🙏🕉🙏 ...... *"శ్రీ"*
🔥 *"18"* 🔥
🔥🔥 *"ఆత్మ జ్ఞానం"* 🔥🔥
🔥🔥 *"మోక్షమార్గం"* 🔥🔥
💖🔥💖🔥💖🔥💖
💖🔥🕉🔥💖
💖🔥💖
💖
*"ఆత్మ జ్ఞానం ౹ మోక్ష మార్గం ౹ సృష్టి రహస్యం ౹ ఏడు జన్మలు ఏమిటి ? ౹ నేను అంటే ఎవరు ? ౹ దుఃఖం ఎలా తొలగుతుంది ? ౹ జ్ఞాన విచారణ ౹ మానవుడు జిజ్ఞాసతో అన్వేషిస్తున్న ఎన్నో సందేహాలకు సమాధానాలు ౹"*
*"శ్రీవేద వ్యాస మహర్షి రచించిన మహాభారతకథలో పాండు మహారాజు తాను ఎప్పుడయినా ఏ స్త్రీనయినా కామంతో ముట్టుకుంటే ఆ క్షణంలోనే తను అక్కడే మరణిస్తాననే ఒక ముని శాపం తనకు ఉందని తెలిసిఉన్నా ఒకరోజు తనలో చెలరేగుతున్న కామాన్ని అదుపుచెయ్యలేని వివశతకు లోనయ్యి తన భార్య అయిన మాద్రిని ముట్టుకుని ఆ క్షణంలోనే అక్కడే కుప్పకూలి చనిపోతాడు."*
*"భర్త ఉద్దేశ్యాన్ని ముందే పసిగట్టిన మాద్రి భయంతో జరుగబోయే చెడును ఊహించి తన భర్త అయిన పాండు మహారాజుకు వద్దని చెబుతూ అతడి నుంచి దూరం దూరం జరుగుతున్నా అతడు అదేదీ వినిపించుకోకుండా తనలోని కామాన్ని అదుపు చేసుకోలేక ఆమె మీదకు వచ్చి మరీ ఆమెను తాకి అక్కడే కుప్పకూలి మరణిస్తాడు."*
*"చూసారా! ఇక్కడ మనిషి మరణానికయినా సిద్దపడ్డాడు గాని కామాన్ని మాత్రం నియంత్రించుకోలేకపోయాడు."*
*"అత్యంత శక్తి కలిగిన కామానికి లొంగిపోయి నేరుగా వెళ్లి మృత్యువు నోట్లో పడ్డాడు."*
*"ఈ సంఘటన మానవునికి తెలియజేసేది ఏంటంటే మానవుడు గనక మృత్యువును జయించాలనుకుంటే దానికంటే శక్తి కలిగిన కామాన్ని “బ్రహ్మచర్యం” రూపంలో ఒక ఆయుధంగా తనలో కలిగివుండి మృత్యువుతో ఆడబోయే చివరి ఆట కోసం సిద్దమై ఉండాలి అని."*
*"అప్పుడిక మృత్యువు ఓటమి ఖాయం మానవుని విజయం తధ్యం."*
*"స్త్రీ పురుష శరీరాల మద్య జరిగే సంభోగం అనే వ్యవహారం ఈ మనస్సుకు తిరిగి అనేక జన్మలు ఈ లోకంలోకి రావడానికి అవసరమయినంత శక్తిని ఇస్తోందని జనులంతా గ్రహించాలి."*
*"ఈ లోకంలో మత్తుపానీయాలు, మాంసాహారం, స్త్రీ పురుష సంభోగం అనే మూడింటిని పొందడం కోసం జనులలో అనేకులు ధర్మమార్గాన్ని వదలిపెట్టి మరీ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు."*
*"ఇదంతా ఎంతో విచారకరం."*
*"శ్రీ రామకృష్ణ పరమహంస, శ్రీ గౌతమ బుద్ధుడు, శ్రీ స్వామి వివేకానంద, శ్రీ షిర్డీ సాయిబాబా, శ్రీ రమణ మహర్షి, శ్రీ వెంకయ్య స్వామి లాంటి మహాపురుషులు ఇంకా లోకంలోని అనేకమంది మహాపురుషులు లోకానికి తెలియజేసింది ఏమిటి?"*
*"ఆ మహాపురుషులంతా తమ శరీరాలను మనసు కోరుకునే తాత్కాలిక సుఖ భోగాల వైపు వెళ్ళనివ్వకుండా తమ బుద్ధి బలంతో మనసును కట్టడి చేసి ప్రారబ్దం ఉన్నంత వరకూ ఈ మానవ లోకంలో శరీరంతో ఉంటూ వారి జీవిత కాలంలో వారు గడిపిన జీవితమే లోకంలోని తక్కిన ప్రాణుల ముక్తికి ఒక మార్గంగా చూపి చివరికి ఒకరోజు వారు తమ భౌతికశరీరాన్ని త్యజించి ‘అనంతమయిన ఆనందం’ లభించే ‘ఆత్మ’ అనే స్వస్వరూప స్థితిలో ఏకమైపోయారు."*
*"లోకం లోని జనులు “భగవంతుడు” అని పలికేది అలాంటి జీవితాన్ని గడిపిన ఆ ఆదర్శ మహాపురుషులనే."*
*“ఆ మహా పురుషులకు శతకోటి హృదయపూర్వక నమస్కారాలు”."*
*"చూసారా..! కేవలం “విచారణ చేయకపోవడం” అనే పొరపాటు వల్లే మానవుడు ఈ “మానవజన్మ” అనే మహత్తరమయిన అవకాశాన్ని చేజేతులా వ్యర్దం చేసుకుంటున్నాడని తెలుస్తోంది గదా!"*
*"జ్ఞానులు మానవ శరీరం యొక్క పరమ ప్రయోజనమయిన మోక్షం కొరకు ఎన్నో ఉపాయాలు చెబుతున్నా కొందరిలో ఇంకా సందేహాల మబ్బులు తొలగడం లేదు."*
*"వారిలా అమాయకంగా ప్రశ్నిస్తున్నారు."*
*"మా వద్ద పుష్కలంగా డబ్బు ఉన్నప్పుడు తినాలి అనిపించినవన్నీ తినడం, తాగాలి అనిపించినవన్నీ తాగడం, కొనాలి అనిపించినవన్నీ కొనడం, చూడాలి అనిపించినవన్నీ చూడడం, అనుభవించాలి అనుకున్నవన్నీ అనుభవించడం చేస్తే అసలు తప్పేంటి?"*
*"ఇవన్నీ చెయ్యడం వల్ల మాకు ఆనందం కలుగుతోంది కదా!"*
*"పోయేరోజు వచ్చినప్పుడు ఎలాగూ పోతాం."*
*"అనుభవించినా పోతాం. అనుభవించకపోయినా పోతాం."*
*"మరి ఎన్నో సుఖాలు అనుభవించగలిగే స్తోమత కలిగి ఉండి ఎందుకు ఊరకే కూర్చోవాలి."*
*"ఎందుకని మేము మా కోరికలను చంపుకుని దుఃఖంతో జీవించాలి!"*
*"అని అడుగుతున్నారు."*
*"వారి ప్రశ్నలకు సమాధానం చూద్దాం."*
*"మరణంతోనే మనిషి జీవితం గనక సమాప్తం అయ్యేట్లయితే అసలు మనిషికి ఇక దిగులు ఎందుకు ఉంటుంది?"*
*"మీరు చెప్పినట్లే అన్నీ చెయ్యవచ్చు."*
*"తాగి తిని మత్తుగా ఏ చెట్టు క్రిందో నడుం వాల్చి పొడుకోవచ్చు."*
*"అలాగే మరణమే గనక మనిషి జీవితానికి అంతిమం అయితే అప్పుడు ఇక ఈ లోకంలోని జనులకు భయం దేనికి?"*
*"సత్యం పలకడం ఎందుకు?"*
*"ధర్మంగా ఉండటం ఎందుకు?"*
*"జీవించడానికి ఎన్నో నియమాలు ఆంక్షలు ఎందుకు?"*
*"మరణమే మానవ జీవితానికి అంతిమఘట్టం అయితే కర్మలు చేసేటప్పుడు ఇది పుణ్యం ఇది పాపం అనే భావనలు మనలో ఎందుకు కలుగుతున్నాయి?"*
*"ఈ శరీరంతో పాటు మనిషి కూడా మరణించేట్లయితే అప్పుడు అది అందరూ పండగ చేసుకోవాల్సిన విషయమే అవుతుందిగాని దుఖించాల్సిన విషయం ఎందుకు అవుతుంది?"*
*"ఎందుకంటే మరణం తర్వాత ఇక ఏమీ లేదు అనుకుంటే ఇక అది మోక్షంతో సమానమే గదా!"*
*"అప్పుడు ఇక్కడెవడు ఉంటాడు."*
*"మరణంతో దుఃఖం మొత్తం ముగిసిపోయేపని అయ్యేట్లయితే అప్పుడు అందరూ మరణం బాట పట్టేవారే గదా."*
*"కానీ లోకంలో అలా జరగట్లేదే!"*
*"మరణం అంటేనే మనిషి భయపడుతున్నాడు."*
No comments:
Post a Comment