Wednesday, January 18, 2023

శ్రీరమణీయం: మనోశుద్ధి సిద్ధించే మార్గం ఏమిటి ?

 💖💖💖
       💖💖 *"442"* 💖💖
💖💖 *"శ్రీరమణీయం"* 💖💖
     
*"మనోశుద్ధి సిద్ధించే మార్గం ఏమిటి ?"*

*"ఆధ్యాత్మికతలో శుచి, శుభ్రత అవసరం. శుచి అంటే మానసిక పవిత్రత. శుభ్రత అంటే శారీరక పవిత్రత. ఏదో ఒక ఆలోచన ఎప్పుడూ తప్పదు. అయితే అప్పటికి అవసరంలేని ఆలోచన చేస్తున్న పనికి ఆటంకం అవుతుంది. శ్రద్ధ లోపించి పని చెడుతుంది. ఒక ఆలోచన ఆపినా మరోక ఆలోచన సిద్ధంగా ఉంటుంది. అందుకే ఎదురుగా ఇప్పుడు చేస్తున్న పనికి సంబంధించిన ఆలోచననే చేయటం అలవాటు చేసుకుంటే మనస్సు శుద్ధి అవుతుంది. ఎప్పటికప్పుడు అప్పటికి అవసరమైన ఆలోచనలోనే ఉంటే పని ఫలవంతమైన శాంతి లభిస్తుంది !"*_

*"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}*
            

No comments:

Post a Comment