Tuesday, February 14, 2023

9. ఆత్మ జ్ఞానం, మోక్షమార్గం

 🙏🕉🙏                    ...... *"శ్రీ"*

                 🔥 *"9"* 🔥
   🔥🔥 *"ఆత్మ జ్ఞానం"* 🔥🔥
   🔥🔥 *"మోక్షమార్గం"* 🔥🔥
     💖🔥💖🔥💖🔥💖
           💖🔥🕉🔥💖
                 💖🔥💖
                       💖
*"ఆకాశాన్ని అగ్ని దహించగలదా ?"* 

*"ఆకారం లేని దాన్ని మృత్యువు ముట్టుకోనైనా లేదు."* 

*"ఈ శరీరం నేను అనుకున్నవాడికి మరణం తప్పదు."*

*"ఇక మరణించిన వాడు తిరిగి జన్మించక తప్పదు."* 

*"మనస్సు మరణిస్తేనే ముక్తి."* 

*"శరీరం మరణిస్తే మనస్సు ఇంకో శరీరమనే బ్రమను పొంది “ఇదే నేను” అని అనుకుంటూ మళ్ళీ మళ్ళీ ఈ పంచ లోకాలు అనే బ్రమల్లో తిరిగాడుతూనే వుంటుంది."*

*"ఈ ప్రపంచాన్ని మనస్సు నమ్మినంతకాలం ఏదో ఒక శరీర రూపంలో అది ఈ ప్రపంచంలోనే తిరుగాడుతూ ఎప్పటికప్పుడు ఈ శరీరమే నేను అనుకుంటూ సుఖదుఃఖాలనే బ్రమలను పొందుతూనే వుంటుంది."* 

*"సత్యాన్ని ఎరగనంత వరకు మానవునికి ఎప్పటికీ శాంతి లబించదు."* 

*"ఇంకా చెప్పాలంటే ఈ శరీరాలకు వచ్చేవి నిజమయిన వ్యాధులు కాదు."* 

*"ఈ అనేకమైన ఆకారాలుగా కనిపిస్తున్న ఈ శరీరాలే అసలయిన వ్యాధులు."* 

*"మానవ శరీరం ఒక వ్యాది."* 

*"పశు శరీరం ఒక వ్యాది."*

*"పక్షి శరీరం మరొక వ్యాది."* 

*"ఈ వ్యాధులన్నీ ఆత్మను వదలి మనస్సును నమ్మడం అనే అజ్ఞానం వల్ల కలుగుతున్నాయి."* 

*"మనస్సును జయిస్తేనే ఈ శరీరాలనే వ్యాదులనుంచి ఆత్మకు ముక్తి."* 

*"అప్పుడే జీవుని ఆనందమయ ఆత్మ స్వరూపం జీవునికి అనుభవంలోకి వస్తుంది."*

*"అంత వరకూ జన్మ - మృత్యువు అనే భ్రమలు ఆత్మకు తప్పవు."*

*"ఇక ఇక్కడ ఈ కంటికి ఎదురుగ్గా ఈ ప్రపంచం, ఈ శరీరాలు ఇంత స్పష్టంగా కనిపిస్తుంటే ఇదంతా స్వప్న మాత్రం ఆకారం ఉన్నట్లుగా కనిపించినా ఇవన్నీ ఆకారం లేనివే అని ఎలా అనుకోగలం అనే సందేహం రావచ్చు."*

**తప్పక వస్తుంది కూడా."*

*"సందేహాలన్నీ తొలగితేనే ఆత్మ ప్రకాశిస్తుంది."*

 *"కాబట్టి ఇదంతా ఎలా స్వప్న మాత్రమో ఇప్పుడు తెలుసుకుందాం."*

*"స్వప్నం స్వప్న సమయంలో సత్యం."*

*"మెలుకువ వచ్చాక అసత్యం."*

*"మెలుకువ రానంత వరకు అసత్యం అని తెలీదు గదా!"* 

*"సత్యం లానే అనుభవాలు పొందుతున్నాం."* 

*"మరి మెలుకువ వచ్చాక స్వప్న ప్రపంచమంతా ఎటు పోయినట్లు?"*

*"ఎటయినా పోవడానికి అసలు వుంటేనే గదా!"* 

*"మెలుకువ రాగానే ఇదంతా లేనిదే అని మనకు తెలిసిపోతుంది."*

*"మనిషిలోని చిత్ చైతన్యమే భ్రమచేత జీవులుగా, వస్తువులుగా, ప్రపంచంగా తనే కల్పన చేసుకుని అదంతా తన ఎదురుగ్గా ఉన్నట్లుగా దర్శించింది తప్ప చిత్ చైతన్యంకంటే వేరయిన బాహ్య ప్రపంచం స్వప్నంలో ఎక్కడుంది?"* 

*"ఇదంతా భ్రమ అని స్వప్నం నుంచి మెలుకువ వచ్చాక మాత్రమే మనం అర్ధం చేసుకుంటున్నాంగాని అనుభవాలు పొందే సమయంలో మాత్రం సత్యమనే భావిస్తున్నాం కదా!"* 

*"అదేవిదంగా ఈ కంటికి కనిపించే ఈ ఎదురుగ్గా వున్న ప్రపంచం కూడా ఇప్పటి మాయా దృష్టికి ఎవరు ఎంత భోదించినా ఇదంతా ఎదురుగ్గా లేదంటే నమ్మలేం."* 

*"కనిపించేదంతా ఉన్నదనే అనుకుంటాం."* 

*"స్వప్న సమయంలో స్వప్న అనుభవాలు అన్నీ భ్రమ మిధ్య అని అనుభవించే సమయంలో ఎలా తెలీదో ఇప్పటి ఈ ప్రపంచం కూడా స్వప్నంలాగే మిధ్య అంటే ఇప్పుడు మనం నమ్మలేం.""*

*"ఒకటి గమనించండి స్వప్నం స్వప్న సమయంలో సత్యం."* 

*"మెళుకువలోకి వచ్చాక స్వప్నం యొక్క రూపం ఏంటి?"* 

*"అది కేవలం ఒక అనుభవం మాత్రమే గదా."* 

*"జరిగిపోయిన స్వప్నాన్ని మళ్ళీ ఇంకోసారి చూడాలి ఎదురుగ్గా రా అంటే వస్తుందా?"* 

*"రాదుగదా! "*

*"అలానే నిన్న మనం ఈ శరీరంతో ఈ లోకంలో అనుభవించినవన్నీ నేడు మన కంటి ఎదురుగ్గా రమ్మంటే తిరిగి వస్తాయా?"*

*"మరి ఈ శరీరంతో లోకంలో అనుభవించేవన్నీ నిజంగా ఉన్నవి అయితే నిన్నటి రోజుని మనం కోరుకుంటే నేడు ప్రత్యక్షం చేసుకోగలగాలి గదా!"*

*"అలా ఎవరయినా ఈ లోకంలో నిన్నటి జరిగిపోయిన రోజులోని సంఘటనలను తిరిగి నేడు ప్రత్యక్షం చేసుకోగలుగుతున్నారా?"*

 *"అలా చేసుకోలేనప్పుడు నిద్రలోని స్వప్నానికీ, శరీరంతో నిన్న గడిపిన రోజుయొక్క సంఘటనలకు తేడా ఎక్కడుంది."*

*"స్వప్నం మెలుకువలోకి వచ్చాక ఊహా మాత్రం."*

*"అలాగే నిన్నటి భౌతిక అనుభవాలు నేటికి ఊహామాత్రం!"* 

*"రెంటికీ భేదం ఎక్కడుంది. ఆలోచించండి."*

*"ఇప్పటి ఈ కంటికి కనిపిచేదంతా “స్వప్న సమానమే” అనే సత్యాన్ని స్పష్టంగా అర్ధం కావడానికి మరింత వివరంగా ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం."*

*"శ్రద్ధగా గమనించండి."*

*"నిన్న రాత్రి ఒక స్వప్నాన్ని దర్సించాం."* 

*"పొద్దున మెలుకువ వచ్చింది."*

*"మళ్ళీ నేటి రాత్రి ఇంకొక స్వప్నాన్ని దర్శించాం."* 

*"నిన్న రాత్రి దర్శించిన స్వప్నానికి నేటి రాత్రి మొదలయ్యే స్వప్నం కొనసాగింపుగా ఉంటుందా?"*

*"ఉండదు."* 

*"ప్రతి రోజూ ఒక కొత్త స్వప్నం వస్తుంది గాని నిన్న రాత్రి స్వప్నం ఆగిన చోటు నుంచి నేటి రాత్రి స్వప్నం కొనసాగదు."* 

*"కాని ప్రతి రోజు రాత్రి గడచిన తర్వాత పొద్దున మెలుకువ రాగానే అదే ఇల్లు."*

*"అదే మంచం."*

*"అవే వస్తువులు."* 

*"తల్లి తండ్రి భార్య పిల్లలు రాత్రి పొడుకునే ముందు చూసినవే పొద్దున యధాతదంగా ప్రతిరోజూ కనిపిస్తున్నాయి."* 

*"కాబట్టే స్వప్నం మిధ్య."*

*"శరీరంతో దర్శించే ఈ ప్రపంచం మాత్రం సత్యం అని మనం నమ్ముతున్నాం."*

*"ప్రతిరోజూ స్వప్నంలోంచి మెలుకువ రాగానే మనం ఏమనుకుంటున్నాం."* 

*"ఇదంతా అసత్యం మిధ్య అనుకుంటున్నాం గదా."*

*"అంటే నేను స్వప్నంలో చూసిందంతా వాస్తవానికి వున్నది కాదు అని అనుకుంటున్నాం."*

*"అలా అనుకోవడం వల్ల స్వప్న సంఘటనలు మనస్సులో లేకుండా అప్పటికప్పుడే తొలగిపోతున్నాయి."* 

*"స్వప్నం అసత్యం భ్రమ అని భావించడం వల్ల స్వప్న లోకమంతా మనస్సులోంచి తొలగిపోతుంది."* 

*"క్రిందటి రోజు స్వప్నం మన మనసులో లేకుండా పోవడం వల్ల తర్వాతి రోజు ఇంకొక కొత్త స్వప్నం మొదలవుతోంది."*

*"క్రితం రోజు ఆగిన చోటునుంచి స్వప్నం కొనసాగాలంటే క్రితంరోజు స్వప్నం మనసులో నిలిచి వుండాలి కదా?"* 

*"ప్రతి స్వప్నం తర్వాత మెలుకువ రాగానే ఇదంతా అసత్యం భ్రమ అని భావించడం వల్ల ముందు రోజు స్వప్నం మనస్సులో లేకుండా పోయి తర్వాతి రోజు తిరిగి మరొక కొత్త స్వప్నం మొదలవుతోంది."*

*"నిన్నటి స్వప్నం మనసులో లేకుండా పోవడం వల్ల కొత్త స్వప్నంలో నిన్నటి స్వప్న సంఘటనలు కొనసాగడం లేదు అలాగే గుర్తుకి కూడా రావడంలేదు."*

*"అలాగే గత జన్మలో మరణించిన మనం మరణమనే మూర్చ తర్వాత స్వప్నంలోంచి మెలుకువలోకి వచ్చిన రీతిగానే మరొక శరీరాన్ని కలిగి వుండి అప్పటివరకూ అనుభవించిన క్రితం జన్మలోని సంఘటనలన్నీ స్వప్నం అని మనసులో భావించడం జరుగుతుంది."* 

*"స్వప్నం అని భావించిన గతజన్మ సంఘటనలను అక్కడికక్కడే మనసులోంచి చెరిపేసి ఇక అక్కడినుంచి అప్పుడు కలిగి వున్న శరీరానికి చెందిన అప్పటి వర్తమానపు బంధాలతో కొనసాగడం జరుగుతోంది."*

 *"అలా కొనసాగేదంతా నిజం అనుకుంటూ నా భార్య, తల్లి, పిల్లలు, సంపదలు అనుకుంటూ తిరుగాడుతున్నాం."*

 *"ఈ జన్మలో మళ్ళీ మరణమనే మూర్చ ఎప్పుడు కలుగుతుందో అక్కడే మరియొక శరీరంలోకి ప్రవేశించి ఈ జన్మను ఇక్కడి భార్యను, పిల్లలను సుఖ దుఃఖాలనే అనుభవాలను స్వప్నం వలే భావించి అప్పుడు కలిగి వున్న అప్పటి శరీరాన్నే సత్యం అనుకుంటూ సాగిపోతున్నాం."*

*"ఎలా స్వప్నం అసత్యం, భ్రమ  అని మెలుకువ వచ్చాక భావించడం వల్ల తర్వాతి రోజు స్వప్నంలో క్రిందటి రోజు రాత్రి దర్శించిన స్వప్నం తెలియడంలేదో అదేవిదంగా ఒక జన్మ అనే స్వప్న సంఘటనలు మరణం అనే మూర్చ తర్వాత అసత్యం స్వప్నం అని భావించడం వల్ల తర్వాతి జన్మ అనే స్వప్నంలో క్రిందటి జన్మ అనుభవాలు జ్ఞాపకాలు కొనసాగడం లేదు."* 

*"చూశారా ఈ మాయ! ఇది  ఏమంత సామాన్యమయినది కాదు."*

*"గత జన్మ ఈ జన్మకు స్వప్నం."* 

*"ఈ జన్మ రాబోవు జన్మకు స్వప్నం."*

*"ఎప్పటికప్పుడు ఈవిడే నా భార్య, వీరే నా పిల్లలు, ఇదే నా ఇల్లు, ఇవన్నీ నా ఆస్తులు అనుకుంటూ లక్షల కోట్ల స్వప్నాలలో తిరుగాడుతున్నాం."*

*"అందుకే గత జన్మ అనుభవాలు ఈ జన్మలొనూ,  ఈ జన్మ అనుభవాలు తర్వాతి జన్మలోను జ్ఞప్తికి రావడం లేదు."* 

*"సత్యం అని నమ్మిందే మనసులో ఉండిపోతుంది."*

*"మనసులో ఉన్నదే ముందుకు కొనసాగుతుంది."*

*"మనసులో లేనిదేదీ ముందుకు కొనసాగదు."*

*"ఈ ప్రపంచమంతా స్వప్నమాత్రం అని అర్ధమవుతోంది గదా!"*
             💖🔥💖🔥💖
                   💖🕉️💖
         

No comments:

Post a Comment