Tuesday, February 28, 2023

13. ఆత్మ జ్ఞానం, మోక్షమార్గం

 🙏🕉🙏                    ...... *"శ్రీ"*

                 🔥 *"13"* 🔥
   🔥🔥 *"ఆత్మ జ్ఞానం"* 🔥🔥
   🔥🔥 *"మోక్షమార్గం"* 🔥🔥
     💖🔥💖🔥💖🔥💖
           💖🔥🕉🔥💖
                 💖🔥💖
                       💖
*"ఆత్మ జ్ఞానం 🔥 మోక్ష మార్గం 🔥 సృష్టి రహస్యం 🔥 ఏడు జన్మలు ఏమిటి ? 🔥 నేను అంటే ఎవరు ? 🔥 దుఃఖం ఎలా తొలగుతుంది ? 🔥 జ్ఞాన విచారణ 🔥 మానవుడు జిజ్ఞాసతో అన్వేషిస్తున్న ఎన్నో సందేహాలకు సమాధానాలు 🔥"*

*"మరి ఈ శరీరంలోనే ఉంటూ ఈ అనుభవాలు అన్నీ పొందే “నేను” అనే ఆకారం లేని చైతన్య స్వరూపుడు  ఇందులోకి ఎక్కడి నుంచి వచ్చాడు?"* 

*"పదార్దాల నుంచి పదార్దాలు ఏర్పడడం సహజం."* 

*"కానీ ఆహారం నుంచి తయారయిన ఈ శరీరంలోకి “నేను” అనే ఆకారం లేని “చైతన్య స్వరూపుడు” ఎక్కడి నుంచి వచ్చి ఇందులో ప్రవేశించాడు."* 

*"ఇది తీపి, ఇది చేదు, ఇది ఇష్టం, ఇది కష్టం అని అనేకానేక అనుభవాలు పొందుతున్న ఇందులోని చైతన్య స్వరూపుడికి కారణం ఎవరు?"*

*"ఈ ప్రశ్నకు సూటి అయిన సమాదానం ఏంటంటే!"* 

*"శరీరాలన్నీ కేవలం భ్రమ."*

*"ఇవి ఏ సమయంలోనూ ఉన్నవి కాదు అని. ‘చైతన్యమే’ శరీరాలను కల్పన చేసుకుని అవి తనకంటే వేరుగా ఉన్నట్లుగా భావిస్తూ తనే వాటిని బాహ్యంలో దర్సిస్తోంది తప్ప ఈ శరీరాలన్నీ వున్నవి కాదు."*

*"ఉన్నది ఏకైక నిరాకార చైతన్యమే."* 

*"అయితే చైతన్యం అలా ఎందుకు చేస్తోంది అనేదానికి సమాదానం లేదు."* 

*"జబ్బు వచ్చాక దాన్ని తొలగించుకోవడమే తక్షణ కర్తవ్యంగాని అసలు జబ్బు ఎందుకు వచ్చింది?"* 

*"ఎక్కడ వచ్చింది?"*

*"ఏమి తింటే వచ్చింది?"* 

*"అని తర్కించుకుంటూ కూర్చుంటే ఏం ప్రయోజనం."*  

*"రోగం తీవ్రత పెరిగి రోగి మరణిస్తాడు."*

*"కాబట్టి రోగం ఎలాగయినా రానీ రోగం ఉందని తెలిసాక ముందు రోగాన్ని నయం చేసుకోవడమే అత్యవసరం."*

*"అలాగే అజ్ఞానం చేత ఆత్మ ఎలా శరీరాన్ని కల్పించుకుని మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అనే నాలుగు రూపాలుగా మారి సుఖ దుఃఖాల కల్పనలో పాల్గొంటోంది అనేది ఒకసారి పరిశీలిద్దాం."*

*"మనస్సు మననం చేస్తుంది."* 

*"బుద్ధి నిర్ణయం తీసికుంటుంది."* 

*"చిత్తం ఈ తతంగాన్నంతా తనలో నిల్వ చేసుకుంటుంది."*

*"ఈ శరీరమే నేను అని నమ్మడమే అహం యొక్క లక్షణం."*

*"ఒక అందమయిన స్త్రీ ని ఒక వ్యక్తి యొక్క మనస్సు కంటి చూపు ద్వారా చూసినప్పుడు ఆహా ఏమీ ఆ స్త్రీ అందం, ఎంత చక్కటి శరీరం అని భావన చేస్తుంది."* 

*"అప్పుడు ఆ స్త్రీ తన కంటి ముందు నుంచి వెళ్ళిపోతూ కనుమరుగగుచున్నప్పుడు అతడి మనస్సు తను భావించిన తన కోరికను బుద్ధిలోకి పంపిస్తుంది."* 

*"బుద్ధి అప్పటికప్పుడు తక్షణం ఏమి చెయ్యాలో సంకేతం ఇస్తుంది."* 

*"అప్పుడు మనస్సు బుద్ధి చెప్పిన ప్రకారం నడిచి వెళుతున్న ఆ స్త్రీ వెనుకే తనూ నడుస్తుంది."*

*"కొంచెం దూరం వరకు వెళ్ళిన ఆ స్త్రీ ఒకచోట బైక్ పై కూర్చుని తనకోసం ఎదురు చూస్తున్న ఒక యువకుని వద్ద ఆగి అతడి వెనకాల అదే బైక్ మీద కూర్చుని రయ్ మని వెళ్ళిపోతుంది."* 

*"ఆ స్త్రీని వెనుక అనుసరిస్తూ వస్తున్న వ్యక్తి మనస్సు తన ఎదురుగా జరిగిన ఆ సంఘటన మొత్తాన్ని ఉసూరుమంటూ చూసి ఇక తనేం చెయ్యాలో తెలీక మళ్ళీ బుద్ధిలోకి పంపిస్తుంది."* 

*"బుద్ధి వెంటనే ‘వెనక్కు వచ్చేయ్’ అని సంకేతం ఇస్తుంది."* 

*"మనస్సు ఇక చేసేదేమీలేక వెనక్కు వచ్చేస్తుంది."* 

*"కొంచెం సమయం పాటు మనస్సు దుఃఖిస్తూ దుఃఖస్థితిలో వుంటుంది."* 

*"ఆ తర్వాత జరిగినదంతా మరచిపోయి వేరే పనిలో తన దృష్టిని పెడుతుంది."*

*"అయితే ఏదయితే ఒక అనుభవం మనస్సు బుద్ధి మూలంగా లోన రూపు దిద్దుకునిందో అదంతా అతడి “చిత్తం” అనే చోటుకి వెళ్లి నిల్వ ఉండిపోతుంది."* 

*"మనసుపెట్టి ఏదయితే చేస్తామో ఆ ప్రతిదీ చిత్తంలోకి వెళ్లి నిల్వ ఉండిపోతుంది."*

*"ఈ చిత్తమే జన్మలు, దేహాలు, లోకాలు అనే భ్రమలకు మూల వస్తువు."*

*"ఈ చిత్తాన్ని నాశనం చేస్తేనే మానవునికి ముక్తి."* 

*"శరీర నాశనంతో ఏదీ నాశనమవదు."* 

*"చిత్త నాశనమే సర్వ దుఃఖ నాశనం. అదే ముక్తి."*

*"మరి చిత్తాన్ని ఎలా నాశనం చెయ్యాలి అంటే మానవుడు తన మనసులో ఏ విషయాలూ భావించకూడదు."* 

*"మనస్సులోకి విషయాలు రానివ్వకూడదు."*

*"మనస్సును నిశ్చలంగా నిర్విషయ స్థితిలో నిరంతరం నిలుపి ఉంచుకోవడం సాధన చెయ్యాలి."* 

*"చిత్తంలో వున్న పాత విషయాలను ఈ మనస్సు అప్పుడప్పుడు వెనక్కు తీసికుని మననం చేస్తూ వుంటుంది."* 

*"వీటినే జ్ఞాపకాలు అని కూడా అంటాం."*
            💖🔥💖🔥💖
                  💖🕉️💖
        

No comments:

Post a Comment