలంటే, అనేక రోగాలతో తొందరగా శరీరాలు నలగ్గొట్టుకుని ముసలోళ్ళైపోవాలనుకుంటే వెస్ట్రన్ టాయిలెట్స్ ఉపయోగించండి. 

ఏం చేస్తాం కొంతమంది వుంటారు ఎన్ని చెప్పినా ఎంత చింతపండు ఎంత సబీనా వేసి తోమినా మొండిగా బండ బండగా వాదిస్తూనే వుంటారు. వారికి సహస్రనమస్కారాలు పెట్టేసి ఊరుకుందాం.✍️
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
                     ➖▪️➖

No comments:

Post a Comment